తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలి | దళిత ప్రజాసంఘాల డిమాండ్

పత్రికా ప్రకటన

అమలాపురం
30-07-2021

తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలి - దళిత ప్రజాసంఘాల డిమాండ్


దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కోటాలో వెంకటాయపాలెం దళిత యువకులకు శిరోముండనం చేయించిన ఘటనలో ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం దళితులను నయవంచన చేసి అవమానించి ద్రోహం చేయడమేనని కోనసీమ దళిత ఐక్యవేదిక దళిత ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు
శుక్రవారం అమలాపురం బుద్ధ విహార్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నేరాలలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జంగా బాబురావు అధ్యక్షతన దళిత ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోనసీమ దళిత ఐక్యవేదిక అధ్యక్షులుఅధ్యక్షులు DB లోక్ మాట్లాడుతూ వెంకటాయపాలెం శిరోముండనం ఘటనకు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడం పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యమే నని ఆరోపించారు దళిత యువకులకు గుండు కొట్టించి అమానుషంగా కనుబొమ్మలు తొలగించిన ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు శిరోముండనం కేసు నుండి తప్పించుకోవడానికి అనేక రాజకీయ పార్టీలు మారుతూ అధికార పార్టీ ల అండతో బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని అలాంటి తోట త్రిమూర్తులకు దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం సిగ్గుచేటని దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే నని అన్నారు వివిధ రంగాల్లో కృషిచేసిన కవులు కళాకారులు మేధావులు కు ఇవ్వవలసిన ఎమ్మెల్సీ పదవి 9 హత్య కేసులలో నిందితుడు మట్టి ఇసుక మాఫియా దొంగ సారా వ్యాపారం నడుపుతున్న ఒక రౌడీకి కట్టబెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం మేనని ప్రభుత్వాన్ని విమర్శించారు ఇప్పటికైనా దళితుల మనోభావాలు పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల శిరోముండనం కేసు ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు కు ఎమ్మెల్సీ పదవి రద్దుచేయాలని శిరోముండనం బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఐక్యంగా ఉద్యమం తీవ్రతరం చేస్తారని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు 
జంగా బాబురావు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు దళిత ఓటు బ్యాంకును వాడుకుని దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారని దళితుల సంక్షేమాన్ని నీరుగారుస్తున్నారని ఆరోపించారు దళితులపై దాడులు నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి అని దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అంబాజీపేట మండలం మాచవరం లో ముగ్గురు దళిత మహిళలపై అమానుషంగా దాడి చేసిన అగ్రకుల దురహంకారులను ఘటన జరిగి నెలరోజులు కావస్తున్నా ఎప్పటికీ అరెస్టు చేయకపోవడం పోలీస్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు పిల్లి సత్యవతి కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు

తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవి రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2న అమలాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా పిలుపు ను దళితులు ప్రజాసంఘాలు ప్రజాస్వామిక వాదులు జయప్రదం చేయాలని సమావేశంలో తీర్మానించారు
ఈ కార్యక్రమంలో పలువురు దళిత ప్రజాసంఘాల నాయకులు కొప్పుల సత్తిబాబు మోకాటి నాగేశ్వరరావు గెడ్డం సురేష్ బాబు రేవు తిరుపతిరావు కారం వెంకటేశ్వరరావు పెనుమాల చిట్టిబాబు ఐ ఎం మల్లేశ్వరరావు ఏడిద రాజేష్ అమల దాసు బాబురావు దీపాటి శివప్రసాద్ పశ్చిమాల బాబ్జి అయితా బత్తుల సుభాషిని పెనుమాల సుధీర్ పెయ్యల పరశురాముడు సాపే బాలరవి మచ్చ నాగయ్య పశ్చిమాల వసంత కుమార్ నాగవరపు అన్నవరం పెట్ట శ్రీను జంగా రాజేంద్ర కుమార్ వడ్డీ సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు

Comments