బీజేపీ కి బుద్ది చెప్పిన ప్రజలు | శ్రీమాన్

5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు..ఒక పరిశీలన.
ప్రజా ప్రత్యామ్నాయ ఐక్య సంఘటన అవసరం.

*హక్కుల కార్యకర్త
CLC శ్రీమన్నారాయణ*

      అధికారదర్పం తో వేయి పడగల కాషాయ విషపు నాగు  పౌర, ప్రజాస్వాఁమిక హక్కుల పైన విషం చిమ్ముతున్న వేళ 5 రాష్ట్రాలలో శాసన సభలకి ఎన్నికలు జరిగాయి.మోడీ,అమిత్ షా కాషాయ గణం మతం రంగు పులుముకుని మరీ ఎన్నికల గోతాములోకి దిగింది. ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసి మద్యం, డబ్బు తో పాటు  జై శ్రీరాం నినాదాన్ని బెంగాల్ ఎన్నికల ప్రచారం లో బహిరంగం గానే ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆ విషయం అసలు పట్టించుకోలేదు. 

 అన్ని బూర్జువా పార్టీలు డబ్బు,మద్యం పంపిణీ విషయం లో ఎన్నికల రణ రంగం లో ఇంచుమించు బీజేపీ లానే వ్యవహరించాయి. ఎప్పటి లానే ఓటరు ని ప్రలోభాలు పెట్టి ప్రజాస్వామ్యం ఖూనీ చేసి  ఎన్నికలు జరిపినారు. ఒక్క కమల హాసన్ పార్టీ మాత్రమే ఓటరు ని ఏ రకం గాను ప్రభావితం చేయలేదు.చేపలు పట్టి ఇవ్వను, చేపలు పట్టుకోవడానికి వలలు ఇస్తాను అని ప్రచారం చేశారు. విలువల పై నిలబడ్డారు. డబ్బు,మద్యం పంపిణీకి పార్టీ ని దూరం గా ఉంచారు. ఫలితాలు మే2న వెలువడినాయి. కమలహాసన్ పార్టీ  ఒక్క సీటు గెలవలేక పోయిన విలువలను గెలుచుకున్నారు. 

 బెంగాల్, తమిళనాడు,కేరళలో మెజార్టీ ఓటరు అన్నిప్రలోభాలను తట్టుకుని బాధ్యతయుతం గానే ఓటు వేశారు అని చెప్పవచ్చును. ప్రజల పై బుసలు కొడుతున్న  కాషాయం మూకలను అధికారంలోకి రాకుండా నిలువరించారు. దేశానికి ముంచు కొస్తున్న ప్రమాదాన్ని కొంతమేరకు ఆపగలిగినారు.ప్రధానం గా కేరళ లో CPM ,బెంగాల్ లో TMC తమిళనాడు లో DMK ని గెలిపించి  ఓటరు మత సామరస్యం,లౌకిక వాదం వైపు మొగ్గుచూపినారు. ఈ తీర్పు కాషాయ మూకల దూకుడు కి కళ్లెం వేసినట్లు  చెప్పుకొనవచ్చును. ఓటరు తీర్పు ఫలితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజా ఆకాంక్షను నెరవేస్తారా?లేదా తెలంగాణా kcr లా ఉంటుందా అనేది వారి విధానం బట్టి ఉంటుంది. వేచిచూద్దాం.

*5 రాష్ట్రాల ఎన్నికల తీర్పు  బీజేపీ కాషాయ మూకల ప్రాబల్యం తగ్గిస్తుంది*: 

          రాజకీయం గా కేంద్రం లో అధికారంలో ఉన్నప్పటికీ  నేడు 5 రాష్టాలలో బీజేపీ వైఫల్యం చెందింది. ప్రజలు ఇచ్చిన తీర్పు కి గతం లో ఉన్న దూకుడును భవిష్యత్ లో ప్రదర్శించక పోవచ్చును.ఇప్పటివరకు జరిగిన 14 రాష్ట్రాల ఎన్నికలలో 5 రాష్ట్రాలలోనే బీజేపీ గెలవగలిగింది.ఫలితంగా రైతులు,కార్మికులపై ఇప్పటి వరకు విరుచుకుపడిన తీరులో జిత్తులమారి ఎత్తుగడలు లో మార్పు రావచ్చును. ఇక నుంచి హిదూత్వ ఉన్మాదం కి సాధారణ హిందువులు దూరం గా ఉండవచ్చును.ఫలితంగా హిందూత్వ ఓట్లు బీజేపీ కి సన్నగిల్లే అవకాశాలు మెండు. అధిక ధరలు, ఉపాధి లేక పోవడం, కోవిడ్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో దోపిడీ, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ లో సౌకర్యాలు లేమి తో సంభవిస్తున్న లక్షలాది మరణాలు తదితర ప్రజా వ్యతిరేక విధానాలు వలన మోడీ ప్రభుత్వ ప్రాభవం తగ్గిపోయింది. ప్రజా వ్యతిరేకత ఏర్పడింది.దాని ప్రాభల్యం కొంత తగ్గింది. ఈ విషయాన్ని 5 రాష్ట్రాలలో ప్రజాతీర్పు స్పష్టం చేస్తోంది. 

  ఫలితంగా బీజేపీ లో లుకలుకలు,ముఠాలు సహజంగానే  ఏర్పడే అవకాశం ఉన్నది.  కేంద్ర సంస్థలు,వ్యవస్థలు మోదీ, అమిత్ షా ప్రభావానికి గురి కాకుండా వారి ఆకాంక్షలు కి అనుగుణంగా నడక పోవచ్చును. తమ పని తాము చేసుకుంటూ పోవచ్చును.ఇదంతా ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ శక్తులు గా ఏర్పడినప్పుడే ప్రజలకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

      *ఇదే బీజేపీయేతర రాజకీయ ప్రత్యామ్నాయ సంఘటనకు మంచి  సమయం*:

          ఆ పనిని కాంగ్రెస్ చేయలేదు. Ysrcp జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నపరిస్తితులలో ముందుకు రాలేడు. Kcr కూడా తెగించి ముందుకు రాలేని స్థితి. ముందుకు వచ్చిన ఆస్థాయి ఇవ్వరు. ఇక మిగిలింది బెంగాల్ టైగర్ దీదీ.ఆమెను బెంగాల్ ప్రజలు 213 సీట్లు ఇచ్చి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా గెలిపించారు. ఆమె ఇప్పుడు మత సామరస్యాన్నీ కోరుకునే భారత ప్రజల ప్రతినిధి గా   చూస్తున్నారు. ఆమె ఆ పాత్రను పోషించి గలదా? ఆమెకు కాంగ్రెస్ ఆస్థాయిలో మద్దతు ఇస్తుందా? అనే విషయాలు ప్రశ్నలు గా ఉన్నాయి.

   కాషాయ మూకల ఆగడాలకు,అరాచకాల ప్రశ్నించి ఎదు రోడ్డి నిలిచి జైలుపాలు అయిన పౌర, ప్రజాస్వామిక సంఘాల, మేధావుల విడుదలను ఆమె డిమాండ్ చేయ గలదా? కిషన్ జీ ని ఎన్కౌంటర్ చేయించిన ఆమె వారి మద్దతు పొందటo సాధ్యం కాక పోవచ్చును.

        దేశం లో మత సామరస్యం కోరుకునే  ప్రజల కోరిక మేరకు దీదీ మమతా బెనర్జీ బీజేపీయేతర బూర్జువా రాజకీయ ఐక్య సంఘటనకు అయినా కృషి చేస్తుందో లేదో కాలమే తేల్చుతుంది.

*పాయలుగా ఉన్న
ప్రజాస్వామికశక్తుల ఐక్యతే నిజమైన ప్రజాప్రత్యామ్నాయం*:

     ప్రగతిశీల శక్తులు, అభ్యుదయ వాదులు, పౌర, ప్రజాస్వామిక సంఘాలు, ప్రజాతంత్ర హక్కుల సమాజ నిర్మాణం కోరుకునే వారు ప్రజా ఉద్యమ ఐక్య సంఘటన ను నిర్మించాలి. ప్రజా సంస్కృతిని, భగత్ సింగ్ లాంటి దేశభక్తిని పెద్ద ఎత్తున యువతలోను, ప్రజాలలోను పెంపొందించాలి. అన్ని రకాల విషసంస్కృతులను, కాలం చెల్లిన మనుభవజాలాన్ని పారద్రోలి శాస్త్రీయ, ప్రజాస్వామిక భావజాలాన్ని సమాజంలో వెదజల్లాలి. అదే నిజమైన ప్రత్యామ్నాయం, దేశభక్తి అవుతుంది. అప్పుడే ప్రజాతంత్ర హక్కుల సమాజం నిర్మించ బడుతుంది.ప్రజల హక్కులు వర్ధిలుతాయి.
                    
     నంబూరి. శ్రీమన్నారాయణ
         హైకోర్టు న్యాయవాది
        రాష్ట్ర ఉపాధ్యక్షులు
   పౌర హక్కుల సంఘం CLC. AP.
        03.05.2021

Comments