16 ప్రజా సంఘాలపై ప్రభుత్వ నిషేధాజ్ఞలు చెల్లుతాయా?..
ఈ జీవో చట్టం ముందు నిలబడదంటున్న న్యాయ నిపుణులు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వామపక్షాలు, వివిధ సంఘాల నేతల ధ్వజం
నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్
విరసం సహా 16 ప్రజా సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధం సంచలనం రేపుతోంది. ఒకేసారి ఇన్ని సంఘాలపై నిషేధాజ్ఞలు జారీ చేయడంపై న్యాయ నిపుణు లు, మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సంఘాన్ని నిషేధించే ముందు ప్రభుత్వం ఒక నిర్దేశిత విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ముందు ఆ సంఘానికి ప్రభు త్వం నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ప్రజల నుంచి, సంఘాల నేతల నుంచి అభ్యంతరాల ను స్వీకరించాలి. నేతల వివరణ, ప్రజల అభ్యంతరాల పై విచారణ జరపాలి. విచారణలో సంతృప్తి చెందకపోవడంతో పాటు అందుకు సరైన ఆధారాలుంటేనే ని షేధం విధించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, కేసీఆర్ సర్కారు ఇలాంటివేమీ పాటించకుండా ఒక్క జీవోతో 16 ప్రజా సంఘాలను నిషేధించిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి నిషేధ ఉత్తర్వులు కోర్టు ముందు నిలబడవని చెబుతున్నారు. 2005లో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ‘విరసం’ను నిషేధించగా.. కోర్టు ఆ ఉత్తర్వులను కొట్టివేసిందని గుర్తుచేస్తున్నారు. మావోయిస్టుకు అనుబంధంగా కొనసాగుతూ చట్ట వ్యతిరేక, విధ్వంసకర కార్యకలాపాలకు పా ల్పడుతున్నాయని, కార్యకర్తలను ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఉసిగొల్పుతున్నాయని ఆరోపిస్తూ 16 ప్రజా సంఘాలను నిషేధించిన సంగతి తెలిసిందే.
ముంచంగిపుట్టు కేసు నుంచే నిఘా..
విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు 2020 నవంబరులో వాహనాలను తనిఖీ చేస్తూ పంగి నాగన్న అనే జర్నలిస్టును పట్టుకున్నారు. కేసు నమో దు చేసి విచారణ జరిపారు. ఇదే కేసు ఆధారంగా ఎన్‌ఐఏ మార్చి 31న ఏపిలో 10 చోట్ల ప్రజా సంఘాల నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. అదే సందర్భం లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మె దక్ జిల్లాల్లో ప్రజా సంఘాల నేతల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. ఈ కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడంతో విచారణ ఆగిపోయింది. ఈ సోదాలు జరిగిన మార్చి 31కు ముందు రోజు అంటే.. మార్చి30 నుంచి అమల్లోకి వచ్చేలా తెలంగాణ ప్రభు త్వం 16 సంఘాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నీతిబాహ్యమైన, నిరంకుశ చర్య
ప్రజా సంఘాలపై నిషేధం విధించడం నీతిబాహ్యమైన చర్య అని సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు అన్నారు. చర్చల కు సిద్ధమని మావోయిస్టు పార్టీ సంకేతాలు ఇస్తున్న తరుణంలో నిషేఽధం విధించడం అర్థరహితమని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. అప్రజాస్వామికమని తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ధ్వజమెత్తారు. ఉత్తర్వులను వెం టనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజాసంఘాలను అణచివేస్తున్నారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు.
నిషేధానికి వ్యతిరేకంగా పోరాడతాం
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న 16 ప్రజా సంఘాలపై నిషేధం విధించడాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఖండించాలి. ఏడేళ్లుగా రూ.వేల కోట్ల ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తూ అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం పౌర, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోంది. ఇలాంటి చట్ట, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయంపై ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో పోరాడతాం.
చిక్కుడు ప్రభాకర్, తెలంగాణ ప్రజస్వామిక వేదిక కన్వీనర్
సుమోటోగా స్వీకరించాలి
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు తెలంగాణ ప్రభు త్వం తలొగ్గి, విప్లవ రచయితల సంఘం, ఇతర 15 ప్రజా సంఘాలపై నిషేధం విధించడం నియంతృ త్వ పరిపాలనకు ప్రతీక. భారత 48వ ప్రధాన న్యా యమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేసిన సందర్భంలో ఈ నిషేధ సమస్య వారి ముందు నిలబడి ఉంది. ఈ నిషేధ ఉత్తర్వులను సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి.
మంచాల అచ్యుత సత్యనారాయణరావు, విరసం సభ్యుడు
విద్యార్థి సంఘాలపై నిషేధాన్ని ఎత్తి వేయాలి
రాష్ట్రంలోని వివిధ విద్యార్థి సంఘాలను నిషేధించడాన్ని ఖండిస్తున్నాం. మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్వహణ కోసం ఏర్పాటైన టీవీఎస్, టీవీ వీ, డీఎ్‌సయూ, ఆదివాసి విద్యార్థి సంఘాలపై నిషేధం విధించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. నిషేధాన్ని ఎత్తి వేయాలి.
ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు, ఎస్‌ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు
చాడ వెంకట్‌రెడ్డి విమర్శ
పౌరహక్కుల కమిటీ సహా 16 సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన భావ ప్రకటన స్వేచ్ఛను, పౌరహక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. వ్యక్తి స్వేచ్ఛను, ప్రశ్నిం చే గొంతులను నొక్కడం ప్రాథమిక పౌరహక్కులకు భంగమని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు చాడ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాము చర్చలకు సిద్ధమేన ని మావోయిస్టు పార్టీ సంకేతాలిస్తున్న తరణంలో ఆ పార్టీతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో 16 సంఘాలను నిషేధించడం అర్థరహితమన్నారు.
తెలంగాణ ప్రత్యేక ఉద్యమం సందర్భంగా తానే పౌరహక్కుల సంఘానికి నాయకునిగా ఉండేందుకు ఇష్టపడుతానని చెప్పిన కెసిఆర్, ఇప్పుడు ఆ పౌరహక్కుల సంఘాలను నిషేధించడం అనైతిక చర్య అని అన్నారు. పౌరహక్కుల సంఘం వంటి వాటిని నిషేధించడమంటే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ అడుగుజాడల్లోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను అవలంబిస్తోందన్నారు. ఇప్పటికే ప్రొఫసర్ సాయిబాబాను కోరేగావ్ కుట్ర కేసులో, వరవరరావు వంటి పలువురిపై అక్రమకేసులు పెట్టి, అరెస్టు చేయడం దేశవ్యాపితంగా చర్చ నీయాంశమైందని గుర్తు చేశారు. తక్షణమే పౌరహక్కుల కమిటీ సహా 16 సంఘాలపై విధించిన నిషేధం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ప్రజా సంఘాల పై నిషేధం విధించడాన్ని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తీవ్రంగా ఖండించారు. అందులో ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని, రైతాంగ వ్యతిరేక మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని , పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్‌ఆర్‌సిని,యుఎపిఎను రద్దు చేయాలని పోరాడుతున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నందున ఈ ప్రజా సంఘాల పై మరొక సంవత్సరకాలం నిషేధాన్ని కొనసాగిస్తామని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించిడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా, రైతు వ్యతిరేక చట్టాలను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ నెలల తరబడి నిరంతరంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని పశ్య పద్మ అన్నారు. వారందరి ప్రజాస్వామిక హక్కు ను కాలరాస్తారా ? అని ప్రశ్నించారు. మన దేశం ప్రజాస్వామిక దేశమని, స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రజల ఐక్యతను దెబ్బతీసే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయమని పోరాడటంలో తప్పేమిటి? అని అన్నారు. పాలకులను వారి ప్రజా వ్యతిరేక చర్యలను విమర్శిస్తే సమాధానం చెప్పే ధైర్యం లేక ఉపా చట్టం కింద నెట్టి వేయాలి అనే దురుద్దేశం పాలకులకు ఉందన్నారు. ఈ అప్రజాస్వామిక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పశ్య పద్మ విమర్శించారు.
నిషేధం..ఆప్రజాస్వామికం : సిపిఐ(ఎం)
ప్రజాసంఘాలను నిషేధించడం అప్రజాస్వామికమని, జిఒను వెంటనే ఉపసంహరించుకోవాలి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రజాసంఘాలు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజాసమస్యలపై పనిచేస్తున్నాయని, ప్రభుత్వ విధానాలు ప్రజానుకూలంగా వుంటే సమర్ధించడం, ప్రజాప్రయోజనాలకు విరుద్ధమైతే వాటిని ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తాయని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాసంఘాలు, సంస్థలు, వ్యక్తులు గానీ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తే వాటిపై చర్యలు తీసుకోవడానికి అనేక చట్టాలు, జిఒలు ఉన్నాయని, కానీ సంఘాల ఉనికే వద్దని నిషేధించడం, ప్రశ్నించడాన్ని అణచివేయాలని అనుకోవడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా రాష్ర్టప్రభుత్వం పునరాలోచించి ప్రజాసంఘాలు, సంస్ధలపై నిషేధాన్ని ఉపసంహరించుకొని ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించాలని తమ్మినేని కోరారు.
కే సీ ఆర్ దగా కోరు పాలన
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఈ పదహారు సంఘాలు ప్రజాస్వామిక బద్దంగా క్రీయాశీలక భూమిక పోషించిన సంగతి యాది మర్చినరా..! మీరు నిషేధించిన పదహారు సంస్థలు సంఘ విద్రోహ శక్తులైతే వారితో ఆనాడు ఎంధుకు కలిసి పని చేసినట్లు..? ఒకప్పుడు ఈ నిర్బంధాన్ని ఎదుర్కొన్నది మీరే కదా..అధికారంలోకి వచ్చినంక ఇంత తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడం దేనికి సంకేతం.? మీరంటున్న ఆ సంస్థలు నిన్ననో,మొన్ననో, ఇవాళనో,లేక తెలంగాణ వచ్చినంకనో పుట్టు కొచ్చిన సంస్థలు కావు ..! మీరు కూడ ఆ సంస్థలతో కలిసి పనిచేసినవారే .! మీరు మరియు ఆ నిషేధిత పదహారు సంస్థలు అనేక సంవత్సరాలు గా ప్రజల పక్షాన పోరాడినవారే .! మీరు అధికారనంతరం ఉద్యమాన్ని మరచినా,ప్రజ సమస్యలను మరచినా వారైతే ప్రజా సమస్యలకు అంకితమై ఉద్యమిస్తున్నది వాస్తవం కాదా.!”
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కవిగా రచయిత గా తన బాధ్యత ను నిర్వర్తించిన వరవరరావు ని,ఆచార్య సాయిబాబా ని అక్రమంగా అరెస్ట్ చేస్తే వారి ని విడుదల చేయమని కోరడం చట్ట వ్యతిరేకమా..!చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పాలకులను ప్రశ్నించడం చట్ట వ్యతిరేకమా..!ఇది అంబేడ్కర్ వ్రాసిన భారత రాజ్యాంగం లో వుంధా…! లేక మీస్వప్రకటిత రాజ్యంగమా..! ప్రశ్నించకూడదని కూడ జి.వోలు తెస్తారా..! అలా అయితే అధికార పార్టీలు కూడ ప్రతిపక్షాలను,ప్రజా సంఘాలను ఎదురు ప్రశ్నించొద్దు.. అలా ప్రశ్నిస్తే మీరు తెచ్చిన జి.వో నెంబర్ 73 మీకు కూడ వర్తిస్తది ..!తెలంగాణ సమాజం లోని ప్రతిపక్షాలకు కూడ వర్తిస్తది ..! జి.వోల పేరుతో నోర్లు మూసే పద్దతీ ఏమి పద్దతి.. ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఉన్నామా..! లేక నియంతల పాలనలో ఉన్నామా..! ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య నివసిస్తున్న,ప్రజా సమస్యల పై,ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న వ్యక్తుల పైన, సంస్థల పైన, సంఘాల పైన నిషేధం విధించడం ప్రజాస్వామిక పద్దతా..!
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఈ పదహారు సంఘాలు ప్రజాస్వామిక బద్దంగా క్రీయాశీలక భూమిక పోషించిన సంగతి యాది మర్చినరా..! మీరు నిషేధించిన పదహారు సంస్థలు సంఘ విద్రోహ శక్తులైతే వారితో ఆనాడు ఎంధుకు కలిసి పని చేసినట్లు..? ఒకప్పుడు ఈ నిర్బంధాన్ని ఎదుర్కొన్నది మీరే కదా..అధికారంలోకి వచ్చినంక ఇంత తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడం దేనికి సంకేతం.? మీరంటున్న ఆ సంస్థలు నిన్ననో,మొన్ననో, ఇవాళనో,లేక తెలంగాణ వచ్చినంకనో పుట్టు కొచ్చిన సంస్థలు కావు ..! మీరు కూడ ఆ సంస్థలతో కలిసి పనిచేసినవారే .! మీరు మరియు ఆ నిషేధిత పదహారు సంస్థలు అనేక సంవత్సరాలు గా ప్రజల పక్షాన పోరాడినవారే .! మీరు అధికారనంతరం ఉద్యమాన్ని మరచినా,ప్రజ సమస్యలను మరచినా వారైతే ప్రజా సమస్యలకు అంకితమై ఉద్యమిస్తున్నది వాస్తవం కాదా.!
సమైక్యాంధ్ర పాలకులు కూడ గతంలో ప్రజా సంఘాల పై నిషేధం విధించారు ..! ప్రజా సంఘాల పట్ల వారికీ మీకూ అభిప్రాయాల్లో తేడా ఏమిటి..? వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ప్రజా సంఘాల పై నిషేధం విధించడం ఇది మొదలేమి కాదు చివరిదేమి కాదు.కాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో ప్రజా సంఘాల రోల్ వెలకట్టలేనిది ..! తెలంగాణ భావజాల వ్యాప్తిలోను, ఉధ్యమ నిర్మాణం లోను ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ పార్టీ లు అలిసిపోయి ఎత్తేసినప్పుడుల్లా సజీవంగా వుంచింది ఈ పౌర సమాజమే ..ఈ చరిత్ర ను యాది మర్చినరా..! ప్రజా సంఘాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన స్వయం పాలకులు ప్రజా సంఘాల కు ఇచ్చే గౌరవం ఇదేనా..! పైగా అర్బన్ ప్రాంతాలలో గెరిల్లా దళాలను తయారుచేస్తున్నరనే అపవాదు మోపుతున్నరు.ఇదేనా తెలంగాణ ఉధ్యమ స్పూర్తి నుండి నేర్చుకున్నది..? రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పదహారు సంఘాలు చేసిన సంఘ విధ్రోహక చర్యలేమిటో నిరుపించగలరా..!ప్రజా క్షేత్రం లో వారు చేస్తున్న కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకం అనడం అనైతికమైన చర్య కాదా..!
అసంబద్దమైన చట్టాలు తీసుకొచ్చి ఏలాంటి ఆధారాలు లేకుండా ఏండ్ల తరబడి జైలల్లో విచారణ ఖైధీలుగా నిర్బంధించబడిన కవులను,రచయితలను,హక్కుల నేతలను విడుదల చేయమని కోరడం నేరమా..! ప్రశ్నించడమే రాజ్యవ్యతిరేకమని భావిస్తే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం.ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను గౌరవించడం అలవర్చుకోవాలి గాని..అణచివేత ధోరణులతో ఆధిపత్యం చేలాయిస్తమనడం మంచిపద్దతి కాదని చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఆశిస్తుంది.
పాలకులకు అధికారం ఎప్పటి కి శాశ్వతం కాదు.మార్పు అనేది సహజం. ప్రభుత్వాలు ఆ వైపుగా పాలనా విధానాలు రూపొందించాలి. రాజ్యంగం నిర్థేశించిన మార్గంలో నిర్మించబడే చట్టాలకే ప్రజామోదం వుంటది.అలాంటి చట్టాలు శాశ్వతం.రాజ్యంగంలో పొందుపర్చిన హక్కులు శాశ్వతం.ఎవరైనా రాజ్యంగానికి లోబడే వ్యవహరించాలి.ఆ కోణంలో పాలన జరగాలనేదే పౌర సమాజం ఆకాంక్ష.
– పందుల సైదులు
తెలంగాణా విద్యావంతుల వేదిక
Comments
Post a Comment