ఉపాను రద్దు చేయాలి | కర్నూల్ జిల్లా


ప్రజా సంఘాల నేతలపై NIA అధికారులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నేడు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ నిరసన ప్రదర్శనలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. SDPI నాయకులు చాంద్ బాషా,CPI జిల్లా నాయకులు రామకృష్ణ రెడ్డి జహంగీర్ బాషా, POP నాయకులు శ్రీనివాస రావు, యోహాన్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ J.V. కృష్ణయ్య, B.C. నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు, సుంకన్న, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ భాస్కర రెడ్డి, B.C. సంఘం నాయకులు శేషపని, KNPS నాయకులు A.V. సుబ్బారాయుడు, బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు తుర్పాటి మనోహర్, రత్నం ఏ సేపు, పాల్గొని ప్రసంగించారు. UAPA చట్టాలను, NIA సంస్థ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Comments