ప్రెస్ నోట్. విజయవాడ.30.06.2021*****************************రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి, యువజనులు ని గృహ నిర్బంధం, కేసులు పెట్టి అరెస్టులు చేయటం దుర్మార్గం. అప్రజాస్వామికం. నిరుద్యోగులు  ఉద్యోగాల కావాలని ఉద్యమించడం వారి హక్కు. ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత, ఉపాధి చూపించవలసిన కర్తవ్యం రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలది. ఉద్యోగ ,ఉపాధి కోసం పోరాడటం విద్యార్థులకు యువతకు ఉన్న ఒక ప్ర ప్రజాస్వామిక హక్కు. అది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగమే. ప్రభుత్వం పౌరులు జీవించే హక్కును నిరాకరిస్తున్నప్పుడు విద్యార్థులకు యువతకు పోరాటమే ఆయుధం. పోరాడే హక్కు, ఉపాధి సాధించుకునే హక్కు విద్యార్థులకు యువతకు ఉన్నది.  రాజ్యాంగబద్ధ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతను  గృహనిర్బంధం చేయడం అరెస్టులు చేయడం కేసులు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకం. అరెస్టు చేసిన  విద్యార్థులు యువత ను, PDSU,SFI, AISF, DYFI, AIYF, PYL తదితర సంఘాల నాయకులు ని విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్బంధాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తప్పుడు జాబ్ క్యాలెండర్ రద్దు చేసి ఖాళీగా ఉన్న రెండు లక్షల 50 వేల పోస్టులతో వాస్తవిక నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది.సుమారు గా ఖాళీ గా ఉన్న 2లక్షల50 వేల పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రాజ్యాంగం ప్రకారమే పౌరులు జీవించే హక్కులో భాగమని పౌరహక్కుల సంఘం స్పష్టం చేసింది ఉద్యోగ ఉపాధి కల్పించడంలో అలసత్వం నిర్లక్ష్యం ఈ ప్రభుత్వాలు పాటించటం రాజ్యాంగాన్ని ధిక్కరించడం గాని పౌరహక్కుల సంఘం స్పష్టం చేస్తోంది. అందరికి విద్య,ఉద్యోగం,ఉపాధి పౌరుల.   ప్రాధమిక హక్కు గా ప్రభుత్వాలు చూడాలని పౌర హక్కుల సంఘం తెలియచేస్తుంది.                                   ఇట్లు                                                  వి. చిట్టిబాబు              రాష్ట్ర అధ్యక్షులు        చిలుకా చంద్రశేఖర్       రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.                          నంబూరి. శ్రీమన్నారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు          టి ఆంజనేయులు        రాష్ట్ర సహాయ కార్యదర్శి.          పౌర హక్కుల సంఘం.               ఆంధ్ర ప్రదేశ్. .
  
Comments
Post a Comment