ఫాదర్ స్టాన్‌స్వామి హాస్పిటల్‌లో కన్నుమూశారు. ప్రభుత్వం ఆయన వయసును, ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా జైలుపాలు చేయడమే కాక, బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంది. స్టాన్ స్వామి అన్ని సౌకర్యాలను వదులుకుని ఆదివాసీల మధ్య జీవిస్తూ రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కుల అమలు కోసం జీవితకాలమంతా పోరాడారు. ఇలాంటి మానవీయమైన, ఉదాత్తమైన వ్యక్తులను వేధించడం మన రాజ్య స్వభావాన్ని, ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించడమే గాక మొత్తం వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నది. ఫాదర్ స్టాన్‌స్వామి జైలు నుంచి ఒక ప్రకటన చేస్తూ తాను పేదల కన్నీళ్లల్లో, వాళ్ల చిరునవ్వులో భగవంతుడిని చూస్తానని, అలాంటి వాళ్ల బాధలను పంచుకోవడమే జీవితానికి ఒక అర్థాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. ‘నేను జైలులో ఉన్నానని స్నేహితులు, శ్రేయోభిలాషులు బాధపడవచ్చు, కానీ ఏళ్ల తరబడి తామెందుకు జైల్లో ఉన్నామో, తమ మీద ఆరోపణలు ఏమిటో తెలియని నిరుపేదలను, అమాయకులను నేను చూశాను. వాళ్ల గురించి పట్టించుకునే వాళ్ళే లేరు’ అంటూ తన బాధను వ్యక్తపరిచారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తులను ఇంకా కోల్పోకుండా ఉపా చట్టాన్ని రద్దు చేయడం, భీమా కోరేగాం కేసును వెనక్కి తీసుకోవడమే స్టాన్‌స్వామికి నిజమైన నివాళి. ఆయన వంటి వ్యక్తుల జీవితం సమాజాన్ని మానవీయంగా మార్చే ఓ ప్రయోగం. అలాంటి వాళ్ల జ్ఞాపకం సమష్టి చైతన్యంలో సజీవంగా ఉంటుంది.
ప్రొ. జి.
Comments
Post a Comment