హత్యలపైన జ్యూడిషయల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరపాలి | పశ్చిమ గోదావరి జిల్లా

ప్రెస్ నోట్ పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెం 16-08-2021.               

    శ్రీనివాస పురం గ్రామం లో జరిగిన ముప్పిడి రాజు హత్య తో పాటు గతం లో జరిగిన 4 హత్యల పైన జ్యూడిషయల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరపాలి.       

   *పౌర హక్కుల సంఘం( CLC) డిమాండ్. * 
            
   పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జ శ్రీనివాసపురం గ్రామ దళిత పాలేరు ముప్పిడి రాజు హత్యపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని,రాజు హత్య తో పాటు గతం లో జరిగిన 4 హత్యల పైన జ్యూడిషయల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.          గత 4 రోజులుగా పౌర హక్కుల సంఘం, కుల వివక్ష పోరాట సమితి, బీఎస్పీ, మాలమహానాడు, ఎమ్మార్పీఎస్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, సిఐటియు, దళిత హక్కుల పోరాట సమితి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తదితర ప్రజాసంఘాలు గత 4 రోజుల నుండి ఆందోళన చేస్తున్నాయి. అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని హత్యకు గురైన  రాజు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని ఐదు ఎకరాల భూమిని కుటుంబానికి మంజూరు చేయాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రభుత్వ  ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.

ముప్పిడి రాజు శవాన్ని హంతకులు  ఇంటి ముందు పెట్టి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, దళిత, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు ఆందోళన చేశారు. సంఘటనా స్థలంలోనే శవపంచనామా నిర్వహించాలని ఎమ్మార్వో సమక్షంలో పంచనామా జరపాలని డిమాండ్ చేశారు అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసులు రిజిస్టర్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.  సెక్షన్ 302 (మర్డర్), ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, 201,120బి తదితరసెక్షన్ లు నమోదుచేసి దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ముప్పిడి రాజు హంతకులను అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.గ్రామం లో ఇప్పటివరకు 5 హత్యలు జరిగినట్లు గ్రామస్తులు తెలియ చేస్తున్నారు. వీటి పై జ్యూడిషయల్ కమిషన్ ఏర్పాటు చేసి  బాధితు లు అందరికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామం లో దళితులకు రక్షణ కల్పించాలి అని డిమాండ్ ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. రాజు తల్లిదండ్రులు ని పరామర్శించి ఓదార్చారు.

మాదిగ,రెల్లి కార్పొరేషన్ చైర్మన్స్ కనకారావు,మధుసూదన్ జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి అంజి,ప్రముఖ విద్యా వేత్త అలుగు ఆనంద శేఖర్ లు  హాస్పిటల్ వద్ద ఆందోళన లో పాల్గొని మద్దతు తెలిపారు.   అనుమానాస్పద కేసుగా నమోదు చేయడాన్ని వారు తప్పు బట్టి కేసు వివరాలు sp రాహుల్ దేవ్ శర్మ దృష్టికి తీసుకు వచ్చి హత్య కేసు గా మార్చాలని కోరారు. Sp సమగ్ర విచారణ జరిపి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పోలీసులు ని అధికారులను ఆదేశించారు. కుల వివక్షత పోరాట సమితి అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ కేసును తారుమారు చేయడానికి పోలీసులు నిందితులతో  కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

పి డి ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని హంతకులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు,న్యాయవాది బి. శ్యాం బాబు మాట్లాడుతూ గ్రామంలో ఒకే ఇంటిపేరు కలిగినటువంటి కుటుంబాలవారు ఇప్పటివరకు 5 హత్యలు చేసినట్లు గ్రామస్తుల ఆరోపిస్తున్నారని దీనిపై ప్రభుత్వం తక్షణం జ్యూడిసియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, భాదితులు అందరికి న్యాయం జరపాలని డిమాండ్ చేశారు. దళితులకు పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనంద శేఖర్ మాట్లాడుతూ అగ్రవర్ణాలు దళితుని హత్య చేయడం డబ్బులు ఇచ్చి కేసు ని మాఫీ చేయడం, వారికి పోలీసులు అండగా నిలబడటం పరిపాటిగా మారిపోయింది అని ఆరోపించారు. 

దళితుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసునుతారుమారు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి అని  డిమాండ్ చేశారు. Cpm రవి, సి ఐ టి యు సుభాషిని తదితరులు మాట్లాడుతూ దళితుల ప్రాణాలు చాలా ఈజీగా తీస్తున్నారని గ్రామాల్లో దళితులకు రక్షణ లేదని ఆవేదన చెందారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు గల మందల శ్రీనివాస్, రామారావు మాట్లాడుతూ రాజు హత్య పైన, కుటుంబానికి న్యాయం చేయక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాల మహానాడు రాష్ట్ర లీగల్ కార్యదర్శి తొర్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ హంతక కుటుంబ బందువులతో పోలీసులు మంతనాలు పలు అనుమానాలు ని రేకెత్తిస్తోంది అన్నారు. హంతకులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పించటానికి పోలీసులు చేస్తున్న ఇంకా ఈ ఆందోళన కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాలు హక్కుల సంఘాలు నాయకులు పలువురు పాల్గొ ని ముప్పిడి రాజు హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నిర్వహించడంలో రెవెన్యూ పోలీసులు జాప్యంపై తీవ్ర అసంతృప్తిని ప్రజాసంఘాలు తెలియజేశాయి గ్రామములో హంతకుల బంధువుల ఇళ్ల వద్ద పోలీసులు ఆశ్రయం తీసుకోవటం వారితో మంతనాలు జరపటం దళిత ప్రజాసంఘాలు,హక్కుల విద్యార్థి సంఘాలు నాయకులు న్యాయవాది మణికుమార్,DHPS పాతిమ,PDSU మహర్షి,తదితరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 ప్రజా సంఘాలు ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన ఉన్నటువంటి వినతిపత్రాన్ని మండల తాసిల్దార్ గారికి సమర్పించడం జరిగింది సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఇప్పుడు రాజకుటుంబానికి దళితులకు గ్రామాల్లో రక్షణ కల్పించాలని 50 లక్షల రూపాయలు ఎత్తివేసేందుకు ప్రభుత్వం తక్షణం ప్రకటించి కుటుంబానికి ఐదెకరాల భూమిని ప్రభుత్వ ఉద్యోగాన్ని కుటుంబ లో ఒకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.           ప్రజా సంఘాల డిమాండ్ మేరకు మండల తహసీల్దార్ అధికారులు తో వచ్చి పంచనామా నిర్వహించారు. కేసు ని 302Ipc, Sc,St అట్రాసిటీ కేసు గా మారుస్తామని DSP  హామీ. ఇచ్చారు. ఇది కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు సాదించిన పాక్షిక విజయం. హంతకులను అరెస్ట్ చేసి శిక్షించే వరకు,కుటుంబానికి న్యాయం చేసే వరకు కుటుంబానికి అండగా నిలబడి పోరాడతామని దళిత,హక్కుల,ప్రజా సంఘాలునాయకులు తెలిపారు.      

  ఇట్లు                       
    
  భాషా శ్యాం బాబు న్యాయవాది                     
  జిల్లా ఉపాధ్యక్షుడు         
 పౌర హక్కుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా శాఖ.

Comments