పోలీసులు పెట్టిన కేసులను ఉపసంహరించు కోవాలి | పగో జిల్లా

ప్రచురణార్ధం.కొవ్వూరు.22.05.2021
*****************************
     బల్లిపాడు ర్యాంప్ వద్ద ఇసుక లోడ్ నిమిత్తం ర్యాంప్ లో లారీ దిగుతోంది గా నిన్న ట్రాఫిక్ కంట్రోల్ చేసే క్రమంలో ఆవేశానికి లోనై తాళ్ళ పూడి SI గారు డ్రైవర్ ల యూనియన్ అధ్యక్షుడు కొడమంచిలి. నాగరాజు ని లాఠీ తో కొట్టడం జరిగింది. వెంటనే నిన్న లారీల డ్రైవర్లు నిరసన తెలిపినారు. దెబ్బలు నొప్పి ఎక్కువ కావడం తో ఈ రోజు కొవ్వూరు ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం చేయించు కోవడం జరిగింది. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భాదితుడిని పరామర్శించడం జరిగింది. Si పై చర్యలు తీసుకుని బాధితుడి కి న్యాయం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి. శ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో ఆయన మాట్లాడుతూ ఇసుక సరఫరా కి అనుమతి ఇచ్చినది ప్రభుత్వం. ఆ ఇసుకను రవాణా చేసే లారీలను లైన్ లో ఉంచే భాద్యత ప్రభుత్వాని దే అవుతుంది అన్నారు. లారీ డ్రైవర్లు ను భాద్యులని చేసి కొట్టడం ఇదేమిటి అని అడిగితే కేసులు పెట్టడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు పెట్టిన కేసును తక్షణం తీసివేయ్యాలి అని అన్నారు. పోలీసులు కొంతమందికి సహకరిస్తు కొంతమంది పై అనవసర చర్యలు తీసుకుంటున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలి అని కోరినారు. ఇసుక కుంభకోణం నివారించాలని డిమాండ్ చేశారు..ప్రాణాలు కి తెగించి నది నుండి ఇసుక తెచ్చే ఇసుక కార్మికులు,రవాణా చేసే డ్రైవర్ ల కూలి పెంచాలని విజ్ఞప్తి చేశారు. సరఫరాలో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చి ఉచితం గా అందించాలి అని ఆయన సూచించారు. ఆయన వెంట పౌరహక్కుల సంఘం,లారీ డ్రైవర్ల సంఘం నాయకులు ఉన్నారు.
                         ఇట్లు
     నంబూరి. శ్రీమన్నారాయణ
          రాష్ట్ర ఉపాధ్యక్షులు.

              ఈర్లగడ్డ ఆకాష్, 
                కె. వేణు
               సభ్యులు
     పౌర హక్కుల సంఘం.

Comments