ప్రచురణార్థం తేదీ 18-8-2021
బుట్టాయిగూడెం
దళిత యువకుడు ముప్పిడి రాజు మృతిపై సమగ్ర విచారణ చెయ్యాలి
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామస్తులు ముప్పిడి రాజు గత 13వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందింది చెరువులో పడి ఉండటాన్ని గమనించిన గ్రామ ప్రజలు అదే గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణ రైతు దగ్గర పాలేరుగా పని చేస్తున్నా ముప్పిడి రాజు ను కొట్టి హత్య చేశారని ఆరోపణలు ఉన్నందున సమగ్ర విచారణ చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుట్టాయిగూడెం తాసిల్దార్ కార్యాలయం ముందు పౌర హక్కుల సంఘం CLC జిల్లా ఉపాధ్యక్షులు బి శ్యాం బాబు అధ్యక్షతన జరిగిన ధర్నాలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్. కుల వివక్ష పోరాట కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల ప్రాన్సిస్ లు మాట్లాడుతూ శ్రీనివాసపురం లో దళిత యువకుడు ముప్పిడి రాజు మృతి ముమ్మాటికీ హత్య నేనని.
హత్య చేసిన వారికి రాజకీయ అండదండలు ఉన్నాయని అధికారులు కూడా దోషులకు సహకరిస్తున్నారని వారు అన్నార. హత్య చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు హత్య కేసు బాల కార్మిక నిరోధక చట్టం కేసులు నమోదు చేసి ఉన్నారు విచారణ పారదర్శకంగా సమగ్రంగా జరగాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయి ఉన్నందున విచారణ తో సంబంధం లేకుండా చట్టంలో ఉన్న ప్రభుత్వ ఇవ్వవలసిన ప్రోత్సాహాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దోషులను వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని ముప్పిడి రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు అనంతరం తాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ పాయం రమేష్ కు వినతి పత్రం ఇచ్చారు , ఈ ధర్నాలో దళిత యువత వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్నాయి అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS. బి రాజేష్. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తెల్లం రామకృష్ణ. సి ఐ టి యు. నాయకులు తెల్లం నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కారం భాస్కర్. జర్నలిస్ట్ మర్రి రమేష్ , న్యాయవాది వి కిషోర్, నక్క శివాజీ, ఉండ్రాజవరం పెంటయ్య ,ప్రకాష్ .,బాబు దుర్గాప్రసాద్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇట్లు
B.శ్యాం బాబు, న్యాయవాది. జిల్లా ఉపాధ్యక్షులు. పౌర హక్కుల సంఘం CLC. పశ్చిమగోదావరి జిల్లా.
Comments
Post a Comment