గడ్డం దయానంద్ కు జోహార్లు | పౌర హక్కుల సంఘం

గడ్డం దయానంద్ కు జోహార్లు!
        కామ్రేడ్ గడ్డం దయానంద్ కు జోహార్లు. అతని కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం.దయానంద్ న్యాయవాది, ప్రజాస్వామిక గొంతుక ఈరోజు(17-05-2021) ఉదయం గుండె పోటు కు గురై ప్రగతి ఆసుపత్రి లో వైద్యం పొందుతూ మరణించారు. అతని మరణం ప్రజాస్వామిక ఉద్యమాలకు తీవ్ర లోటు. మృదు స్వభావి,సౌమ్యుడు, ఎవరికి కీడు తలతెట్టని వ్యక్తి. డిగ్రీ అనంతరం పోటీ పరీక్షలకు జే. సి.యస్.ప్రసాద్ లైబ్రరీ కొటగల్లి లో ప్రిపేర్ అయ్యేవాడు. లైబ్రరీలోని పుస్తకాలను, న్యూస్ పేపర్స్ ను చక్కగా అమర్చే వాడు. పుస్తకాలు నిరంతరం చదివేవాడు.ఈ క్రమంలో న్యాయ విద్యను అభ్యశించి నాడు. ఆకుల అరుణ ను కులాంతర వివాహం చేసుకున్నారు.వారికి ఇద్దరు అమ్మాయిలు.పెద్దమ్మాయి మేధా ఉక్రెయిన్ లో వైద్య విద్యను చదువుతుంది.,చిన్నమ్మాయి నిష్ణ అర్కిటే క్చర్ చడుతుంది. అతనికి చాలా కాలంగా మధుమేహం ఉన్నప్పటికీ అదుపులో ఉంచే వాడు. నేచురల్ ఆహారమే ఎక్కువగా తీసుకునే వాడు. ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అయిన కానీ అతనికి గుండె పోటు తీవ్రంగా వచ్చింది. సమయానికి ఆసుపత్రిలో చేరినప్పటి కి ప్రాణాలను కపాడుకొలేక పోయినాం.పౌర హక్కుల సంఘం లో కొంతకాలం పని చేసారు. విజయవాడ లో జరిగిన రాష్ట్ర మహా సభలకు జిల్లా నుండి ప్రతినిధి గా జిల్లా భృందం తో కలిసి హాజరై నాడు. నిజామాబాద్ నుండి విజయవాడ కు,తిరుగు ప్రయాణలో రైల్లో ఉన్నంత సమయంలో ఎంతో నవ్వులతో,జోకులతో గడిచి పోయింది.దయానంద్ లో కనిపించని హాస్యం ఉండింది. తరవాత యచ్.అర్. ఎఫ్ లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అతని జీవిత కాలం ప్రత్యక్షంగా,పరోక్షంగా ప్రజా ఉద్యమాలకు అండగా ఉన్నారు. దయానంద్ అకాల మరణం పట్ల పౌర హక్కుల సంఘం తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తుంది.

                మువ్వా నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు, ఆల్గో ట్ రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కమిటీ.

Comments