మిత్రులకు....
మానవ హక్కుల వేదిక కడప జిల్లా కన్వీనర్ జయశ్రీ గారు ఈ రాత్రి సుమారు 10.30 గంటలకు హైదరాబాద్ లో మరణించారని తెలుపుటకు చింతిస్తున్నాను...పూర్తి వివరాలు. తెలియాల్సి ఉంది...రేపు ఉదయం ప్రొద్దుటూరులో ఆమె అంత్య క్రియలు జరుగును....ఆమెకు పౌర హక్కుల సంఘం అశ్రు నివాళులు తెలియ జేస్తుంది....
- సి ఎల్ సి
జయశ్రీ గారికి చాలా ఏళ్లకు ముందే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఒక మహిళగా ఉండే పరిమితులనే కాకుండా తన ఆరోగ్య పరిమితులను కూడా ఆమె అధిగమించి కడపజిల్లా పౌరహక్కుల ఉద్యమంలో విశేషంగా కృషి చేశారు. ఆమె కృషి చిరస్మరణీయంగా ఉండిపోతుంది.
జయశ్రీ గారికి జోహార్లు.
- ఎస్. షామీర్ బాషా, సి ఎల్ సి, చిత్తూరు జిల్లా
జయశ్రీ గారికి జోహార్లు. పౌరహక్కులసంఘం, మానవహక్కులవేదిక ఉద్యమంలో ఆమె కృషి చిరస్మరనీయమైయింది. ఆమెకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర కమిటీ నివాళులు తెలియ చేస్తుంది.
- చిట్టిబాబు, చంద్రశేఖర్, సి ఎల్ సి, ఎ పి
తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టు విషయంలో మొదటిసారి జయశ్రీ మేడం తో కలసి పనిచేసే అవకాశం వచ్చింది, ఆతర్వాత ఎలక్ట్రిక్ ఉద్యోగుల సమస్యలపై 2వసారి మేడంతో కలిసిపని చేశా చాలా చురుకుగా పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాడే మేడం మరణం తీరని లోటు మేడం కుటుంబానికి నా ప్రఘాడ సానుభూతి.
- రవిశంకర్, సి ఎల్ సి, కడప జిల్లా
Comments
Post a Comment