ఫాదర్ స్టాన్ స్వామిది ప్రభుత్వ హత్యేనంటూ నిరసన | సి ఎల్ సి, కర్నూల్ జిల్లా

.
**UAPA చట్టాన్ని రద్దు* *చేయాలి*.
*రాజకీయ ఖైదీcలను తక్షణమే విడుదల చేయాలి*.
             ********
     ఫాదర్ స్టాన్ స్వామి మృతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలను నిరసిస్తూ పౌరహక్కుల సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో *కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించ బడింది*. *పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లా బకష్ అధ్యక్షత* వహించిన ఈ నిరసన ప్రదర్శన లో వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు. ప్రజా స్వామిక మైన ఉపా ( UAPA) చట్టాన్ని రద్దు చేయాలని, భీమ్ కోరేగావ్, ఎల్గార్ పరిషత్ అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫాదర్ స్టాన్ స్వామి మరణం ప్రభుత్వం చేసిన హత్య అని వక్తలు తెలిపారు. ఊపా కేసుల్లో అక్రమంగా అరెస్టు చేయబడిన రాజకీయ ఖైదీలను, హక్కుల సంఘాల నేతలను విడుదల చేయాలని, వేలాది మంది ఆదివాసీలు ఎలాంటి బెయిలు కు కూడా నోచుకోకుండా జైళ్ళలో మగ్గిపోతున్నారని, వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నాటి నిరసన ప్రదర్శన లో POP నాయకులు శ్రీనివాసరావు, యోహాన్, RCC నాయకులు రాజు, KNPS నాయకులు సుబ్బారాయుడు, రాయలసీమ విద్యా వంతుల వేదిక నాయకులు భాస్కర రెడ్డి, రామకృష్ణ రెడ్డి, సమాచార హక్కు వేదిక నాయకులు జయన్న, PDSU నాయకులు రమణ, న్యూ డేమాక్రేసీ నాయకులు వెంకటేశ్వర్లు, DTF బాధ్యులు బజారాప్ప, రత్నం ఎసేపు,పోస్టల్ యూనియన్ నాయకులు లక్ష్మి కాంతం గారలు పాల్గోని ప్రసంగించారు.
___ *అల్లా బకష్, జిల్లా కార్యదర్శి, పౌరహక్కుల సంఘం, కర్నూలు*.

Comments