ఫాదర్ స్థాన్ స్వామి సంస్మరణ సభ | సి ఎల్ సి, శ్రీకాకుళం జిల్లా

పత్రికా ప్రకటన ఈరోజు బొడ్డపాడు అమరవీరుల భవనంలో పౌరహక్కుల సంఘం నాయకత్వంలో ఫాదర్ స్థాన్ స్వామి సంస్మరణ సభ జరిగింది ఈ సంస్మరణ సభలో ఇతర ప్రజా సంఘాలు కూడా పాల్గొన్నాయి ప్రజా కళా మండలి ఉత్తరాంధ్ర మహిళా సంఘం దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అమరుల బంధుమిత్రుల సంఘం పాల్గొన్నాయి 50 ఏళ్ల నుంచి ఆదివాసి హక్కులకై నిరంతరం పోరాడిన గొప్ప హక్కుల ఉద్యమకారుడు అని వక్తలు అభిప్రాయపడ్డారు ఇది సహజ మరణం కాదు ఇది పాలకుల వ్యవస్థీకృత హత్యని గట్టిగా నొక్కి చెప్పారు ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రశ్నించే వాళ్ళ పైన నిర్బంధము దాడులు పెరిగాయని మాట్లాడారు భీమా కోరేగావ్ ఇలాంటి కుట్రకేసులో పెట్టి 16 మందిని అరెస్టు చేసి బెయిలు లేకుండా చేయటం దుర్మార్గం చర్యగా మాట్లాడారు వెంటనే వారిని విడుదల చేయాలని రాజకీయ ఖైదీలు అందులోని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు

సభకు పౌర హక్కుల సంఘం ,పత్తిరి దానేసు , అధ్యక్షత వహించారు వ్యక్తులుగా పోతనపల్లి అరుణ నీలకంఠ కోదండరాం వీరస్వామి పూర్ణచందర్రావు సోమనాథం మాట్లాడారు సభలో మణికుమారి వైకుంఠం దానయ్య చిరంజీవి ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు

Comments