నిషేధం ఎత్తివేయాలి | శ్రీమాన్

రాజకీయ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ను హరిస్తున్న
*ఉపా చట్టం,124a* రాజద్రోహం లను రద్దు చెయ్యాలి.
*****************************
   
   ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఉభయ తెలుగు రాష్ట్రాలలో ని పౌర హక్కుల సంఘం నేతలు వేండంగి చిట్టి బాబు,చిలుకా చంద్ర శేఖర్( AP) V. రఘునాధ్ (TS) ఇతర ప్రజాసంఘాల నేతల ఇళ్ల పైన దాడులు చేసింది. తెలుగు రాష్ట్రాలలో  31 మంది పై ఏకకాలంలో ఈ దాడులు జరిపింది.కుట్ర చేసి అనాలోచితంగా పెట్టిన పసలేని ముంచింగి పుట్టు కేసుని NIA తీసుకుని ఈ దాడులు జరిపింది. అంతకు ముందు భీమ్ కోరేగావ్ కేసులో ముద్దాయిలు గా చూపిస్తూ మేధావుల,ప్రజాస్వామిక వాదులు ఇళ్ల పైన దాడులు చేసి అక్రమం గా జైలు లో నిర్బంధించినారు. ఉపా చట్టాన్ని,124a రాజద్రోహ సెక్షన్ల ను నమోదు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమించే ప్రజలపైన, ఉద్యమ కారులు పైన అక్రమంగా తప్పుడు  కేసులు బనాయిస్తున్నారు. *ఉపా చట్టం,124a* రాజద్రోహం చట్టాలు,సెక్షన్ లు అన్ని పౌరుల రాజకీయ స్వేచ్ఛ ను హరించేవి. ఇవి నియంతృత్వ చట్టాలు. ఈ నియంతృత్వ చట్టాలను అధికారం లో ఉన్న వారు ప్రతిపక్షాల పైన, ప్రత్యాన్మాయ రాజకీయ శక్తుల పైన పెట్టి రాజకీయ కక్షసాధింపు చర్యలు కి పాల్పడుతున్నారు. పాలకపార్టీలు అన్ని  ఇదే ధోరణి ని ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కి మంచిది కాదు.ఈ నేపద్యంలో తక్షణం ఉపా,రాజద్రోహం చట్టాలను రద్దు చెయ్యాలి అని సామాజిక ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. 

     పౌర హక్కుల కోసం పని చేసే పౌర హక్కుల సంఘం, ఇతర ప్రజాస్వామిక సంఘాల పట్ల అధికారం లో ఉన్న ప్రభుత్వాలు నిరంకుశం గా వ్యవహరిస్తున్నారు.
 పౌర హక్కుల సంఘం  ప్రజాస్వామ్య దృక్పథం,ఆచరణ పట్ల తప్పు గా ఆలోచిస్తూ రాజ్యం, వేగులు నడుస్తున్నారు. అధికారంలో ఉన్న వారి విధానాలు ప్రజా స్వేచ్ఛ, సమానత్వానికి ప్రమాదకరం గా  పరిణమించింది.
     
     గత 8 దశాబ్దాలుగా భారతీయ సమాజం లో రాజ్యం చేత ప్రజలు జీవించే హక్కుల విధ్వంసం విపరీతంగా జరిగినది. బ్రిటీష్ వాడి నుండి భారతీయులు కి అధికార మార్పిడి జరిగి 77 సంవత్సరం లు పూర్తి కావస్తోంది. ఈ కాలంలో  నెహ్రు, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్,రాజీవ్ గాంధీ,పి. వి. నరసింహరావు, వి.పి సింగ్ చంద్ర శేఖర్, దేవెగౌడ, వాజపేయి, మోడీ తదితరులు దేశాన్ని ప్రధాన మంత్రులు గా ఉండి పరిపాలించారు. వారి పాలనలో దేశంలోని ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు సహితం కల్పించబడ లేదు. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో కల్పించబడలేదు.ప్రభుత్వ బడి, ఆస్పత్రులలో కనీస సౌకర్యాలు కల్పన గాలికి వదిలేశారు.

  నేడు  కరోనా  కాలం లో సామాన్యుడు కి వైద్యం అందుబాటులో లేదు. కేంద్రం లో అధికారంలో ఉన్న మోడీ,సంఘ్ పరివార్ శక్తులు చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అన్నారు.పి.ఎం కేర్ ఫండ్ కి వేలాది కోట్లు దండుకున్నారు. వైద్య సౌకర్యాలు ఏర్పాటు లో నిర్లక్ష్యం వహించారు.  ముందుచూపు తో ఆక్సీజన్ ప్లాంట్స్ నెలకొల్ప లేదు.ఫలితం గా దేశం లో వేలమంది కరోనా తో మరణిస్తున్నారు.
దేశం ఈ దుస్థితి కి కారణం ఇంత వరకు పాలించిన రాజకీయ పార్టీలు విధానాలే కారణం. 

        90 వ దశకం లో మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు  తీసుకుని వచ్చారు. ప్రపంచ బ్యాంకు కి దాసోహం అయి ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలు ప్రజలు జీవించే హక్కులు ని కొల్లగొట్టాయి. శ్రమ దోపిడీ పెరిగింది.శ్రామికుడి బతుకు కష్టం అయింది. ఇదే ప్రజల ఆర్ధిక వ్యవస్థ పతనానికి దారి తీసింది.పెట్టుబడి దారుల ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెట్టాటానికి కారణం అయింది. ధనవంతులు మరింత ధనవంతులు కావటానికి, కుబేరులు మరింత కుబేరులు కావటానికి పేదలు మరింత పేదలు కావటానికి దోహదపడ్డాయి.

      ప్రజలు బ్రతకటానికి తీవ్రమైన కష్టాలుపడ్డారు.పడుతున్నారు.బ్రిటీష్ వాడికి వ్యతిరేకంగా ఉద్యమించి వాడిని పారద్రోలిన తర్వాత           తమ జీవితాలు సంపూర్ణం గా  మారతాయి అని భావించారు. అది సాధ్యం కాలేదు. నెహ్రు హయాం నుండి నేటి వరకు ప్రజలని త్యాగాలు చేయమని అంటూనే ఉన్నారు. త్యాగాలు చేస్తూనే ఉన్నారు. కోట్ల కి పడగలు ఎత్తిన వారు మాత్రం విలాషాలు అనుభవిస్తు సామాన్య ప్రజల పై ఎక్కి తొక్కుతున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. దోపిడీ నవీకరించ బడినది.

 అధికార మార్పిడి తర్వాత ప్రజలకు గిరిజన,దళిత, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి, సంక్షేమం, పేదరికం నిర్మూలన అనే మాటలు వినిపించేవి.ప్రజలు ముందు అవి ఇప్పుడు చెల్లని ఓట్లు.
   
          బ్రిటీషు వాడ్ని తరిమి కొట్టడం లో ప్రధాన భూమిక పోషించిన గదర్ వీరులు, భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ లు ఆశయాలు పౌరుల స్వేచ్ఛ, సమానత్వం ఇంకా నెరవేర్చలేదు. ప్రతి పౌరుడు సమాన విలువ, స్వేచ్ఛ, సమానత్వం తో బ్రతకాలి అనే మహా సంకల్పం వారిది.  పాలనలోకి వచ్చిన పాలకులు నెరవేర్చలేదు. కానీ మనం రాసు కున్న రాజ్యాంగం పీఠిక లో  (preamble) లో సామ్యవాద భావన భద్రం గానే ఉన్నది. రాజ్యాంగం లోని రాతలు కాగితాలకే పరిమితం చేసి పాలకులు ప్రజలను వంచిస్తున్నారు. భగతసింగ్ బృందం చెరశాలలు, ఉరికొయ్యలను ముద్దాడి ప్రాణాలు ని తృణప్రాయం గా అర్పించినది.  జాతీయ ఉద్యమం లో భారత ప్రజల భవిష్యత్ కోసం భగత్ సింగ్,  అల్లూరి ఇంకా ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారు.  ఈన గాసి నక్కల పాలు అయినట్లు  పాలన దోపిడీ దొంగల చేతుల్లో పడింది. మహనీయుల త్యాగాలు వృధా అవుతున్నాయి.

     ప్రజలు నల్లదొరల పాలన మనవారి పాలనే కదా అని కొన్ని రోజులు భరించారు. మార్పు కోసం త్యాగాలు చేశారు. మార్పు లేదు. అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలు పరిస్కారం కోసం పోరాట బాట పట్టినారు. హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య సంఘాలు, వివిధ పార్టీలు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేశాయి ఉద్యమించే ప్రజలకు మద్దతు గా నిలబడ్డాయి.కొన్ని హక్కులు ప్రజలు పోరాటాలు ఫలితం గా సాధించుకున్నారు.

   కార్మికులు,కూలీలు, ఉద్యోగులు కనీస వేతనాలు,కనీస సౌకర్యాలు సాదించుకున్నారు. ఆదివాసీలు 1/70 చట్టం,4/98 పంచాయతీ యాక్ట్, దళితులు, గిరిజనులు రక్షణ కొసం sc,st poa యాక్ట్, వివిధ వర్గాలు ప్రజలు తమ హక్కుల కోసం పోరాడి కొన్ని చట్టాలను సాదించుకున్నారు. 

    సంఘ్ పరివార్ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ పాలన తిరో గమనం వైపు పయనిస్తోంది. దోపిడీ రూపం నవీకరించబడింది. దేశ సంపదను కార్పొరేట్ లకు అప్పగించాటానికి దోపిడీ ని చట్టబద్ధం చేస్తున్నారు.భూస్వాములు దోపిడీ. భూస్వాములు పెట్టుబడి దార్ల అవతారం.  కార్పోరేట్ ల దోపిడీ జోరుగా సాగుతుంది.  ఆదాని ,అంబానీ లాంటి బడాబాబుల నిలువు దోపిడీ ని చట్టబద్ధం చేయడం జరిగింది .

        దాని కోసం రైతు చట్టాలు, లేబరు కోడ్ లు తీసుకు వచ్చారు. గరిబి హఠావో, భేటి బచావో, మేక్ ఇన్ ఇండియాలు బహిరంగంగానే మోడీ ప్రభుత్వం ప్రక్కన పెట్టేసింది.ఎవరి నెత్తి మీద చేతులుపెట్టాలో రైతు చట్టాలు,లేబర్ కోడ్ లని వారి పేరు మీదనే చట్టాలు తెచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. కార్పొరేట్ ల సేవలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరిస్తున్నాయి.

     రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. నేడు సంఘ్ భావజాలం తో ఉన్న శక్తులు అధికారంలోకి వచ్చి నిరంకుశ పాలన చేస్తున్నారు. వీరిని కార్పొరేట్ లు నడిపిస్తున్నారు.ఇదేమిటి అని ప్రశ్నించిన ప్రజలను, మేధావులు, ప్రజాస్వామిక వాదులను కుట్ర చేసి అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధిస్తున్నారు.ప్రగతిశీల భావజాలం పై శ్రామిక వ్యతిరేక నిరంకుశ పాసిస్ట్ మను భావజాలం దాడి చేస్తున్నది. 
      
         అందుకే హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక సంస్థలు ప్రజల హక్కుల కోసం నిరంతరం ఒక కర్తవ్యం గా పని చేస్తున్నాయి. జాతీయోద్యమంలో  అమరుల ఆశయాలు లక్ష్యం అయిన ప్రతి మనిషి కి సమాన విలువ, గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం కావాలని పోరాడుతున్నారు.మరో నూతన ప్రజాస్వామిక స్వతంత్ర భారతం కోసం ఉద్యమిస్తున్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. 

      వీరి ఉద్యమం, పోరాటం చట్ట బద్దం. రాజ్యాంగ బద్దం. సామాజిక మార్పుకోసం పనిచేసే ప్రజాస్వామిక ఉద్యమాలను, ప్రగతిశీల శక్తులను,ప్రగతిశీల భావాలను నేరమయం  చేయటానికి కుట్ర పన్నినారు. సంఘ్ మనువాద భావజాలం తో ఉన్న రాజ్యం కంకణం కట్టుకున్నది.  దాని కోసం ఉపా లాంటి ఛట్ఠం తీసుకురావడం లేదా చట్టాలలో మార్పులు తేవడం జరుగుతుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం. 

************************
*నిషేధం రాజ్యాంగ విరుద్ధం*:
*************************

    పౌర హక్కుల సంఘం 1975 లో మహాకవి శ్రీశ్రీ , ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షులు, ప్రధానకార్యదర్శి గా ఏర్పడింది.

  ఆనాడు ప్రజలకు భూమి,భుక్తి, విముక్తి నేపథ్యం గా  శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం  కొనసాగింది. ప్రజా సాయుధ పోరాటాలు అణచివేత కు సాయుధ పోలీసులు ని రాజ్యం దింపినది. భూస్వాములు కి అండ గా రాజ్యం నిలబడింది.  ప్రజలను,ఉద్యమ కారులని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయటం జరిగినది. చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపేశారు. రాజ్యం ప్రజలను ఉద్యమకారులను ఊచకోత కోసింది. జన హణనానికి పాల్పడింది. ఆ సమయంలో ఎన్కౌంటర్ లలో ప్రజల ప్రాణాలు తీసే అధికారం పోలీసులు కి  లేదని మేధావులు  అయిన శ్రీ,శ్రీ,ప్రముఖ న్యాయవాది ప్రత్తిపాటి వేంకటేశ్వర్లు తదితరులు  ప్రెస్ తో మాటాడేవారు. ఆనాడు అలా మాట్లాడటం ఒక సంచలనం. సాహసం.

          అప్పుడు పోలీస్ రాజ్యం నడిచేది.ఇదేమి రాజ్యం అన్నో ఇది పోలీసు రాజ్యం అన్న పాటలు ఆనాడు వచ్చినవే. మనిషి ప్రాణం విలువైనది వారిని  పోలీసులు కాల్చి చంపే అధికారం లేదు అని మేధావులు మాత్రమే మాట్లాడేవారు. ఆట్లా మాట్లాడే వారంతా కలిసి ఏర్పాటు చేసిందే ఆంద్రప్రదేశ్ పౌర హక్కులసంఘం.

     ఆనాడు బూటకపు ఎన్కౌంటర్ లలో మనిషి ప్రాణం,జీవించే హక్కు కోసం మాట్లాడటం తో ప్రారంభమైన పౌర హక్కుల సంఘం ప్రయాణం ప్రజలు జీవించే హక్కు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. భారతీయ శిక్షా స్మృతి IPC లో ఒక మనిషి ప్రాణాన్ని ఇంకో మనిషి తీసే అధికారం పోలీసులు కి సహితం లేదని కోర్ట్ లలో రుజువు చేసి వాదించింది.   
        
       ఆనాటి నుండి నేటి వరకు ప్రజలు జీవించే హక్కు కి భంగం కలిగిన ప్రతిసారి కోర్ట్ లు లో పౌర హక్కుల సంఘం  కేసులు వేసింది.న్యాయ వ్యవస్థ లో న్యాయ మూర్తులు ని ఆశ్రయించింది.  ఎన్కౌంటర్లలో చనిపోయిన వారి శవాలను బంధువులకు అప్పగించే వరకు పోరాడింది.. పోలీసులు అక్రమంగా  అరెస్ట్ చేసిన వారి తరపున చట్టబద్ద పోరాటం చేసింది ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం. ప్రారంభం లో ఎన్కౌంటర్ లు అన్ని పోలీసు హత్యలే అని రుజువు చేసింది. 

              ఈ కాలం లో పౌర హక్కుల సంఘం ఉద్యమం లో 6గురు అమరులను కోల్పోయింది. పౌర హక్కుల సంఘం ముద్దు బిడ్డలు అమరులు గోపి రాజన్న, జాపా లక్ష్మ రెడ్డి  ,డాక్టర్ రామనాధం, నర్రా ప్రభాకర్,పురుషోత్తం, ఆజం ఆలీలను రాజ్యం, రాజ్యం యొక్క ప్రైవేటు సాయుధ ముట్టాలు బలితీసుకున్నాయి.. వారి రక్త తర్పణలతో పౌర హక్కులసంఘం మరింత విశాలమైన,బలమైన హక్కుల సంఘం గా నిర్మితమైనది. ప్రజల హక్కుల కోసం మరింత సమిష్టి గా పని చేసింది.

      ఆనాటి నుండి నేటి వరకు ఉన్న పౌర హక్కుల సంఘం ప్రముఖ నాయకుల కార్యాచరణ తో ప్రజాస్వామిక అవగాహన, హక్కుల దృక్పధం ని విస్తృతంగా  అభివృద్ధి చేసుకున్నది.తన కార్యాచరణ పరిధి ని విస్టరించుకున్నది. కార్యాచరణ లో వచ్చిన ఆనుభవాలతో తన పరిధిని విస్తృత పరిచింది. ఆదివాసులు, దళితులు,మహిళలు,విద్యార్థులు, యువజనులు,ఉద్యోగుల, మేధావుల హక్కుల ఉల్లంఘన లు జరిగి నప్పుడు పౌర హక్కుల సంఘం వారి హక్కుల కోసం ముందుండి మాట్లాడింది.గొంతు లేని వారికి తాను గొంతుక ( voice of the voiceless people) గా మారి భాదితులు పక్షాన అండగా నిలబడి పనిచేస్తుంది.   ప్రజా ఉద్యమాలు లో వస్తున్న ప్రజా స్వామిక విలువలను, డిమాండ్ లను ఆకళింపు చేసుకుని పౌర హక్కుల సంఘం తన ప్రణాళిక లో ఇముడ్చుకున్నది. 

        మారుతున్న సమాజానికి అణుగుణం గా ప్రజాస్వామికం గా తన కార్యచరణను మార్చుకుంటూ పౌర,ప్రజాస్వమిక హక్కుల కోసం పోరాడుతున్నది.  ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రతి సందర్భం లో భాదితులు పక్షాన రాజ్యం జరిపే రాజ్య హింసను నిలదీస్తూ మాట్లాడింది. రాజ్యం అండ తో ఆధిపత్య శక్తులు జరిపే హింసను ప్రశ్నించింది. ప్రజాస్వామిక సంస్థలు తో కలిసి పోరాడుతున్నది.ప్రజాస్వామ్యం కోసం,ప్రజలు హక్కుల కోసం ఉద్యమించడం, వాటి పరిరక్షణ కోసం మాట్లాడటం,పోరాడటం పౌరహక్కుల సంఘం విధి.కర్తవ్యం.

  అలాంటి పౌర హక్కుల సంఘం ని తెలంగాణా kcr ప్రభుత్వం కేంద్రం లోని మోడీ ప్రభుత్వం కనుసన్నలలో నిషేధించినది. ఇది చాలా అప్రజాస్వామికం.ప్రజల సమస్యల పై పనిచేసే మిగతా 15 ప్రజాస్వామిక సంఘాల పైన నిషేధం విధించడం.అత్యంత దుర్మారం. ప్రజాస్వామిక సంఘాల నిషేధాన్ని ఎత్తి వేయాలని యావత్ ప్రగతిశీల సమాజం కోరుతుంది.

      నిషేద్దం ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ , 21జీవించే హక్కు ,14 సమానత్వ హక్కులకువ్యతిరేకం. రాజకీయ స్వేచ్ఛ అనే ప్రజాస్వామిక హక్కు ఉల్లంఘన  అవుతుంది. పౌర హక్కుల సంఘంCLC ,ప్రజా సంఘాల నిషేధం అప్రజాస్వామికం.

       నిషేధ భావనకు పౌర హక్కుల సంఘం సూత్ర బద్దం గా వ్యతిరేకం. భావాలు,రచనలు,పుస్తకాలు,సాహిత్యం,సంస్థలను,మనుష్యులు ని నిషేధించడం అప్రజాస్వామికం. అందుకే RSS నిషేధం సహితం పౌర హక్కుల సంఘం వ్యతిరేకించింది. 

      ఈ దేశం లో పౌర హక్కుల సంఘం భావన జాతీయోధ్యమంలొనే పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పౌర హక్కుల ఆలోచన రాజరికపు వ్యవస్థలో నే  ప్రారంభ మైనది. సోషలిస్ట్ వ్యవస్థ లో కూడా పౌర హక్కుల సంఘం ప్రజల హక్కుల కోసం వాచ్ డాగ్ గా పనిచేస్తుంది. ఈ విషయాన్ని పౌర హక్కుల సంఘం నాయకులు  ఇళ్ల పై దాడులు చేస్తున్న రాజ్యం,దాని అనుబంధ రాజ్యాంగ సంస్థలు గుర్తించాలి. 
        
     పౌర హక్కుల సంఘం UNO అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన( human rights declaration) అమలుకు పోరాడుతున్నది. పౌర హక్కుల సంఘాన్ని నిషేదించటం అంటే  హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ని నిషేదించటం అవుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన పైన వాటి అమలుకు భారత దేశం కూడా సంతకం చేసింది.
           
          రాజ్యం దుర్మార్గాలను, అరాచకాలు ని ప్రజల తరపున ప్రశ్నించడం రాజ్యం దృష్టి లో నేరం అయింది. నిషేధానికి గురైన 16 సంఘాల పని విధానం గత 50 సంవత్సరం లు గా ప్రజలకు సుపరిచయం. ఆ సంఘాలు అన్ని చట్టబద్ధ పోరాటాలు, ప్రాజాస్వామిక ఉద్యమాలు చేస్తున్నవే.

      తెలంగాణ ఉద్యమం కాలం లో ఉస్మానియా యూనివర్సిటీ లో హక్కుల సంఘం వేదిక పైన kcr మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత పౌర హక్కులు సంఘం కి నేనే మొదటి అధ్యక్షుడు ని ఆవుతాను అన్నాడు. ఇప్పుడు ప్రజల కోసం పనిచేసే 16 హక్కుల సంఘాలను  kcr- ప్రభుత్వం నిషేధించింది. ప్రజాస్వామిక తెలంగాణ తెస్తాను అన్న kcr ఎలా నిషేదించారో సమాధానం చెప్పాలి.బంగారు తెలంగాణా ఎక్కడ ఉందో తెలపాలి. అది ఒక్క kcr ఇంట్లోనే ఉన్నది అని ప్రజలు అంటున్నారు.నిత్యం అరెస్ట్ లు జైళ్లు, నిషేధాలా తో విసిగి పోయిన జనం ప్రజాస్వామిక తెలంగాణ ఎక్కడ అని కేసీఆర్ ని నిలదీస్తున్నారు.
       
       పౌరహక్కుల సంఘం విస్తృతమైన ప్రజాస్వామిక హక్కుల దృక్పథం, భావజాలం కలిగి ఉన్నది. సంఘ ఆచరణను రాజ్యం, వేగులు (NIA లాంటి సంస్థలు) మూసపోసిన పద్ధతుల్లో తప్పు గా అధ్యయనం చేస్తున్నారు అని అనిపిస్తుంది. పాత చింతకాయ పచ్చడి లాగా పౌర హక్కుల సంఘం తో పాటు ఇతర సంఘాలను  మావోయిస్టులు అనుబంధ సంఘాలు అని ముద్ర వేస్తున్నాయి. అరిగి పోయిన స్టీరియో రికార్డ్ ల మాట్లాడుతున్నారు. పౌరహక్కుల సంఘం  మావోయిస్టులు అనుబంధ సంఘం కాదు. ఏ సంఘానికి పార్టీ కి అనుబంధం కాదు.ప్రజలు జీవించే హక్కుల కోసం పోరాడే సంఘం. ప్రజల తరపున రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అన్ని రకాల హింసలను వ్యతిరేకిస్తుంది. హింస లేని సమాజాన్ని కాంక్షిస్తుంది.  పౌర హక్కుల దృక్పథం, ఆచరణను అంచనా వేయడం, అర్ధం చేసుకోవడం లో రాజ్యం, రాజ్య వేగులు విపలమౌతున్నాయి. అందుకే అవి పౌర హక్కుల సంఘం పట్ల తప్పు గా నడుస్తున్నాయి. 

    రాజ్య అవసరాలకి వేగులు తప్పు గా వక్రీకరించి ప్రజాస్వామ్యం, వ్యవస్థ లను ఖూనీ చేస్తున్నారు. ఉపా,124ఏ రాజద్రోహ చట్టాలు ప్రయోగించటం ఒక పెద్ద కుట్ర.మేధావులు, ప్రజాస్వామిక వాదుల ఇళ్ల పై దాడులు,కేసులు,జైళ్లు, సంఘాల నిషేధం ప్రగతిశీల భావజాలం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పైన దాడి. ఇది అప్రజాస్వామికం. రాజ్యాంగ విరుద్ధం.  
                      
                   By
    నంబూరి. శ్రీమన్నారాయణ.
       రాష్ట్ర ఉపాధ్యక్షులు
      హైకోర్టు న్యాయవాది.AP
         9493861875.

Email:lawyersreemannarayana@gmail.com

Address.
D. No 15.09.100/106. 
కొవ్వూరు. Near RTO ఆఫీస్
కొవ్వూరు మండలం.
పశ్చిమగోదావరి జిల్లా.
సెల్ 9493861875

Comments

Post a Comment