భీమా కోరేగావ్ కేసులో అరెస్టు కాబడి జైల్లో ఉన్న *ఫాదర్ స్టాన్ స్వామి* అనారోగ్యంతో మృతి చెందారు. ఇది ముమ్మాటికీ *ప్రభుత్వ హత్యగా భావించాలని ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. ఫాదర్ గా జార్ఖండ్లోని ఆదివాసి ప్రజల హక్కుల నేత గా ఎన్నో ఏళ్ల నుంచి ప్రజా ఉద్యమం లో ఆయన ఉన్నారన్నారు. శిధిలమవుతున్న రాజ్యాంగ విలువలకు సాక్ష్యం స్టాన్ స్వామి మరణమన్నారు. ప్రశ్నిస్తే చాలు ఉపా చట్టం పేరుతో హక్కుల నేతలందర్నీ అరెస్టు చేసి ఎన్ని సంవత్సరాలైనా విచారణ జరపకుండా జైల్లోనే బందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. సరైన వైద్యం అందించకుండా మానసికంగా హింసిస్తూ హత్య చేస్తున్న కేంద్రప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈ మరణం పై కేంద్ర మానవ హక్కుల కమిషన్ తో వెంటనే విచారణ జరపాలని కోరుతూ పౌరహక్కుల సంఘం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ యల్ సీ నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నాయకులు అబ్బాయి రెడ్డి , బ్రహ్మం, ఏలీషా కుమార్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment