తోట త్రిమూర్తులు ను mlc పదవి నుండి రీ కాల్ చేయాలి | సి ఎల్ సి, తూ గో జిల్లా

తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం మండలం, వెంకటాయపాలెం గ్రామం లో 25 సం "క్రితం షెడ్యూల్డ్ కులాల యువకులను ఆ నాటి mla తోట త్రిమూర్తులు శిరో ముండనం చేయించిన కేసు నేటికి పరిస్కారం కాలేదు. కేసుని సత్వరం పరిష్కరించి త్రిమూర్తులును కఠినముగా శిక్షించాలి. కాని జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గవర్నర్ కోటాలో mlc పదవి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ mlc పదవి రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత, మైనారిటీ, వామపక్ష, హక్కుల, విప్లవ, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో రామచేంద్రపురంలో తోట త్రిమూర్తులకు వ్యతిరేకంగా ప్రదర్శనను పోలీసులు అడ్డుకొని ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాము.పౌరులు అందరికి వాక్ సభా స్వాతంత్రాలు ఉన్నాయి, ఉద్యమించే హక్కు భారతరాజ్యాంగం ఆర్టికల్ 19లో కల్పించింది.దళితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి దళితులను దగా చేస్తున్నారు. అణచివేత, అరెస్టులతో ఉద్యమాన్ని అణచ లేరు. అరెస్ట్ చేసిన ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలి, తోటత్రిమూర్తులు mlc పదవిని రీకాల్ చేసి దళితుల మనోభావాలను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. . వేడంగి చిట్టిబాబు పౌరహక్కులసంఘం ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర అధ్యక్షుడు ది 12/7/2021

Comments