సంతోష్ మార్కంను హత్య చేసిన పోలిసులు | సి ఎల్ సి

సంతోష్ మార్కం హత్యపై వెంటనే హత్య కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని పౌరహక్కులసంఘం డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల కధనం మేరకు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా, నీలవాయ పటేల్‌పారా గ్రామ పంచాయతీలో ది. 28/6/2021, రాత్రి 11:30 గంటలకు, జరిగిన ఎన్‌కౌంటర్‌లో 5 లక్షల బహుమతి ప్రకటించిన సంతోష్ మార్కమ్ (తండ్రి భీడా) మరణించాడనీ, సంతోష్‌పై 25 నేరాలు నమోదై వున్నాయి.

గ్రామస్తుల కధనం ప్రకారం డి.ఆర్.జి. (లొంగిపోయిన నక్సలైట్లు, జిల్లా సెక్యూరిటీ ఫోర్స్) సైనికులు ఆదివాసీలుగా వచ్చి సంతోష్‌ వెంటపడి పరిగెత్తించి చంపారు. ఆ సమయంలో సంతోష్ ఇంట్లో అన్నం తింటున్నాడని,పోలీసులను చూసి సంతోష్ పరిగెత్తుతుంటే వెంబడిపడి కొట్టడాన్ని గ్రామస్తులందరు స్త్రీ, పురుషులు చూశారు. గ్రామస్తులే ప్రత్యక్ష సాక్షులు. గ్రామ పంచాయతీ నీలాయలో ఇది మొదటి ఘటన కాదని, ఇంతకు ముందు కూడా ఇదే విధంగా గ్రామంలో పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని వెంటబడి చంపి ఎన్‌కౌంటర్ అని చెప్పారని గ్రామస్తులు అంటున్నారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా, పోలీసులు మృతదేహాన్నిస్తే తీసుకోకూడదని, హంతకులపై FIR నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని గ్రామస్తులు నిర్ణయించు కోవటం పోలీసుల కధనం డొల్లతనాన్ని ,నిస్సిగ్గును తెలియజేస్తుంది.

ఈ డిమాండ్ తో గ్రామస్తులు దంతేవాడ జిల్లా ఆసుపత్రి ముందు ధర్నాపై కూర్చున్నారు. ఈ ధర్నాకి, ఆదివాసీ సామాజిక కార్యకర్త సోని సోరిని గ్రామస్తులు పిలిచారు, ఆమె కొన్ని గంటల క్రితం అక్కడికి చేరుకుంది పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకుని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ముద్దాయిలపై హత్యకేసు నమోదు చేసి, నేరస్థులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూన్నాము. ధర్నాలో పాల్గొన్న అదివాసులకు ,సోనీసోరికి రాత్రి సమయంలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే.
  బాదిత గ్రామస్తులు న్యాయం కోసం ఆసుపత్రి ముందు , సోని సోరి, సంజయ్ పంత్, ఇతర సహచరులతో సహపడిగాపులు కాస్తుంటే, హంతకులు, వారిని రక్షించేవారుఅంతా దర్జాగా 
కలెక్టర్ (జిల్లా మేజిస్ట్రేట్), ఎస్.పి., ఎస్.డి.ఎం. (సబ్ డివిజనల్ ఆఫీసర్), పట్టు పరుపుల మీద ఎ.సి., ఫ్యాన్‌ల క్రింద నిద్రిస్తున్నారనే భావన కలగకుండా ఉండాలంటే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నాం.ఆదివాసుల లో నేరస్తులు ఉన్నారంటే ఇంట్లో అన్నం తింటున్నావారిని వెంటాడి చంపటం ద్వారా నేరాన్ని అరికట్టటానికి ఏ చట్టం పోలీసులకి అధికారం ఇవ్వలేదు. నేరాన్ని ద్వేషించండి, నిర్ములించండి అంటే నేరస్తుడైనా అతన పట్ల చట్పపరంగా వ్యవహరించటం.ఒక వైపు మావోయిస్టులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని ఆరోపిస్తూ అదే అతిక్రమణకు పోలీసులు పాల్పడటం శోచనీయం.
         వి.చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్, అద్యక్ష,కార్యదర్శులు.
పౌరహక్కులసంఘం, ఆంద్రప్రదేశ్.

Comments