మనువాద విషసర్పం కాటు నుండిశాస్త్రీయ హక్కుల భావ జాలాన్ని రక్షించుకుంద్దాం | శ్రీమాన్

-మనువాద విషసర్పం కాటు నుండి
శాస్త్రీయ హక్కుల భావ జాలాన్ని రక్షించుకుంద్దాం!
-16 పౌర, ప్రజాస్వామిక సంస్థలు నిషేధం పై ప్రజాస్వామ్య పోరాటాన్ని ఉదృతం చేద్దాం!!
***************************
-పౌర హక్కుల సంఘం శ్రీమన్నారాయణ
**************************

 యూనియన్ ఆఫ్ ఇండియా indian society లో మనువు భావజాలం(RSS ),మార్కిస్టు భావజాలం( kamyunist partiess) , బుద్ధిష్ట్ భావజాలం (ambedkarists) లు ప్రధాన స్రవంతులు కొనసాగుతున్నాయి.సిక్కులు,జైన్ లు పార్శీకులతో పాటు అనేక పాయలు గా చీలి పోయిన ప్రజా సమూహాలు ఉన్నాయి. ఇవి చాలవు అన్నట్లు వీటితో పాటు జాతి, కుల,మత, భాష,ప్రాంత, లింగ విభేధాలు విపరీతంగా పెరిగిపోయాయి. అనేక అస్తిత్వ ఉద్యమాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. భారతీయ
ప్రజలు పైన పేర్కొన్న భావాలతో నేడు విడిపోయి ఉన్నారు. ఇవి వారి జీవన విధానం పై ముఖ్యభూమికను పోషిస్తున్నాయి.

    శ్రామిక ప్రజలు సహితం పైన చెప్పబడిన భావజాలాలకు ప్రభావవితమై ఉన్నారు. కమ్యూనిస్టులు మార్క్సిజం దృక్పధంతో ప్రజల మధ్య ఐక్యత ను పెంపొందిస్తూ సమసమాజ నిర్మాణం కోసం పోరాడుతున్నారు.

     ప్రజాస్వామిక వాదులు దోపిడీ లేని సమాజం, ఒక మనిషి ఇంకో మనిషి కి సమాన విలువ,గౌరవం ఇచ్చే అసమానతలు లేని ప్రజాస్వామిక హక్కుల సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్నారు. 

   రాజ్యం వారిలక్ష్యం నెరవేరకుండా సమాజం లో ప్రజల మధ్య ఉన్న అంతరాలను, అసమానతలను పెంపొందిస్తూ అగాధం ను సృష్టిస్తుంది.కుల,మత, భావజాలం తో వివాదాలను పెంచుతుంది. రాజ్యం జీవించే హక్కుల కోసం పోరాడే ప్రజలను ఒకటి కాకుండా అడ్డుకుంటుంది. సమాజం లో తన వర్గం యొక్క అక్రమార్కులు ని పెంచి పోషిస్తుంది.ప్రజల హక్కులను కాలరాస్తుంది.వివిధ బూర్జువా పార్టీలు అధికారం కోసం ప్రజలను మోసం చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు.కులం,మతం, ప్రాంతం,భాషలను సహితం ఉపయోగించు కుంటున్నారు. ఆక్రమం లో మెజార్టీ హిందూత్వ ఉన్మాదం ని రెచ్చగొట్టి మనువాద శక్తులు అధికారంలోకి వచ్చిన వెంటనే RSS ఎజెండా అమలుకు పూనుకున్నాయి. ఇది క్లుప్తంగా నేటి భారతీయ సమాజ చిత్రపటం

    బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాషాయ సంస్థలలో యువతను వివిధ ప్రలోభాలు తో రిక్రూట్ చేసుకున్నారు. శాస్ర్తియ భావాలకు,సామాజిక స్పృహ కు దూరంగా శిక్షణ ఇచ్చినారు. బంచ్ ఆఫ్ థాట్స్ గోళ్వాల్కర్ పాసిస్ట్ భావజాలం ఎక్కించినారు. అమానవీయమైన శిక్షణ లను ఇచ్చినారు. వేలాది మంది యువత మెదళ్ల కు కాలం చెల్లిన మనుసంస్కృతి భావజాలాన్ని ఎక్కించారు. అదే నిజమైన రాజ్యాంగం అని బోధించారు. భారత రాజ్యాంగం స్తానం లో మను రాజ్యాంగ అమలు కు కృషి చేయట మే యువత లక్ష్యం, ఆశయం గా రెచ్చగొట్టారు. అదే దేశభక్తి అని కొంత మంది యువత ను తయారు చేశారు. హిందుత్వ ఉన్మాద టెర్రరిజం ని ప్రోత్సహిస్తూ మైనార్టీలు,దళితులు,అభ్యుదయ శక్తులను,కమ్యూనిస్ట్ లపై దాడులకు తెగబడ్డారు. హత్యలకు ఒడికట్టారు. ఆధ్యాత్మికత పేరుతో సమాజాన్ని మనుసంస్కృతి లో భాగంగా చీలిపోయేటట్లు విషభావ జాలాన్ని గ్రామ గ్రామాన వెదజల్లి నారు.

 వారు మొదట ముస్లీం లను,క్రిస్టియన్లను అణచివేశారు.తర్వాత దళితుల పైన దాడులు హత్యలకు పాల్పడ్డారు. హిందూయిజం ఉన్మాదం ని రెచ్చగొట్టారు.గూండాయిజం ని ప్రోత్సహించారు. ' ఉనా', ముజఫర్ నగర్ లాంటి సంఘటనలను ఒక నమూనా లా ప్రతి భారతీయ గ్రామం లో సృష్టించారు. ఇతర మతస్థుల పైన, దళిత, నిమ్న వర్గాల పైన, కమ్యూనిస్టు లు,అభ్యుదయ వాదులపైన,మేధావుల పైన దాడులు,హత్యలు చేయించారు. యూనివర్సిటీ, కళాశాలలో విద్యార్థులు పైన దాడులు,హత్యలు, హత్యాచారాలు. వారి అరాచకాలు పరాకష్టకి చేరాయి.  

    జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి ని రద్దు చేశారు.ఆర్టికల్ 365, 35a లను భారత రాజ్యాంగం నుండి తొలగించారు. అంతర్జాతీయం గా భారత్ ని అప్రతిష్ట పాల్జేశారు. CAA, NRC, NRP లను తీసుకువచ్చి తమకు మద్దతు ఇవ్వని దేశపౌరులను పరాయి వాళ్ళు గా చిత్రీకరించారు

    దేశ సంపదను అభివృద్ధి పేరుతో బడా కార్పొరేట్ లకు అమ్మేస్తున్నారు. పరిశ్రమలను, రైతాంగ వ్యవసాయ భూములు ను అంబానీ,ఆదాని లాంటి బడా ధనవంతులు కి కట్టబెడుతున్నారు. కార్మికులు,రైతులు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ లో రైతులు రైతు చట్టాలను రద్దు చేయాలని ఇంకా ఉద్యమిస్తున్నారు. కార్మికులు లేబర్ కోడ్ ల రద్దు కోసం పోరాడుతున్నారు. విద్ద్యార్థులు,యువజనులు విద్య,ఉపాధి కోసం రణం చేస్తున్నారు. ఉద్యోగులు సీపీస్ రద్దుకు,తమ హక్కుల సాధన కోసం jac గా రోడ్ల పైకి వస్తున్నారు. అయిన ప్రజా సమస్యల పరిస్కారం కోసం ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు లేదు.

కోవిడ్19 సంక్షోభంలో వలస కార్మికుల,పేద ప్రజల బతుకులను గాలి కి వొదిలేశారు.కోర్టుల జోక్యం తో చేసిన అరకొర సాయం చాలామంది ప్రాణాలను కాపాడాలేక పోయింది. ఆసుపత్రుల నిలువ దోపిడీ పెరిగి పోయింది. ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పన లేదు.ఫలితం గా ప్రజలు కోవిడ్ తో లక్షలాది మంది మరణిస్తున్నారు.ప్రజా ఆరోగ్య వ్యవస్థ తీవ్రం గా దెబ్బతిన్నది. తీవ్ర అసంతృప్తిని ప్రభుత్వాలు ప్రజల నుండి నేడు ఎదుర్కొంటున్నాయి.
  
    వాటికి వ్యతిరేఖం గా పోరాడిన, ప్రతిఘటించిన కమ్యూనిస్టులు మేధావులు,ప్రజాస్వామిక వాదుల పై భీమ్ కోరేగా లాంటి కుట్ర కేసులు పెట్టి అక్రమం గా జైలు లో నిర్బంధించారు. వారిపైన తప్పుడు ప్రచారానికి,దుష్ప్రచారం కి ఒడిగట్టినారు. NIA లాంటి ప్రముఖ దర్యాప్తు సంస్థలను తమ పార్టీ సంస్థలు గా వాడుకుంటున్నారు. NIA అధికారులను తమ పార్టీ కార్యకర్తలు, ఏజెట్లు గా ఉపయోగించుకుంటున్నారు.ఇదంతా దేశభక్తి ముసుగులో జరుగుతుంది. నేడు భారతీయ సమాజం పాసిస్ట్ పాలన వలన ప్రమాదపు చివరి అంచున నిలబడి ఉన్నది.

   భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ, ప్రజలు జీవించే హక్కులు కి విఘాతం. రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచారు. ఆదివాసులు అడవి లో జీవించకుండా గెంటివేస్తున్నారు. దళితులు,బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అడవి భయట మైదాన ప్రాంతంలో బ్రతకలేని స్తితి.

                                                  అంబానీ,ఆదాని లాంటి వారు ఆస్తులు ఆమాంతంపెరిగాయి.
ప్రజల జీవన ప్రమాణాలు ఒక వైపు పడిపోయింది. అభివృద్ధి అంటే కార్పొరేట్ లదే. సామాన్య ప్రజలు శ్రమ వారికి కారు చౌక. బ్రిటీష్ వాడి పాలన కంటే దిగజారిన పాలన.

 మోడీ ప్రభుత్వం ప్రస్తుతం కమ్యూనిస్టులను ప్రజాస్వామిక వాదులను వేటాడి వెంటాడుతోంది. బీజేపీ మోడీ ప్రభుత్వం. ప్రగతిశీల కమ్యూనిస్టు భావజాలాల పై దాడి చేస్తుంది. 

     సాక్షాత్తు ఈ దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రత్యేకం గా రంగంలోకి దిగినట్లు ఉన్నారు.ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఈ దేశానిది కాదు అని మేడే రోజున ఉపన్యసించారు. ఇంకా కొంచం ముందుకుపోయి విశ్వకర్మ దినోత్సవం రోజున జరపాలని సెలవిచ్చారు. కమ్యూనిస్టు ల వలన ఉత్పత్తి పడిపోయింది అని కార్పొరేట్ ల తరపున ప్రవసించారు. ఎంత చారిత్రక తప్పిందమో ఆయన ఉపన్యాసం పరిశీలిస్తే అర్ధమవుతుంది.

      తప్పనిసరిగా మేడే ప్రపంచ కార్మిక వర్గ దినోత్సవం. అది చికాగో కార్మికులు రక్తతర్పణల నుండి ఆవిర్భవించిన దినోత్సవం. అది భారత దేశానిదో మరో దేశానికి చెందినది కాదు. ఇటీవల సోషల్ మీడియాలో తిరుగుతున్నట్లు ఒక వీడియో లో చెప్పినట్లు ఏ వ్యక్తి కి చెందినది కాదు. ఆ వీడియో కమ్యూనిస్టు లకు,అంబేడ్కరిస్టుల మధ్య చిచ్చు పెట్టటానికి మనువాదులు సృష్టి.అదో పెద్ద కుట్ర. 

       శతాభ్దాల క్రితం మేడే చికాగో అమరవీరులు 8 గంటల పనిదినం కోసం జరిపిన పోరాటం లో చిందిన రక్తం లో నుండి పుట్టినది. అది ప్రపంచ కార్మిక వర్గ పోరాటాలలో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన చరిత్ర. 
      
     మనువాద విషసర్పం బుషలు కొడుతూ శాస్త్రీయ భావజాలాన్ని, ప్రజల హక్కుల దృక్పథాన్ని అంతం చెయ్యాలని కలలు కంటుంది.దానికోసం పది తలల కాలనాగు(73GO) ను సృష్టించి పౌర, ప్రజా సంఘాల ను నిషేధం పేరుతో అణచివేత కు పాల్పడుతున్నారు.సమాజం లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.ప్రజలు పాలకులను చూసి భయపడాలని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. ఇది రాజరికపు భావన.

      kcr ప్రభుత్వం కేంద్రలోని మోడీ ప్రభుత్వం తో చేతులు కలిపి 73 GO తీసుకు వచ్చి 16 పౌర, ప్రజాస్వమిక హక్కుల సంఘాలను నిషేధించారు. ప్రజలు జీవించే హక్కులు కోసం పోరాడే పౌర హక్కుల సంఘం ను కూడా నిషేధించారు.పౌర హక్కుల సంఘం ఈ సమాజలోనే కాదు సోషలిస్టు సమాజం లో కూడ ప్రజలు జీవించే హక్కుల కోసం పోరాడే సంఘం.అలాంటి ఉన్నత సంఘాన్ని సహితం తెలంగాణ ప్రభుత్వం నిషేధించినది. ఇది అత్యంత బరి తెగింపు. 

      ఇది అంతా సమాజం లో ప్రభుత్వాల పాలన కు ప్రజల నుండి వస్తున్న అసంతృప్తి ని ఎదుర్కొనలేక ప్రక్కదారి పట్టించటానికి ప్రభుత్వాలు ఆడుతున్న నీతిబాహ్య మైన ఆటలు. గత 50 సంవత్సరం నుంచి ప్రజాక్షేత్రం లో ప్రజాస్వామ్య బద్దం గా పనిచేస్తున్న సంస్థలు నిషేధం చట్టవ్యతిరేకం.రాజ్యాంగ వ్యతిరేఖం.తక్షణం 73GO ని రద్దు చేసి 16 పౌర, ప్రజాస్వామిక సంఘాల పై నిషేధాన్ని ఎత్తి వెయ్యాలి. రాజ్యాంగం లోని భావ ప్రకటన స్వేచ్చ,రాజకీయ స్వేచ్ఛ ను కాపాడాలి.ప్రజాస్వామ్యం పరిరక్షించాలి.ప్రమాదపు చివరి అంచున ఉన్న సమాజాన్ని రక్షించుకోవటానికి నకిలీ దేశభక్తు లను పారద్రోలటం నిజమైన దేశభక్తి.ఆ మహోన్నతమైన కర్తవ్యం కోసం దేశ ప్రజలు 
మరో స్వాతంత్ర్య పోరాటం నిర్వహించాల్సిన అవసర ఉన్నది.

  ... నంబూరి. శ్రీమన్నారాయణ.
            హైకోర్టు న్యాయవాది.
          రాష్ట్ర ఉపాధ్యక్షులు.
   పౌర హక్కుల సంఘం CLC. AP.

Comments