✍️ ITDA PO పై వస్తున్న ఆరోపణలపై నిగ్గు తేల్చాలి
✍️ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా కార్యదర్శి ఎం బ్రహ్మం
✍️ పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు డిమాండ్
✍️ నెల్లూరు ITDA POను సస్పెండ్ చేసి ఆయన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న రిలేదీక్షలు 6వ రోజుకు చేరాయి.
✍️ ఈ దీక్షలకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, పౌరహక్కుల సంఘం, బహుజన కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలిపాయి.
✍️ ఈ సందర్బంగా *ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్* జిల్లా కార్యదర్శి ఎం బ్రహ్మం మాట్లాడుతూ
✍️ ITDA POపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి, ఆరోపణలు వాస్తవమైతే చర్యలు తీసుకోవాల్సిన భాధ్యత కలెక్టర్ పై ఉందన్నారు.
✍️ గిరిజన మహిళల పట్ల PO అసభ్య ప్రవర్తనకు సంబంధించి రోజ్ మాండ్ నివేదికను బయటపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
✍️ *పౌరహక్కుల సంఘం* జిల్లా కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ POపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి విచారణ చేయకుండా కాలయాపన చేస్తుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
✍️ వెంటనే విచారణ జరిపి POపై చర్యలు తీసుకోవాలన్నారు
✍️ దీక్షల్లో యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు BL శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపూరు కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల రవి, కోశాధికారి ఏకోల్లు సుబ్రమణ్యం, లక్ష్మి, కావలి డివిజన్ అధ్యక్షులు రాపూరు మురళీ, చెంచురామయ్య, మానికల మురళీ పాల్గొన్నారు.
Comments
Post a Comment