పత్తి పాటి వెంకటేశ్వర్లుకు జోహార్లు | ఎం. డి. ఇస్మాయిల్

సార్ ను వొకసారి కలిసే అవకాశాన్ని మహబూబ్నగర్ CLC జిల్లా కమిటీ నాకు కల్పించింది.అది ఆంజనేయులు గౌడ్ సర్, నరసిమన్న జిల్లా బాధ్యులుగా ఉన్నప్పుడు శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా clc జిల్లా కమిటీ మీటింగ్ పెట్టి  వెంకటేశ్వర్లు సార్ను ముఖ్య అతిథి గా ఆహ్వానించారు. అయితే హైదబాద్ నుంచి సార్ణు మీటింగ్ కు తీసుకుపోయే బాధ్యత నాకు అప్పగించారు.నాకు ఈ విషయం చెప్పినప్పుడు సంతోషం,భయం రెండు కలిగినియి.మన సంస్థ ఫౌండర్ సెక్రెటరీ , ఎమర్జెన్సీ లో మొదటిగా అరెస్ట్ కాబడిన వారు,సీనియర్ న్యాయవాది కాబట్టి కొంత భయం అనిపించింది.సంతోషం ఏమో ఇంత సీనియర్ నాయకుని తో కలిసే , ప్రయాణం చేసే మాట్లాడే  అవకాశం వచ్చినందుకు. కానీ సర్ను కలిసిన తర్వాత కొద్దిసేపటికే భయం పోయి చాలా క్లోజ్ గా అనిపించింది.సర్ చాలా సింపుల్ గా ముఖం పై చిరునవ్వుతో మాట్లాడుతుంటే నాకు అలాగే వినాలనిపించిండి. వింటూ సర్ తో కలిసి కార్ లో మహబూబ్నగర్ వరకు ప్రయాణం చేసిన.సర్ తను శ్రీ శ్రీ  సర్ తో కలిసి పౌరహక్కుల సంఘాన్ని స్థాపించిన విషయాన్ని అప్పుడు హక్కుల ఉల్లంఘనలు ఏ విధంగా ఉండేవి,రాజ్య స్వభావం గురించి ఎన్నో విషయాలు నాకు చెప్పారు.ఇంకా ఆ కాలంలో కులాంతర,మతాంతర వివాహాలు చిన్న చిన్న గ్రామాల్లో దొరలను  ఎదిరించి సంఘం తరఫున ఏ విధంగా చేసే వారో చెప్పినరు.ఆ కాలంలోనే హెబియస్ కార్పస్ కేసులను file చేసిన విషయాలను కూడా నాకు చెప్పారు.నన్ను నువ్వు కూడా మంచి న్యాయ వాదిగా యదగాలని చెప్పారు.ఏ విషయాన్ని అయినా లోతుగా అధ్యయనం చేయాలన్నారు.ఇట్లా మాట్లుడు కుంటూ వెళ్తున్నపుడు టీ తాగుదామని కార్ ఆపమన్నారు.సర్ వోయసులో పెద్దవారు కదా అని చాయి నేనే ఇవ్వబోతే పర్లేదు మిత్రమా నేను తెచ్చుకో గలను ఇంకా అంత ముసలివాని కాలేదు అని నవ్వుతూ సున్నితంగా వద్దన్నారు.సర్ స్మోకింగ్ చేసే వారు సిగరెట్ లు కొని ఇవ్వటానికి వెళ్తే వద్దు నా దగ్గర ఉన్నాయి లే అన్నారు.నాకేమనిపించిందంటే సర్ తన పని తానే చేసుకోవాలనుకున్నారు అని తనకు చేత నైనంత వరకు .అందుకే నేను చేయి పట్టుకొని కార్ ఎక్కివ్వలంకున్న వద్దనే వారు. నేను సర్ వ్యక్తిత్వానికి ము క్ దుడ న అయి అలానే చూస్తూ మనసులో ఇప్పుడు ప్రజాసంఘాల లో పనిచేసే వాళ్ళం ఎంతమంది మి ఇలా ఉన్నామో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్పించింది. సార్ మీకు ఇవే నా జోహార్లు అమర్ హై పత్తిపాటి వెంకటేశ్వర్లు సర్.

Comments

Post a Comment