నిషేధం రాజ్యాంగ విరుద్ధం | నంబూరి శ్రీమన్నారాయణ

పౌర హక్కుల సంఘం మరియు ఇతర 15 ప్రజా సంఘాల పై నిషేధం ఎత్తి వెయ్యాలి. పౌర హక్కుల సంఘాన్ని మావోయిస్టు సంఘం అని రాజ్యం చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టండి.

   ది.30.04.2021న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రదాన కార్యదర్శి ఉమేష్ కుమార్ పేర GO no 73 రిలీజ్ చేసింది. అందులో      
మావోయిస్టు అనుబంధ సంఘాలు అనే ముద్ర తో పౌరహక్కుల సంఘం తో పాటు ఇతర ప్రజా సంఘాలను నిషేధించడం జరిగింది. ఈ నిషేధం అప్రజాస్వామికం. తక్షణం ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నాము.

ప్రజల సమస్యలను పరిష్కరించలేని kcr ప్రభుత్వం 
ప్రజల హక్కుల కోసం పని చేసే సంఘాలను నిషేధించి తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామిక వాదుల గొంతులను అణచివేయాలని చూస్తోంది.ప్రజా సంఘాల నిషేధం ప్రజా సమస్యలకు పరిస్కారం కాదు. ఇది చట్ట వ్యతిరేకం. రాజ్యాంగ విరుద్ధం.

 తెలంగాణ సమాజం నుండి ఉబికి వస్తున్న ప్రజావ్యతిరేకతను ప్రక్కదారి పట్టించి కార్పొరేట్ ల సేవలో తరించటానికే పౌరహక్కుల సంఘం ఇతర 15 ప్రజా సంఘాల నిషేధం విధించారు.

 సంఘం పెట్టుకోవడం ప్రచారం చేసుకోవడం తమకు నచ్చిన రాజకీయాలను ప్రచారం చేసుకోవడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు. రాజ్యాంగ హక్కుల పరిధిలో పనిచేస్తున్నపౌర హక్కుల సంఘం తో పాటు ఇతర 15 ప్రజా సంఘాలను నిషేధించడం తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్ట.

చట్ట ప్రకారం ప్రజల తరపున అడగటం నేరమా?

 చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నాయని పౌరహక్కుల సంఘం తో బాటు ఇతర ప్రజా సంఘాలు పైన తెలంగాణ ప్రభుత్వం ముద్రవేసింది. ప్రజల హక్కులను కాపాడాలని మాట్లాడటం, వాటి కోసం పనిచేయడం ఏ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు 👌🏽అవుతాయి అని ఈ సందర్భంగా సందర్భంగా మేము kcr ప్రభుతాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒక బాధ్యతగల ప్రజాస్వామిక సంస్థగా ప్రజలు జీవించే హక్కు లను కాపాడాలని పౌర హక్కుల సంఘం పనిచేస్తున్నది. నాలుగు దశాబ్దాల హక్కుల ఉద్యమ చరిత్రలో జీవించే హక్కులకోసం మాట్లాడిన పోరాడిన ప్రపంచ చరిత్ర పౌర హక్కుల సంఘానికి ఉన్నది. ఒక మనిషిని వేరొక మనిషి చంపే అధికారం భారతీయ చట్టాలలో ఏ వ్యక్తికి ఇవ్వలేదని పౌరహక్కుల సంఘం పోరాడింది. న్యాయవ్యవస్థకు తప్ప మనిషిని శిక్షించే అధికారం పోలీసులకు సైతం ఇవ్వలేదని కోర్టు లోపల కోర్టు బయట గొంతెత్తి ఉద్యమించిన చరిత్ర పౌరహక్కుల సంఘంది. శాంతియుత సమాజం కావాలని పోరాడుతున్నది పౌరహక్కుల సంఘం. హింసలేని సమాజాన్ని నిర్మించి ప్రజలు జీవించే హక్కును కాపాడాలని పౌరహక్కుల సంఘం కృషి చేస్తున్నది.తెలంగాణ వస్తే పౌర హక్కుల సంఘం మొదటి అధ్యక్షుడు ని నేనే అవుతా అన్నావు. kcr ప్రభుత్వం మీకు హక్కుల, ప్రజా సంఘాలు ని నిషేధించే నైతికత, అర్హత లేదు అని తెలియచేస్తున్నాం. ప్రజల హక్కులను అడగటం నేరం ఎలా అవుతుందో kcr సర్ చెప్పాలి?

 హింసకు ప్రధాన కారణం మీ రాజ్యము యొక్క ప్రజా వ్యతిరేక విధానాలే. రాజ్యం తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం, భాష, లింగ విభేదాలు సృష్టించి ప్రజల మధ్య హింస ను ప్రోత్సహిస్తు ఉన్నది.

 రాజ్యం యొక్క హింసాయుత విధానాలను ప్రధానంగా రాజ్యహింస ను పౌర హక్కుల సంఘం వ్యతిరేకిస్తోంది.
ప్రధానం గా హింస కు పౌర హక్కుల సంఘం వ్యతిరేకం. సమాజం లో హింస కు రాజ్యమే బాధ్యత వహించాలి అని పౌర హక్కుల సంఘం మరోసారి నొక్కి చెప్పుతుంది. 

          ఎందుకంటే ప్రజలకు నచ్చకపోతే రాజ్యం పై ప్రజలు తిరుగుబాటు చేయ వచ్చును. కానీ ప్రజల పై రాజ్యం తిరుగుబాటు చేయరాదు. అలా చేస్తే అది అవివేకం.రాజరికపు మూర్ఖత్వం అవుతుంది. ఇక్కడ తెలంగాణా ప్రభుత్వం రాజరికపు మూర్ఖత్వం నే ప్రదర్శన చేస్తోంది.

నిషేధం అనే భావానికి పౌరహక్కుల సంఘం వ్యతిరేకం. స్వేచ్ఛ, సమానత్వం లను ప్రాధమిక హక్కులు లో ప్రధాన మైన హక్కులు గా పౌర హక్కుల సంఘం గుర్తిస్తోంది.సమాజం కోసం పని చేసే,ఉపయోగపడే వ్యక్తులను సంస్థలను పార్టీలను భావాలను,రచనలు,కళలు,సినిమాలు,సాహిత్యం లను నిషేధించడం పౌర హక్కుల సంఘం సూత్ర బద్దంగా వ్యతిరేకిస్తోంది. 

శివసేన, ఆర్ఎస్ఎస్ ని నిషేధించిన సమయంలో కూడా ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని మాట్లాడిన చరిత్ర పౌరహక్కుల సంఘం కి ఉన్నది. అట్లాంటి చరిత్ర కలిగిన పౌర హక్కుల సంఘాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిషేధించింది. ఇది అత్యంత అప్రజాస్వామికం. చట్టవిరుద్ధం. రాజ్యాంగ వ్యతిరేకం.తక్షణం జిఓ 73 ని రద్దు చేయాలని 16 సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. ఈ నిషేధం పౌరహక్కుల సంఘం ని ప్రజల హక్కుల కోసం పని చేయటం నిలువరించ లేదని కేసీఆర్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రజలు జీవించే హక్కులకోసం నిరంతరం పౌర హక్కుల సంఘం పోరాడుతూనే ఉంటుంది. గొంతు లేని వారి పక్షాన నిలబడి వారి హక్కుల కోసం గొంతెత్తి నినదిస్తూ నే ఉంటుంది.

నిషేధించిన 16 హక్కుల సంఘాలు.
తెలంగాణ ప్రజ ఫ్రంట్ (టిపిఎఫ్), తెలంగాణ అసంగతిత కర్మిక సమాఖ్య (టిఎకెఎస్), తెలంగాణ విద్యార్ధి వేదికా (టివివి) సహా 16 స్వచ్ఛంద సంస్థలకు పేరు పెట్టారు. ), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డిఎస్‌యు), తెలంగాణ విద్యార్తి సంఘం (టివిఎస్), ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ (ఎఎస్‌యు), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్‌పిపి), తెలంగాణ రైతంగ సమితి (టిఆర్‌ఎస్), టుడమ్ దేబ్బా (టిడి), ప్రజా కాలా మండలి ( పికెఎం), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (టిడిఎఫ్), ఫోరమ్ ఎగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ (ఎఫ్‌హెచ్‌ఎఫ్‌ఓ), సివిల్ లిబర్టీస్ కమిటీ (సిఎల్‌సి), అమరుల బంధు మిత్రులా సంఘం (ఎబిఎంఎస్), చైతన్య మహిలా సంఘం (సిఎంఎస్), రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఎ)



పౌర హక్కుల సంఘం మావోయిస్టు అనుబంధ సంఘం కాదు.

   పౌర హక్కుల సంఘం మహాకవి శ్రీశ్రీ అధ్యక్షతన 1975 లో ఏర్పడినది. ఉమ్మడి హైకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు మొదటి ప్రధానకార్యదర్శి.ప్రజల హక్కుల కోసం కన్నాభిరాన్, బాలగోపాల్, భూర్గుల ప్రదీప్, బి.ఎస్ రాములు,బి చంద్రశేఖర్,ప్రొఫెససర్ శేషయ్య, ఎం.టి. ఖాన్, ఎం.రత్నమాల,డాక్టర్ వెంకటరావు గారి లాంటి ఎంతోమంది మేధావులు, న్యాయ వాదులు,డాక్టర్లు సంఘలో ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటాలు మరవలేము. ప్రస్తుతం సంఘం లో డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు ప్రజలు జీవించే హక్కుల కోసం పని చేస్తున్నారు. ఎంతో మంది మేధావులు ఉన్న పౌర హక్కుల సంఘాన్ని మావోయిస్టు అనుబంధ సంఘం గా ముద్ర వేయటం బాధాకరం. 

ప్రభుత్వాల వైఖరి సమాజానికి నష్టం. సంఘం పైన పోలీసులు, ప్రభుత్వాలు దుష్ప్రచారం చేస్తున్నది. ఎందుకంటే ప్రజల హక్కుల గురించి మాట్లాడే వారిని లేకుండా చెయ్యాలి అనే ప్రభుత్వాల విధానం లో భాగమే. 

 పోలీసులు మాట్లాడు తు న్నట్లే ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. లేదు లేదు ప్రభుత్వాలే పోలీసులు తో అలా మాట్లాడిస్తున్నాయి. పౌర హక్కుల సంఘం గత నాలుగున్నర దశాబ్దాల కాలం గా ప్రజల హక్కులు ప్రామాణికంగా పని చేస్తున్న సంఘం. 

ఆమ్నెస్టీ, ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థలు కి సహితం పౌర హక్కుల సంఘం కార్యకలాపాలు బాగా తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును పొందిన సంఘం పౌర హక్కుల సంఘం. అలాంటి సంఘం పై దుష్ప్రచారం ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు తిప్పికొట్టాలని,సంఘానికి అండ గా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

 సమాజ అభివృద్ధి ని హక్కుల కొలమానం గా చూస్తున్న సంఘం. ఏ సమాజం లో ఐతే ప్రజలు హక్కులు ఎక్కువగా ఉంటాయో ఆ సమాజం లొనే ప్రజల అభివృద్ధి, స్వేచ్ఛ ఉంటుంది అని పౌరహక్కుల సంఘం భావిస్తుంది.

ఏ సమాజం లొనే కాదు సోషలిస్ట్ సమాజం లో కూడా పౌరుల పక్షాన నిలబడి మరింత స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం పౌరహక్కుల సంఘం పనిచేస్తుంది అని తెలియ చేస్తున్నాము.

-పౌర హక్కుల సంఘం,ఇతర ప్రజా సంఘాల పైన తెలంగాణ ప్రభుత్వం విధించిన అప్రజాస్వామిక నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాము.నిషేధం ఎత్తి వేయాలని నినదిద్దాం.పోరాడ ద్దాం.

-రాజ్యాంగ హక్కులు అయిన భావ ప్రకటన, రాజకీయ స్వేచ్ఛలను కాపాడుకుందాం

- ప్రజలు జీవించే హక్కుల కోసం నిరంతరం పోరాద్దాం.

                          ఇట్లు
         పౌర హక్కుల సంఘం
            ఉపాధ్యక్షులు
      నంబూరి. శ్రీమన్నారాయణ
              24.04.2021

--

Comments