ఆల్గోట్ లింగయ్య సంతాప సభ | తెలంగాణ

ఆల్గోట్ లింగయ్య సంతాప సభ

స్థలం: పుప్పాల పల్లి గ్రామం, జక్రాన్ పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా.
 తేదీ 04/04/2021(ఆదివారం), ఉదయం 11.00 గంటలకు

ప్రియమైన ప్రజలారా!
○ ఆల్గోట్ లింగయ్య తండ్రి నర్సింహులు,పుప్పాల పల్లి గ్రామం, జక్రా న్ పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా గారు తేదీ 25/03/2021 మధ్యాహ్నం 12.40 నిమిషాలకు మరణించారు. అతను ఆల్లొట్ లింగుభాయి, నర్సింలు గార్ల రెండవ కుమారుడు. అతని నడిపి తండ్రికి పిల్లలు లేనందున లింగయ్య ను దత్తత తీసుకున్నాడు. అతను అణచివేతకు గురైన వర్గంలో,పేద కుటుంబంలో పుట్టి, దాని నుండి కసిగా బంతిని నేల కేసి కొడితే పైకి వచ్చినట్లుగా ఎదిగినాడు. అతను 82 సంవత్సరాలు వయసులో కూడా నవ యువకుని వలే ఏ మాత్రం దివిటీ తగ్గకుండా జీవించాడు.
         లింగయ్యకు కుమార్తె విజయ, నల్గురు కుమారులు ఆల్గోట్ లింగయ్య, రవీందర్, ప్రభాకర్, సాయన్న కలరు. వీరి లో ఇద్దరు విప్లవ ఉద్యమంలో పని చేస్తున్నారు. ఆల్గోట్ రవీందర్, పౌర హక్కుల సంఘం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గా, ఆల్గొ ట్ సాయన్న, ప్రగతిశీల యువజన సంఘం, జక్రాన్ పల్లి మండల ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతున్నారు. వీరిద్దరూ కులాంతర వివాహాలు చేసుకుంటే వారిని సాదరంగా ఆహ్వానించి గొప్ప చైతన్యాన్ని ప్రదర్శించినాడు. అల్గోట్ రవీందర్ పి. డి. యస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి గా పని చేస్తున్న సమయం (1991) లో పోలీసు ( రాజ్యం) చిత్రహింసలకు గురి చేసినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించాడు.అతను,అతని భార్య నర్సుభాయి,పెద్ద కొడుకు లింగయ్య మనో నిబ్బరంతో ఉన్నారు. పీపుల్స్ వార్ గ్రూప్ (మావోయిస్టు పార్టీ) సిర్నపల్లి దళం లింగయ్య ఇంటికి వచ్చి రవీందర్ ను న్యూడెమోక్రసి పార్టీకి రాజీనామా చేయాలని బెదిరించారు. నా కొడుకు చేసిన తప్పేంటని వారిని ప్రశ్నించారు. ఇంటికి తాళం వేస్తానంటే బెదిరిపోలేదు, దైర్యంగ నిలబడి నాడు. అతని ఇద్దరు కుమారులు లింగయ్య, ప్రభాకర్ లు కూడా న్యూ డెమోక్రసీ పార్టీ సానుభూతి పరులే.

  లింగయ్య సాహసానికి, ధైర్యానికిి, స్నేహానికి ప్రతీక . అతనిది పొడవైన, దృఢమైన, తెల్లని ఆకారం. అతని మాటల్లో విశ్వాసం, నిజాయితీ ఉండేది. ఎదుటివారు ఎవరైనా కానీ దాపరికం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం అతని ప్రత్యేకత. ఎంతటి ప్రమాదన్నైన ఎదిరించ గల దృడ సంకల్పం కలిగినవాడు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిని ఆప్యాయంగా నమస్తే బాపు/కాక అని సాల్యుట్ (నమస్కారం) చేస్తూ ఎదుటి వారిని నిండు మనసుతో గౌరవించే వాడు. కష్టజీవి, రాత్రి,పగలు నిరంతరం శ్రమ చేసినాడు. కొడుకులను సమాజంలో ప్రజలకు ఉపయోగ పడే వారిగా తీర్చి దిద్దారు.
       ప్రాథమిక పాఠశాల పుప్పాలపల్లి లో పి. టి. ఎఫ్ (ఛాప్రాసి) గా పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని నెలకు రూపాయలు 5/- వేతనంతో కొన్ని సంవత్సరాలు చేసినాడు.మిగితా సమయంలో వ్యవసాయం, బీడీలు చుట్టడం, వరి ధాన్యం బస్తాలు తూకం వేయడం చేసినాడు. ఒక సారి వరి ధాన్యం బస్తాల లారీ పై బస్తాలతో వెళ్తుండగా లారీ బోల్తా పడితే దాని పై నుండి దూకి తప్పించుకున్నాడు. 4 ఎకరాల వ్యవసాయం భూమిలో పండే పంటతో పిల్లలను పెంచడం సాధ్యం కాదని గల్ఫ్ బాట పట్టారు.కానీ అందులో మోసానికి గురైనాడు. చెల్లించిన డబ్బులను తిరిగి ఏజెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తే, ఎడ్ల నర్సింగావు న్యాయవాది ద్వారా కోర్టు కేసు వేసి గెలిచి నాడు.డబ్బులకు సమానమైన వ్యవసాయ భూమి 12 గంటలను సాదించినాడు. ఇది న్యాయం కోసం అతను పట్టుదల తో చేసిన పోరాటం.
        1983 డిసెంబర్ 2 వ తేదీన నిజామాబాద్ పంచాయతీ సమితి లో అటేండర్ ( చప్రాసి) పూర్తి కాలం ఉద్యోగం లో చేరినాడు.ఒక సారి బస్సులో నిజామాబాద్ కు డ్యూటీకి వెళ్తుండగా బస్సు నుండి దిగుతుండగా ఒక వెదవ ప్రయాణికుడు నెట్టి వేస్తే క్రింద పడగా ప్రమాదం తప్పింది. సైకిల్ పై 25 నుండి 60 కిలోమీటర్లు తిరిగి సర్పంచ్ లకు (టప్పా) సమావేశ లేఖలు అందించేవాడు. డిచ్ పల్లి మండల పరిషత్ లో కొన్ని సంవత్సరాలు పనిచేసినాడు.2003 సంవత్సరం వరకు సైకిలే అతని వాహనం. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మెంట్రాజ్ పల్లి లో పని చే స్తూ తేదీ 31/01/ 2008 నాడు ఉద్యోగ విరమణ పొందినారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు,విద్యార్థులు ప్రేమతో షష్టి పూర్తిని ఘనంగా జరిపినారు. అతని డ్యూటీ కాలంలో అధికారుల,ప్రజా ప్రతినిధుల మన్ననలు పొందినాడు. అనేక ప్రమాదాలను ఎదుర్కొన్నాడు. మోటార్ వాహన ప్రమాదానికి గురయ్యాడు. 2015 వ సంవత్సరంలో ఊపిరితిత్తులకు ఇన్స్పెక్షన్ వచ్చింది. పిస్తులా కు ఆపరేషన్ అయ్యింది. వీటిని అతని దృఢమైన శరీరం, ధైర్యం తో జయించాడు.
      గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడితే రెండు సార్లు వాటిని ఎదుర్కున్నాడు. చివరికి గాల్ బ్లాడర్ను ఆపరేషన్ చేసి తొలగించిన తరువాత కూడా అంతే దృఢంగా ఉన్నాడు. కానీ మరుసటి రోజే అతని దృఢమైన శరీరం, నమ్మకం ఓడిపోయింది. ఇన్స్పెక్షన్ సోకి ప్రతిభా దవాఖానలో మృత్రువుతో పోరాడుతూ మరణించాడు. 
       లింగయ్య మరణాంతరం అతని పార్థివ దేహాన్ని నిజామాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం ప్రయోగశాలకు ఇవ్వడం జరిగింది. ఇది లింగయ్య కుటుంబ సభ్యులు ధైర్యం, త్యాగం తో తీసుకొన్న నిర్ణయం. మెడికల్ కాలేజీ విద్యార్థులు లింగయ్య కుటుంబం కు రుణపడి ఉంటారు. మనిషి మరణించిన తరువాత వారి శరీరం కాలి భూడిధగా మరడమో లేదా పుడ్చడమో జరిగితే కుటుంబ సభ్యులకు తృప్తిని ఇస్తుంది. కాని మరణిస్తూ కూడా వారి శరీరం అవయవాలు దానం చేయడం వలన ఇతరులకు ప్రాణదానం చేసిన వారు అవుతారు. వీరు చనిపోతూ కూడా జీవించి ఉంటారు. అవయవాలు, పార్థివ దేహాన్ని దానం చేయడం పట్ల అవగాహన లేక మూడనమ్మ కం తో ప్రజలు ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు. దేహాన్ని, వీటి పట్ల ప్రజలకు అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. 
        లింగయ్య కుటుంబ సభ్యులు లింగయ్య పేరుతో విజ్ఞాన కేంద్రం ను స్థాపించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయం.
మరణిస్తూ జీవించిన ఆల్గోట్ లింగయ్య కు విప్లవ జోహార్లు!
     సభాద్యక్షులు: ఉప్పల ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి, సి పి ఐ (యం- యల్). న్యూ డెమోక్రసీ, ఆర్మూర్ డివిజన్.
ముఖ్య అతిథి: వనమాల కృష్ణ, ఇంచార్జ్ జిల్లా కార్యదర్శి, సి. పి. ఐ. (యం యల్) న్యూ డెమోక్రసీ, నిజామాబాద్ జిల్లా.
           అతిథి: వి. రఘునాథ్, హై కోర్టు న్యాయవాది, రాష్ట్ర ఉపాధ్యక్షులు, పౌర హక్కుల సంఘం.
            వక్త: బి. దేవరాం, రాష్ట్ర నాయకులు ఎ. ఐ కే. యం.యస్.
                  విప్లవాబినందనతో
. సి.పి ఐ.( యం ,- యల్), న్యూ డెమోక్రసీ, ఆర్మూర్ డివిజన్.

Comments