ఉపా చట్టం రద్దు పోరాట కమిటి ఆధ్వర్యంలో 10/జూలై /2021, గుంటూరు, బ్రాడిపేట 2వ వీధి, సిపిఐ (ఎం )హాల్ లో ఉదయం 10గం "లకు బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు వేడంగి చిట్టిబాబు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అధ్యక్షతన జరిగింది.ఫాదర్ స్టాన్ స్వామి మరణం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ రెండు నిముషాలు మౌనం పాటించి సభ ప్రారంభమైంది. చిట్టిబాబు మాట్లాడుతూ దురదృష్ట కరమైన మరణానికి నిర్లక్షపూరితమైన జైళ్లు. అలసత్వంతో నిండిన న్యాయస్థానాలు, దురుద్దేశ పూరీతమైన దర్యాప్తు సమస్థలు పూర్తి బాధ్యత వహించాలి. న్యాయవ్యవస్థ పనితీరుపై కూడా చర్చించవలసిన అవసరాన్ని గుర్తించాలని అన్నారు. స్టాన్ స్వామిని ప్రభుత్వ వ్యవస్థలు హత్య చేశాయని విరసం నాయకులు సి స్ ర్ ప్రసాద్ వివరించారు. Pks నాయకులుకొండారెడ్డి మాట్లాడుతూ స్టాన్ స్వామి ని బీజేపీ ప్రభుత్వ మే హత్య చేసిందని అన్నారు. Knps దుడ్డు ప్రభాకర్ మాట్లాడుతూ కేసు లకు భయపడక, త్యాగాలకు సిద్దపడాలని పిలుపునిచ్చారు.pdm రామకృష్ణ, pdsu గానిరాజు, pkm నాగేశ్వరావు, విద్యా పరిరక్షణ కమిటీ రమేష్ పట్నాయక్, న్యూ డెమోక్రసి బ్రహ్మయ్య, అరసం పెనుగొండ లక్ష్మి నారాయణ, చేనేతసమాఖ్య వేంకటేశ్వర్లు, చైతన్యమాహిళాసంఘం రాధ, పాస్టర్ రవి పాల్గొన్నారు. స్థాన్ స్వామి సంస్మరణసభ జరిగింది డిమాండ్స్ :uapa చట్టాన్ని రద్దుచేయాలని, ఉపా కేసులు ఉపసంహారించాలని, భీమా కోరిగావ్ కుట్ర కేసును రద్దు చేసి,ఆ కేసు లో వున్నవారిని విడుదలచేయాలని. అక్రమ కేసులు రద్దుయ్యే వరకు ఉద్యమించాలి.
Comments
Post a Comment