స్టాన్ స్వామి ఒక చర్చి ఫాథర్. ఆయన దయా హృదయం కలిగిన వారు. కరుణామయుడు. వారు బాధాతప్త హృదయాలను దగ్గరకు తీసి ఓదార్పును ఇచ్చేవారు. మనసున్న మనిషి. అన్నింటికి మించి సంఘ సేవకుడు. జార్ఖండ్ ప్రాంతంలో ఆదివాసీలకు సేవ చేయడానికి వచ్చిన క్రీస్తు బిడ్డ గా అంకితం అయి పని చేశాడు.ఇది ఝార్ఖండ్ లోని ఆ ప్రాంత ఆదివాసీల మనోగతం. క్రీస్తు ఆనాటి సమాజం లో ప్రభువుల (రాజుల) దుశ్చర్యలు నిలదీసిన తిరుగుబాటు దారుడు. ఆరాచకాలను ప్రశ్నించిన విప్లవకారుడు.
అందుకే రాజు చేత శిలువ వేయబడ్డారు.ఈనాడు ఫాథర్ స్టాన్ స్వామి కూడా ఆదివాసీల పై రాజ్యం యొక్క హింస, ఆరాచకాలను చట్టపరంగా నిలదీశారు.క్రూరమైన ఉపా చట్టం అమాయక ఆదివాసీలు పై ప్రయోగించటం రాజ్యాంగ వ్యతిరేకం అని పోరాడినారు. అందుకే కోర్టులో పిల్స్ వేశారు. రాజ్యాన్ని నిలదీసినారు. వారికి అండ గా నిలబడినారు. అందుకే రాజ్యం చేత ఏసు క్రీస్తు వలె చంపబడినారు.ఆనాడు క్రీస్తు ని రాజ ద్రోహి అన్నారు.
ఈనాడు పాదర్ స్టాన్ స్వామి పై దేశ ద్రోహం,టెర్రరిజం కేసు మోపినారు.ఏసు క్రీస్తు కి, పాదర్ స్టాన్ స్వామి కి ఒకే రకమైన లక్ష్యం ఉంది. అదే ప్రజలకు సేవ చేసే సంకల్పం. క్రీస్తు ని అనుసరించే పాదర్ స్టాన్ స్వామి సామాజిక సేవకు అంకిత మయ్యారు. ఇది కొంత మంది పరిశీలకుల అంచనా. ఇద్దరు ఆధ్యాత్మిక సమాజ విప్లవకారులే. క్రీస్తు ని రాజ్యం ఆయన ఆశయాలు, భావాలను, ఆచరణను ఎదుర్కొన లేక మతం ముసుగులో దేవుడ్ని చేశారు. అలాగే ఫాథర్ స్టాన్ స్వామి ని ఏ దేవుడి నో చేసేస్తోంది ఈ పాసిస్ట్ మత వ్యవస్థ. ఆయన రెండు పనులకు అంకిత మై పని చేశారు. ఒకటి మనుష్యులు ని ప్రేమించడం. రెండు వారి బాధలను తీర్చడం.ఎదుటివారి బాధలను తమ బాధలు గా భావించాలని క్రీస్తు బోధనలను ఆయన పాటించారు. ఆదివాసీల ను మావోయిస్టులు అని ముద్రవేసి రాజ్య బలితీసుకుంటుంటే ఆయన చూస్తు భరించ లేక పోయారు.
కోర్టులలో చట్టపరమైన పోరాటం చేశారు. సంవత్సరం లు తరబడి జైళ్లలో ఉన్న ఆదివాసీలను విడుదల చేయించారు. ఆదివాసీలు కి న్యాయం కోసం ఝార్ఖండ్ హైకోర్టు లో పిల్స్ వేశారు. అదే కరడుగట్టిన మనువాద ఫాసిస్ట్ రాజ్యానికి కంటగింపు అయింది. మావోయిస్టు లతో సంబంధాలు ని అంట కట్టినారు. ఆయన నివాసం పైన 2సార్లు పోలీసులు తో మనువాద పాసిస్ట్ రాజ్యం దాడి చేయించింది. అయిన ఆయన అమాయక ఆదివాసీలు కి సేవ చేయటం ఆప లేదు. ఆఖరికి ఉగ్ర చర్యలు కి సహకరించారు అని ముద్ర వేశారు. ఉపా చట్టం కింద ఉగ్రవాది అని భీంకోరేగావ్ కేసులో ముద్దాయి గా చూపించి జైలు లో నిర్బంధించారు.
ఈ మనువాద రాజ్యం ఆయనని అరెస్ట్ చేయటం వెనుక రెండు కారణాలు బలం గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆదివాసీలు ని ఆకట్టుకున్న ఒక క్రిస్టయన్ పాదర్.ఆయన వలన అక్కడ ఆదివాసీలు అత్యధికులు క్రిస్టియన్ మతం లో ఉన్నారు. రెండోది క్రూరమైన ఉపా చట్టానికి వ్యతిరేకంగా బలమైన పోరాటం.ఇవి రెండూ మనువాదుల రాజకీయ లక్ష్యాలకు ఆటంకం. అందుకే ఆ కురు వృద్ధుడుని అధికారం లో ఉన్న మను వాద రాజ్యం ఉగ్రవాది అని ముద్ర వేసి జైలులో పెట్టింది. ఆయనను జైలు లో నిర్బంధించే నాటికి ఆయనకు 83 సంవత్సరాలు. పార్కిన్ సన్ వ్యాధి తో బాధపడుతున్నారు. చేతులు వణుకు తున్నాయి. శరీరం నిస్సత్తువ గా తయారవుతుంది. తన పని తాను చేసుకునే స్థితి లేదు. వణుకుతున్న చేతులు తో మంచి నీళ్ళు ని ఒక గ్లాసు తో తాగలేని స్థితి. మంచి నీళ్ళు తాగేందు కు పాత్ర కోసం కోర్ట్ లో పిటీషన్ వేశారు.
అది ఎదో ఉగ్రవాద చర్య లాగా ప్రభుత్వ డైరెక్షన్లో కౌంటర్ కోసం ప్రాసిక్యూషన్ కొన్ని రోజుల సమయం కోరింది.న్యాయ వ్యవస్థ వారం రోజులు నీళ్లు ఎలా తాగుతీరు అనే ఆలోచన చేయకుండా ప్రాసిక్యూషన్ కి సమయం ఇచ్చింది.కనీస మానవీయ విలువలు లేకుండా మంచి నీళ్ళు పాత్ర ఇవ్వొద్దని ప్రభుత్వం కౌంటర్ వేసింది. బెయిల్ ని సహితం ప్రభుత్వ ప్రాసిక్యూషన్ వారు వ్యతిరేకించారు. ఉపా చట్టం ప్రకారం కూడా 6 నెలలకే బెయిల్ ఇవ్వొచ్చును. కానీ అనేక కారణాలతో న్యాయవ్యవస్థ నుండి బెయిల్ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. 9 నెలలు జైలు లో ఉంచింది. అరోగ్యం క్షీణించింది. కరోనా సోకింది.సరైన వైద్యం అందించలేదు. బెయిలు రానీయకుండా,సరైన వైద్యం అందించకుండా ప్రభుత్వం స్టాన్ స్వామి మరణానికి కారణం అయింది. ఈ దుర్మార్గం మూట కట్టుకుంది.
ఇది ముమ్మాటికీ రాజ్యం చేసిన హత్య. గొప్ప మానవతా వాది స్టాన్ స్వామి ని సమాజం కోల్పోయింది. ఆయన మరణానికి ప్రభుత్వం భాద్యత వహించాలి. ఇందులో NIA, న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉన్నది. ఆయన మరణం జ్యూడిషియల్ కస్టడీ లో ఉండగా జరిగింది.అందుకు న్యాయ వ్యవస్థ భాద్యత వహించాలి. Uapa లో అరెస్ట్ కాబడిన సుదా భరద్వాజ్,సురేంద్ర గాడ్లింగ్ తదితర మేధావులు ని ఇతర జ్యూడిసియల్ కస్టడీ ప్రిజనర్స్ మరియు అండర్ ట్రయిల్ ప్రిజనర్స్ ఎవరు మరణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
విడుదల చెయ్యాలి. 84 సంవత్సరాల వృద్ధుడు వణుకుతున్న చేతులతో బల వంతమైన రాజ్యాన్ని లేదా ఏ వ్యక్తి ని అయిన ఏమి చేయగలడు.ఏమీ చేయలేడు. ఒక చర్చి పాదర్ అలాంటి నేరాలకు ఎందుకు పాల్పడతారు అనే కనీస విచక్షణ,ఆలోచన NIA చేయలేదు. నేరం చేయకుండా జైలు లో నిర్బంధించి ఆయన మరణానికి NIA కారణం అయింది. ఆయన మరణానికి NIA భాధ్యత పడాలి. . అయిన ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) ప్రయోగిస్తూ జైలులో ఒక అనుమానితుడు, చర్చి పాదర్ చనిపోయేట్లు చేయటం ఇదేమి న్యాయ విచారణ పద్దతి.
ఇది ఖచ్చితంగా నాకు తెలిసిన Crpc న్యాయ విచారణ పద్దతి కాదు. స్టాన్ స్వామి జ్యూడిషయల్ మరణం పై ప్రభుత్వం, NIA, న్యాయ వ్యవస్థ లు మూడు వ్యవస్థలు పై భాద్యత ఉంది. కావున అంతర్జాతీయ కోర్ట్ చేత న్యాయ విచారణ జరిపించాలి. UAPA చట్టం దుర్వినియోగం అవుతున్నది.న్యాయవ్యవస్థ గాడి తప్పుతుంది అనటానికి పాదర్ స్టాన్ స్వామి జ్యూడిషియల్ కస్టడీ మరణం ఒక పెద్ద ఉదాహరణ. అందుకే తక్షణం ఉపా చట్టం రద్దు చేయాలి. ఉపా చట్టం వలన రాజ్యాంగం లోని వాక్, సభా స్వాతంత్ర్యం,సమానత్వ హక్కు, రాజకీయ స్వేచ్ఛ, జీవించే హక్కు తుంగలో తొక్క బడ్డాయి. పాదర్ స్టాన్ స్వామి రాజ్యం చేతిలో హత్య చేయబడ్డారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది.
రాజ్యాంగ హక్కులు కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటానికి దీక్ష పూనుద్దాం.
జోహార్ పాదర్ స్టాన్ స్వామి.
- నంబూరి శ్రీమన్నారాయణ
రాష్ట్ర ఉపాధ్యక్షులు
పౌర హక్కుల సంఘం
ఏ పి
Comments
Post a Comment