ప్రేమోన్మాది శశికృష్ణని శిక్షించాలని ఆందోళన | ప గో జిల్లా

ప్రెస్ నోట్ జంగారెడ్డిగూడెం 17. 08. 20 21

 గుంటూరు లో ఇంజనీరింగ్ విద్యార్థి రమ్యని అత్యంత కిరాతకంగా దాడిచేసి కత్తితో పొడిచి హత్య చేసిన ప్రేమోన్మాది శశికృష్ణ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పౌరహక్కుల సంఘం పలు ప్రజాసంఘాలు కి చెందిన న్యాయవాదులు జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, న్యాయవాది బి శ్యాం బాబు మాల మహానాడు లీగల్ సెల్ కార్యదర్శి తొర్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ 74 సంవత్సరాల భారత స్వపరిపాలన కాలంలో దళితులకు రక్షణ,భద్రత లేకపోవడం సిగ్గుచేటని అన్నారు.

 దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు భారతీయ సమాజంలోని కుల వ్యవస్థ లో భాగంగానే జరుగుతున్నాయని ఆరోపించారు. అగ్రకుల అహంకారం సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతుంది అని ఆవేదన చెందారు. రమ్య కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, కుటుంబం కి భూమి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కుటుంబానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. హత్యచేసిన శిశి కృష్ణ ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషనల్ డైరెక్టర్ న్యాయవాది జి. మణికుమార్ న్యాయవాదులు బిందు, ఓ. సర్వేశ్వరరావు, శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు. బి. శ్యాంబాబు న్యాయవాది జిల్లా ఉపాధ్యక్షులు. పౌరహక్కుల సంఘం . పశ్చిమ గోదావరి జిల్లా.

Comments