*రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన*
*కు మద్దతు తెలియచేద్దాం*.
మిత్రులారా!
కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ *భారతీయ కిసాన్ యూనియన్* జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది. భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడం కోసం, ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకై భారతీయ కిసాన్ యూనియన్( BKU) ఏక్తా (ఉగ్రహాన్) ఢిల్లీ సరిహద్దుల్లో ఈ ర్యాలీని నిర్వహించనుంది.
*ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే UAPA, NSA మరియు దేశద్రోహం వంటి క్రూరమైన చట్టాలను వ్యతిరేకించాలని* పిలుపునిచ్చిన ఆ సంఘం భీమా కోరెగావ్ అరెస్టులు జరిగి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు BKU పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి షింగారా సింగ్ మన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ముంబై జైళ్ళలో తప్పుడు ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న బికె 16 (భీమా కోరేగావ్ కేసులోని 16 మంది)ని విడుదల చేయాలని జాతీయ స్థాయిలో వివిధ ప్రజాస్వామ్య సంస్థలు ఇచ్చిన పిలుపుకు BKU సంఘీభావం తెలిపింది. ప్రజల కోసం రచనలు చేసే, మాట్లాడే డజన్ల కొద్ది మేధావులు, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను తప్పుడు ఆరోపణలపై మోడీ ప్రభుత్వం జైలులో పెట్టిందని షింగారా సింగ్ మన్ ఆరోపించారు. *భీమా కోరేగావ్ కేసులో* *మేధావులను అరెస్టు చేసి మూడేళ్ళు అయింది, వారి విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. వారిలో అనేక మంది వృద్ధులు ఎన్నో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు*. జైళ్ళలో కోవిడ్ మహమ్మారి తీవ్రంగా విస్తరించినప్పటికీ వారికి బెయిల్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం వారి ఆరోగ్య పరిస్థితులపై శ్రద్ధ చూపడం లేదు. *వాళ్ళు జైలులోనే చనిపోయేలా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుంది.* అలాగే ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అనేక మంది ఢిల్లీ జైళ్లలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్నవారిలో నటాషా నార్వాల్ వంటి యువతుల నుండి స్టాన్ స్వామి వంటి వృద్ధ పాస్టర్ల వరకు ఉన్నారు.ʹʹ అని సింగ్ అన్నారు.
ప్రభుత్వ మత ఫాసిస్ట్ విధానాల గురించి అవగాహన కల్పిస్తున్నారని ఆ మేదావులను అరెస్టు చేశారు. వారిలో చాలా మంది గత అనేక దశాబ్దాలుగా ఆదివాసులు, పేద రైతులు, దళితులు, మహిళలు, ఇతర కార్మిక వర్గాల హక్కుల కోసం మాట్లాడుతున్నారు, రచనలు చేస్తున్నారు, పోరాడుతున్నారు. వారిని నిర్బంధించడం ద్వారా, సమాజంలోని ఈ వర్గాల మనస్సులలో భయాన్ని కలిగించాలని, ఆ మేదావులను ప్రజల నుండి దూరం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఎంతగా అంటే, *వారి విడుదల కోరుకునే ప్రతి గొంతును మావోయిస్టు లేదా దేశద్రోహి అని ముద్ర వేస్తారు*. *అరెస్టు చేసిన మేధావులను విడుదల చేయడం, ఈ క్రూర చట్టాలను రద్దు చేయడం, ప్రజాస్వామ్య హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడం కోసం జూన్ 13 న జరిగే ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొనాలని షింగారా సింగ్ మన్ అన్ని వర్గాల ప్రజలకు, సంస్థలకు విజ్ఞప్తి చేశారు*.
జూన్ 13 న జరిగే ఈ సభలో పంజాబ్‌కు చెందిన ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు, రచయితలు, కళాకారులు పాల్గొంటారు. *ప్రజాస్వామ్య హక్కుల మండలి ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ (షహీద్ భగత్ సింగ్ మేనల్లుడు)*, *ప్రోగ్రెసివ్ రైటర్స్ యూనియన్ నుండి సుఖ్ దేవ్ సింగ్ సిర్సా, డాక్టర్ నవ్‌షరన్, నాటక రచయిత డాక్టర్ సాహిబ్ సింగ్, ప్రముఖ కవి సుర్జిత్ జడ్జి, రచయిత జస్పాల్ మంఖేరా, న్యాయవాది ఎన్‌కె జీత్, థియేటర్ ఆర్టిస్ట్ కమల్ బర్నాలా తదితరులు పాల్గొంటారని భారతీయ కుసాన్ యూనియన్ (BKU )ఏక్తా (ఉగ్రహాన్) పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి షింగారా సింగ్ మన్ తెలియజేశారు*.
Comments
Post a Comment