ప్రజల హక్కుల కోసం జీవిత కాలం పనిచేసిన OPDR హక్కుల ఉద్యమ నేత రామకృష్ణ కు ఉద్యమ జోహార్లు.
*పౌర హక్కుల సంఘం CLC*
ఆరు అడుగుల బక్కపలచని వాడు. అయినా అందరిని ఆకట్టుకునే వ్యక్తిత్వం.నిన్న గాక మొన్న అనంతపురం లో అన్ని హక్కులు సంఘాల లోని అందరిని ఒకచోట చేర్చి NIA అణచివేత, నిర్బందాన్ని,రాజ్య హింస ను చెండాడి న పోరాట యోధుడు. ఆయన లేరనే విషాదకర వార్త గంట ఆలస్యంగా మా పౌర హక్కుల సంఘం నాయకత్వానికి మా CLC విజయ్ పోస్ట్ ద్వారా తెలిసింది.
కరోనా తో మరణించారు అని తెలిసి తీవ్రంగా భాధపడ్డాం. నిగర్వి, స్నేహశీలి, ఐక్య ఉద్యమాల శ్రేయోభిలాషి.నూతన ప్రజాతంత్ర సమాజంలో నే ప్రజలు జీవించే హక్కులకు గ్యారంటీ ఉంటుంది అని నమ్మిన గొప్ప హక్కుల ఉద్యమ నాయకుడు మిత్రులు రామకృష్ణ.
ఆయన మరణం బాధాకరం. ఆయన కు పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ వినమ్రంగా నివాళి అర్పిస్తూ జోహార్లు తెలియ చేస్తుంది.
ఆయన మరణానికి సంతాపం,విచారాన్ని, సానుభూతిని opdr సంఘానికి,కుటుంబ సభ్యులకు భార్య గంగాభవాని,కుమారులు సృజన్, నవీన్ లకు పౌర హక్కుల సంఘం తెలియ చేస్తుంది.
ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన తన జీవిత కాలం పని చేయటం ఆదర్శ ప్రాయం. ఆయన నిరు పేద కుటుంభం లో పుట్టి హక్కుల ఉద్యమ నాయకుడు గా ఎదిగినారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా లో వ్యవసాయ అధికారి గా పనిచేసి రిటైర్ అయ్యారు.జనసాహితి లో ఉద్యోగ సమయం లో పని చేశారు.విశ్రాంత కాలంలో opdr హక్కుల సంస్థ లో పని చేశారు.
ఆయన అన్నదమ్ములు విప్లవ రాజకీయలు లో పని చేస్తున్నారు.ఆయన తమ్ముడు కైలాశం మావోయిస్టు లో పని చేస్తూ బూటకపు ఎన్కౌంటర్ లో మరణించారు. ఇటీవల ఆయన వదిన కళావతి @ భవాని ఎన్కౌంటర్ లో గాయపడి పోలీసులు అదుపులో ఉన్నపుడు ఆమె ప్రాణాలకు హాని జరుగుతుంది అని భావించి తీవ్రo గా మదన పడ్డారు.
ఆ సమయంలో పౌరహక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పుడు ఆయన ఆమె వివరాలను అందించి సహకరించారు.హైకోర్టు జోక్యం ఫలితం గా ఆమె ప్రాణాలతోనే జైలు లొనే ఉన్నది. కుటుంభం లో4గురు అన్నదమ్ములు, వదిన గారు సమాజం లో ప్రజల హక్కుల కోసం నిలబడి, దోపిడీ లేని సమానత్వ సమాజం కోసం ప్రజాతంత్ర హక్కుల కోసం పనిచేయటం చాలా గొప్ప విషయం. అరుదైన విషయం. విశేషం.
ఆయన మరణం ఐక్య హక్కుల ఉద్యమానికి, సమాజానికి తీరని లోటు. Opdr సంస్థకు,కుటుంబానికి ఆయన మరణం వలన జరిగిన నష్టం పూడ్చలేనిది.
ఆయనకు పౌర హక్కుల సంఘ మరోసారి వినమ్రంగా జోహార్లు తెలియ చేస్తుంది. కన్నీటిని ఒత్తు కుని ఆయన ఆశయాల సాధనకు హక్కుల ఉద్యమ కార్యకర్తలు, శ్రేణులు ప్రజాతంత్ర శక్తులు కృషి చేయాలని పౌర హక్కుల సంఘ CLC విజ్ఞప్తి చేస్తుంది.
ఇట్లు.
*పౌర హక్కుల సంఘం CLC*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ.
వి. చిట్టిబాబు
రాష్ట్ర అద్యక్షులు
చిలుకా చంద్ర శేఖర్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నంబూరి. శ్రీమన్నారాయణ
రాష్ట్ర ఉపాధ్యక్షులు.
Comments
Post a Comment