సూడో దేశభక్తుల నుండి భారతదేశాన్ని రక్షించుకుందాం!
ఇటీవల ఫేస్బుక్ లోనూ, సోషల్ మీడియాలోనూ రిజర్వేషన్లు ఆర్ధిక ప్రాతిపదికన ఇవ్వాలని మనువాదులు కొంతమంది ప్రస్తుత రిజర్వేషన్ వర్గాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. సూడో దేశభక్తులు కులం, మతంలను రెచ్చగొట్టి అధికారం చేపట్టినారు. వారు నేడు దేశపౌరులను, ప్రగతిశీల శక్తులను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. అధికారం కోసం నీచమైన పనులకు ఒడిగడు తున్నారు.అన్యాయాన్ని,అవినీతిని ప్రశ్నించే చైతన్యాన్ని నేరమయం చేస్తున్నారు. వీరి ఆగడాలను ప్రశ్నించకుండా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. సుష్క్రియా పరులుగా తయారు చేస్తున్నారు. అధికార మదం తో కశ్మీర్,ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు వీరు చేసిన హింసాయుత ఆగడాలు కి అదుపు లేదు.చట్టం,రాజ్యాంగం ఊసే లేదు. అధికార మార్పిడి తర్వాత భారతీయ సమాజంలో ఉన్న కుల వివక్షత, అంటరాని తనానికి తరతరాలుగా బలై పోయిన బాధిత వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు చేయూత ఇవ్వటం కోసం రాజ్యాగం లో రిజర్వేషన్లు ని ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్లు ని రాజ్యాంగం పేదలు ధనికులు అనే తేడా చూసి ఇవ్వలేదు.రిజర్వేషన్లు సాంఘిక, వివక్షత,అణచివేత, అంటరానితనం, గురయ్యే బాధిత నిమ్న,వెనుకబడిన కులాలను ఉద్దేశించి మాత్రమే ఇవ్వటం జరిగింది.
Article 46 of the Constitution states that "The State shall promote with special care the educational and economic interests of the weaker sections of the people, and, in particular, of the Scheduled Castes and them Scheduled Tribes, and shall protect them from social injustice and all forms of exploitation." ఎస్సీ ఎస్టీ బీసీ లకు మొత్తం కలిపిన 50% రిజర్వేషన్లు. జనాభా లో వీరు 85% ఉన్నారు. 15% ఉన్న అగ్రవర్ణా లు మొదట నూరుశాతం తర్వాత 50% అనుభవిస్తున్నారు. ఓసీ కేటగిరీలో లబ్ది పొందుతుంది అగ్రవర్ణ దనికులే. అక్కడ పేదలకు న్యాయ జరగటం లేదు. దానికోసం అగ్రవర్ణ పేదలు పోరాడాలి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం కోసం పోరాడాలి. రాజ్యాంగ బద్ద హక్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లపై కాదు. అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేస్తుంది అగ్రవర్ణ దనికులే అనే వాస్తవాన్ని గుర్తించాలి.
ఇప్పటికి రాజకీయ రంగంలో, పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో 90% అగ్రవర్ణ దనికులే అనుభవిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేదలకు దేశ సంపదలో వారి వాటా వారికి దక్కేవరకు ఆ వర్గాల రిజర్వేషన్లు గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు అనే విషయాన్ని గమనించాలి. అందరికి విద్య. ఉపాధిని ఇవ్వలేని ప్రభుత్వాలు, వారి అనుచర గణాలే ప్రజలమధ్య ఇలాంటి ఆవేశాలను రెచ్చగొట్టి లబ్ది పొందుతాయి. యువత ఏమరుపాటు గా ఉంటూ అలాంటి అసాంఘిక శక్తులకు దూరం గా ఉండాలి. అందరికి విద్య - ఉపాధికోసం ప్రభుత్వాలు పై పోరాడండి. కానీ సమాజంలో బాధిత కులాలకు రాజ్యాంగ బద్దంగా ఇచ్చే రిజర్వేషన్లు ని ప్రశ్నించటం అసంబద్దం. ఆశాస్త్రీయం అవుతుంది. ఇప్పటికి దళితులు రాష్ట్రపతులు అయినా సమాన విలువ, గౌరవం మనువాద భావజాలం ఇవ్వటం లేదు. మన కళ్ళ ముందే వారికి జరుగుతున్న అవమానాలు మనం చూస్తున్నాము. ఇక సామాన్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రోజు ఎక్కడో ఒక చోట దాడులు, హత్యలు, హత్యాచారాలు, వెలి, బహిష్కరణ, అణచివేత, వివక్షత, ఆకలి, అవమానం అనుభవిస్తున్నారు. అందుకే వారికి రిజర్వేషన్లు. సంక్షేమ పథకాలు.
అవి కూడా సక్రమంగా అమలు కావు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు అన్ని మధ్య దళారులు, బ్రోకర్లు, బినామీ లే మింగేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారికోసం కాకుండా బస్సులకు, కలెక్టర్, ప్రభుత్వ కార్యాలయాల్లో రంగులు వేయటానికి ఉపయోగస్తున్నారు. విద్యలో ఉన్నతంగా ప్రధమ శ్రేణుల్లో ఉండే ఎస్సీ విద్యార్థులని ప్రోత్సహించేందుకు బిఏఎస్(బెస్ట్ అవైలబుల్ స్కూల్) స్కీం తీసుకు వచ్చారు. ఆ స్కీం ద్వారా ఎన్నికైన ప్రతిభ గల విద్యార్థులు తమకు నచ్చిన స్కూల్ లో చదువుకుని పై చదువులకు వెళుతున్నారు. ఇది గ్రహించి జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం పేరుతో బిఏఎస్ స్కీం ని రద్దు చేసింది. ఎస్సీ ఎస్టీ పిల్లలతో పాటు అగ్రవర్ణ పేద పిల్లలు డిగ్రీ, పిజి, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చదువులు సహితం ఉచితం గా చదివించే పథకం వైస్సార్ ప్రభుత్వం తీసుకువచ్చింది. దానికి కూడా జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఇప్పుడు నూతన విద్యా విధానం పేరుతో 3,4,5 తరగతుల పిల్లలను హైస్కూల్ కి పంపుతుంది. గ్రామీణ, పట్టణ కాలనీలలో కూలీల,కార్మికుల పిల్లలు దగ్గర లో స్కూల్ ఉంటే స్కూల్ కి వెళ్లి చదవ గలరు.
ఎక్కడో కిలో మీటర్ నుండి 3కిలో మీటర్లు పైగా దూరం వెళ్లి ఎలా చదువుతారు. వారిని బడికి, చదువు కిదూరం చేయటమే అవుతుంది.వారికి భద్రత ఉండదు. మరో వైపు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగంలోని వేలు,లక్షల కోట్లు ఆస్తులు ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమలు లాంటి పరిశ్రమలని ప్రవేటీకరిస్తున్నారు. దేశ సంపదను కార్పొరేట్ లకు ధారాదత్తం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. ప్రవేటు రంగంలో రిజర్వేషన్లు ఉండవు అని పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మోడీ, కెసిఆర్, జగన్, బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ ల రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. అంతే కాక వివిధ వర్గాల మధ్య మనువాదులు కులం, మతం లాంటి భావజాలాలను రెచ్చ గొడుతున్నారు. హింసను ప్రేరేపిస్తున్నారు. దళితులు, ముస్లింలపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారు. ఆదివాసీల పాదాల కింద ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ లకు అప్పనంగా కట్టబెడుతున్నారు. అడవిలో ఆదివాసీల మనుగడ లేకుండా చేయటానికి వారిని సాయుధ బలగాలను ఉపయోగించి ఊచకోత కోస్తున్నారు. పోడు భూములనుండి గెంటి వేస్తున్నారు.
మహిళలు, పసిపిల్లను సహితం జైలులో పెడుతున్నారు. అటవీ అధికారులు, జైలు అధికారులు, పోలీసులు అమాయక ఆదివాసీలు పై దాస్టీ కాన్ని ప్రదర్శిస్తున్నారు. వేలాది మంది భారత దేశ ఆదివాసీలు పై విదేశీటెర్రరిస్టులు,ఉగ్రవాదులు మీద ప్రయోగించే దేశ ద్రోహం124a (రాజ ద్రోహం) చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం UAPA (ఉపా) లాంటి ప్రమాదకర చట్టాలను ప్రయోగిస్తున్నారు. అడవిని, అటవీ సంపాదనే కాదు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆదాని, అంబాని లాంటి కార్పొరేట్ లకు కట్టబెట్టటానికి మనురాజ్యాంగ అధినేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే మోడీ, అమిత్ షా లు ప్రభుత్వం 3 అప్రజాస్వామిక వ్యవసాయ చట్టాలను తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా సంవత్సరం కాలంగా లక్షల మంది ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నారు. దేశం లోపల రైతులు ఉద్యమం చేస్తున్నారు. అయినా ఈ పాసిస్టు ప్రభుత్వం బకాసురుడు మాదిరి తెగతిని మొద్దు నిద్ర పోతుంది. భారతీయ ప్రభుత్వ పరిశ్రమలను అడ్డంగా అయిన కాడికి అమ్ముకుని పొతుంది. ఈ విషయంలో బకాసురుడే మెరుగు ఏమోనని అనిపిస్తుంది. ఆరు నెలలు తిని ఆరునెలలు నిద్ర పోతాడు.
ఈ ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వ సొమ్మును, ఆస్తులను, వివిధ పరిశ్రమలను, ఉక్కు పరిశ్రమలను 365 రోజులు అమ్ముకు తింటున్నారు. అందు కోసం ఉన్న 44 లేబర్ చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్ లను తీసుకు వచ్చారు. యాజమాన్యాలకి వరాల బహుమానాలు, కార్మికులకు మొండి చేయి చూపించారు. శ్రామికులు జీవించే హక్కులు తుంగలో తొక్కబడ్డాయి. ఉన్న హక్కులను ఊడ బీకినారు. కరోనా కాలాన్ని మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా తమ కార్పొరేట్ ల అభివృద్ధికి ఉపయోగించుకున్నది. సామాన్య ప్రజల బతుకు బండలు అయ్యింది. మన దేశ అభివృద్ధి కోసం, సమానత్వ సాధన కోసం26 జనవరి 1956 న సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాగం తీసుకువచ్చారు.10 సంవత్సరాలలో సమానత్వం సాధించాలని లక్ష్యంగా రాసుకోవడం జరిగింది. కులం, మతం రూపుమాపి సామ్యవాద (socialist) సమాజ లక్ష్యం ప్రకటించుకున్నాము.
The word socialist was added to the Preamble of the Indian Constitution by the 42nd amendment act of 1976, during the Emergency. It implies social and economic equality. Social equality in this context means the absence of discrimination on the grounds only of caste, colour, creed, sex, religion, or language. తెల్లదొరలు పోయి మన నల్లదొరల పాలన ప్రారంభమై ఇప్పటికీ 74సంవత్సరాలు అయ్యింది. రాజ్యాంగ పీఠికలోని సామ్యవాద సమాజం మాట అటకెక్కింది. దాని ఊసే లేదు. కులం, మతం పేరు తో హింస పెరిగి పోయింది. లౌకిక వాదం గాలికి కొట్టుకుపోయింది. మెజార్టీ మతం హిందుత్వ తీవ్రవాదం ముందుకు వచ్చింది. ప్రజల సెంటిమెంట్ లనుండి ఈవిఎం ల ఉపయోగం తో అధికారంలోకి వచ్చింది. ఫలితం ఆదివాసీలు, దళితులు, ముస్లిం లు, మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. పౌరులు జీవించే హక్కులు, రాజ్యాంగ హక్కులను మాట్లాడటం నేరమైపోయింది. వాటిని ప్రశ్నిస్తున్నవారిని జైలులో నిర్బంధిస్తున్నారు. ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు.
జైలులో సంవత్సరాల తరబడి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. నేరమే అధికారమై న్యాయాన్ని బలితీస్తుంది. స్వేచ్చ, స్వాతంత్ర్యం కోసం ఉరికంబమెక్కిన భగత్ సింగ్, రాజగురు, సుఖఃదేవ్ ల బలిదానాలకు విలువ లేకుండా చేస్తున్నారు. ఎటు పోతుంది మన భారతదేశం? పురోగమించాల్సిన మన భారత్ ని తిరోగమనంలోకి నెట్టేస్తున్న భావజాలాన్ని ఉత్తమ పౌరులుగా దేశభక్తితో నిలువరిద్దాం. మన భారతదేశం ని దేశభక్తి పేరుతో విచిన్నం చేస్తున్న పాసిస్ట్ శక్తుల నుండి రక్షింకుందాం. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 15ఆగస్టు అర్ధరాత్రి భూటకాన్ని గుట్టు విప్పి భగత్ సింగ్, రాజ గురు, సుఖఃదేవ్ లు ఆశించిన ప్రజల నిజమైన స్వేచ్చ, స్వాతంత్ర్యం, సమానత్వం కోసం ఉద్యమిద్దాం. దేశ ప్రజలని టెర్రరిస్టులు, ఉగ్రవాదులుగా మారుస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) రద్దు కోసం, పౌర ప్రజాస్వామిక హక్కులు కోసం జాతీయోద్యమ స్పూర్తితో పోరాడదాం.
✍నంబూరి శ్రీమన్నారాయణ
హైకోర్టు న్యాయవాది,
పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సెల్: 94938 61875
ప్రజాస్వావాదులను కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్మించాలి
ReplyDelete