మహిళలపై దాడులకు వ్యతిరేకంగా సమావేశం | రాయచోటి, కడప జిల్లా

22/08/2021 న కడప జిల్లా రాయచోటి లో పౌర హక్కుల సంఘం...ఆధ్వర్యంలో ప్రజాసంఘాల...తో కలసి మహిళల పై ...దాడులకు వ్యతిరేకంగా ఎన్. జీ. ఓ హోమ్ నందు పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.రవి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..

గుంటూరు లో జరిగిన రమ్య హత్యా సంఘటన చాలా అమానుషం,అత్యంత బాధాకరం ఈ సంఘటన పై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి వెంటనే నిదితుని శిక్షించాలని డిమాండ్ చేశారు..సమాజంలో ఇలాంటి నేరాలు జరగ డానికి పాలకుల నిర్లక్ష్య వైఖరి,పాచ్యాత్య సంకృతి,అశ్లీల పోర్న్ సైట్లు తదితర కారణాలని, ఈ సంఘటనను పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం....ప్రజా పోరాటాల ద్వారానే వీటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు..

            OPDR నాయకులు టి.ఈశ్వర్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మనువాద సిద్దాంతాల ను అమలు చేయడం ద్వారానే జరుగుతున్నాయని పేర్కొన్నారు....

   ముస్లిం మైనారిటీ నాయకులు సగీర్ మాట్లాడుతూ దేశంలో బి.జే.పి రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు,దళితులకు,మైనారిటీలకు జీవితాలకు భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు.
.
  CPI నాయకులు విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉన్నవారికి ఒక న్యాయం , లేనివారి కి మరొక న్యాయం చేస్తున్నారు...ఇది ఎంత మాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు

     MRPS నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ దళిత విద్యార్థి రమ్యశ్రీ హత్యను ఖండిస్తూ... ఈ హత్య కు వెలకట్టడం శోచనీయమని ,వారి కుటుంబ సభ్యుల ను చంపుతామని బెదిరించి రాజీ చేయడం దుర్మార్గమని అన్నారు.

     దళిత బహుజన ఫ్రంట్ నాయకులు జగన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో కి వచ్చి నప్పటి నుండి మహిళల పైదాడులు,హత్యలు,అత్యాచారాలు ఎక్కువగా జరగడమే కాకుండా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వారి పై దాడులు చేసి,అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు..

    పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి. రెడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ,ప్రజలకు అండగా ఉన్న కవులు,కళాకారులు,న్యాయవాదులు,హక్కుల కార్యకర్తల పై దేశ ద్రోహం కేసులు అక్రమంగా నమోదు చేసి అరెస్ట్ చేయడం ప్రభుత్వ పిరికితనం అని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో సహారా సంక్షేమ సంఘం నాయకులు ఇం దాదుల్ల, వడ్డెర విద్యా వంతులు నాయుకులు జీవానందం, CPI నాయకులు విశ్వనాథ్,AITUC నాయకులు ఎలక్ట్రికల్ సంఘం నాయకులు అస్లాం, AISF నాయకులు లవకుమార్, కోటేశ్వర, MRPS నాయకులు నరసింహులు, బి.సి.నాయకులు రమణ,వీర నాగయ్య,రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు...

     ...ప్రజా సంఘాల తరుపున..
 ...ఆర్.రవి శంకర్.
జిల్లా కార్యదర్శి.
పౌర హక్కుల సంఘం..
రాయచోటి.
22/08/2021..
    
.

Comments