"టి.టి.డి. ఉద్యోగులు (శ్రీవారి నిరంతర సేవకులు) మనోవేదన"
కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో గట్టి ప్రమాద ఘంటికలను మ్రోగిస్తూ ఉంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. రాను రాను ఇది వికృతరూపం దాల్చుతున్నది. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. స్మశానవాటికలో శవాలను కాల్చుటకు 2 రోజులు కూడా నిరీక్షించే పరిస్థితి.లో నెలకొని వుంది. ప్రజలు ఐతే సరైన వైద్యం అందక, సమయానికి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇది ఇలా ఉంటే ఆధ్యాత్మిక నగరం ఐన తిరుపతిలో పరిస్థితి మరీ దారునంగా మారుతోంది. కారణం భారతదేశంలోని వివిధ పట్టణాలనుండి భక్తులు రావడం వల్ల ఇది జరుగుతోంది. ఈ భక్తులు కూడా "నాకు కరోనా లేదు" అనే సర్టిఫికెట్ తీసుకురావడం లేదు. గతంలో సేవలకు ఈ నిభందన పెట్టిన టీటీడీ ఇప్పుడు 300 టిక్కెట్ఇ కు పెట్టలేదు
దీనివల్ల యాత్రికులు, స్థానికులు, టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు.
ఇదిలా ఉంటే టి.టి.డి. అహర్నిశలు భక్తులకు అతి దగ్గర నుండి సేవాలందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఈ కరోనా మహమ్మారి భారిన పడి ఏకంగా మరనణిస్తున్నారు. ఇప్పటివరకు 20 మంది టీటీడీ శాశ్వత ఉద్యోగులు మరణించారు. . మరో 25 మంది తాత్కాలిక ఉద్యోగులు చనిపోయారు. టీటీడీ పెన్షనర్లు 150 మంది చనిపో యునట్లు వాళ్ళ అసోసియేషన్ ప్రకటించింది. అయినా టీటీడీ యాజమాన్యం ఉద్యోగుల ప్రాణాలను కాపాడే చర్యలు చేపట్టడం లేదు. వారి ప్రాణాలను కరొణాకు వదిలేసింది. ఒక్క ఉద్యోగికి కరోనా వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక్క రోజులోనే వస్తోంది. ఈ విదంగా టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు 30 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. 250 మందికి పైగా టీటీడీ ఉద్యోగులకు కరోనా వచ్చి వివిధ ఆపత్రులలో చేరి వున్నారు.
ఉద్యోగులకు తగిన ఆరోగ్య భద్రతా చర్యలు ఆశించిన మేరా చేపట్టడం లేదు. వారి ప్రాణాలు గాలిలో దీపంలా తయారైంది. అటు నాయకులకు చెప్పుకుందామంటే వారిలో యాజమాన్యాన్ని వత్తిడి చేసే సామర్థ్యం లేదు.
ఉద్యోగుల మొర ఆలకించే వారు లేరనే మౌనం వహిస్తున్నారు. ఇక నేరుగా యాజమాన్యం వద్దకు వెళ్లి విన్నవించాలంటే కరోనా వల్ల ఎవరిని కలవ నివ్వడం లేదు. ఉన్నత అధికారుల పేషీ నుండి సాధారణ అధికారులు వారి కార్యాలయాల్లో కూడా అనుమతించడం లేదు.
1. తిరుమల లో పనిచేస్తున్న వారు వేల మంది భక్తుల మధ్య విధులు నిర్వవర్తించాలి. ఆఫీసులో పనిచేసే వారి లాగా ఇతరులకు, ఉద్యోగులకు మధ్య ఎటువంటి పార దర్శక ప్లాస్టిక్ తెరలు వుండవు. 2. వీరికి సోకడం వల్ల ఇంట్లో వారికి గంటలలోనే సోకుతోంది. అందులో వయసు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న కుటుంసభ్యులు మృత్యువు ఒడిలోకి జారుకుంటున్నారు. 3. వారు విధులు నిర్వహించే ప్రదేశాల్లో సానిటీజషన్ ప్రక్రియ నిరంత రాయంగా లేదు. ఉద్యోగుల వారి సంక్షేమంలో భాగంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పి పి ఈ కిట్లు దానితో పాటు గ్లౌజ్, సానీటైజర్, మస్కులు విధిగా 15రోజులకు ఒక పర్యాయం ఇవ్వాలని కోరారు. కాని యాజమాన్యం ఇవ్వలేదు. 4. అవసరం ఉన్నచోట కూడా పి.పి.ఈ. కిట్లతో కూడిన దుస్తులను పంపిణీ చేయలేదు. 5. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేకంగా బస్సులు కేటాయించడం లేదు. అందులో సోషియల్ డిస్టెన్స్ తో ఉద్యోగులను తిరుపతి నుండి తిరుమలకు తిరుగు ప్రయాణంలో కూడా తీసుకు రావడం లేదు. 6. ఒక చిన్న ప్రయివేటు కంపెనీ వారి ఉద్యోగుల పట్ల తీసుకుంటున్న సంరక్షణా భాధ్యతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ధార్మిక సంస్థ వారి ఉద్యోగులku చేయకుండా వెనుకంజ వేడుతున్నది.
7. అసలు ఇప్పటిదాకా ఎంత మంది ఉద్యోగులు విధినిర్వహణలో కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారో? అందులో వారి తల్లిదండ్రులు ఎంతమంది చనిపోయారో? అందులో తిరుమలలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారు ఎంతమంది? అనే గణంకాలు టీటీడీ వద్ద లేవు. అవి ఉంటే, వాటిని బట్టి ఏవిధమైన చర్యలు తీసుకోవాలో, వాటిపై నిర్ణయాలు ఏం తీసుకోవలో టీటీడీ కి తెలుస్తుంది.
8. ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టి ఆఘమేఘాలపై తిరుమలకు అదనంగా (భారీ స్థాయిలో అనగా 150 మంది దాకా ఉండచ్చు) ఉద్యోగులను బదిలీ చేయడానికి ఉన్నతాధికారులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. వీళ్ళు కూడా కరోనా బారిన పడితే వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏందీ. వాళ్ల ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయా. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉళ్లంఘణ కాదా.
నిజానికి 30 శాతం ఉద్యోగాలతో పని చేయుంచు కోవాలి. ఇది రొటేషన్ పద్దతిలో జరగాలి. మిగిలిన 70 శాతం మందితో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయుంచాలి. ఉద్యోగి కరోనా తో చనిపోతే వాళ్ళ కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఉద్యోగ విధులు నిర్వర్థించడం వల్లే వాళ్లకు కరోనా వచ్చింది కాబట్టి.
ఉద్యోగులు టీటీడీ యజమాన్య వైఖరి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. తిరుమలలో అందరికి కరోనా వచ్చి ప్రాణహాని జరిగితే యాజమాన్యం భాద్యత వహిస్తుందా అని వాపోతున్నారు. అంతే కాక కోవిడ్ చట్టం ప్రకారం ప్రస్తుత తరుణంలో తిరుపతిని రెడ్ జోన్ గా ప్రకటిస్తూ తిరుపతి నగరం కమీషనర్ ఉత్తర్వులు ప్రకటిస్తూ మధ్యాహ్నం 2.00 గంటల నుండి కఠిన ఆంక్షలు విధించారు.
కానీ టి.టి.డి. అధికారులు ఉద్యోగుల క్షేమం పట్ల వారి ఆరోగ్యభాద్రత పట్ల ఏ నిర్ణయము తీసుకోలేదు. ఇది చాలా శోచనీయమన్నారు ఉద్యోగులందరూ ప్రస్తుతం జరుగుతున్నటు వంటి ఉద్యోగుల ప్రక్రియను తక్షణమే తాత్కాలికంగా 2 మాసాలు వాయిదా వేసి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక బదిలీలు చెయ్యాలని కోరుతున్నారు.
అంతే కాక ప్రస్తుతం తిరుమలలో రద్దీకూడా అతి సాధారణంగా ఉన్నందున వీరి సేవలు అంత ఆవశ్యకము కాదు. కనుక ఉద్యోగుల ఆరోగ్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి జిల్లా కలెక్టరు తో మాట్లాడి తగినంత మోతాదులో వాక్సిన్ తెప్పించాలి. ప్రస్తుతం రోజుకు 200మందికి, అదికూడా 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి మాత్రమే వాక్సిన్ ఇస్తున్నారు.
కానీ ఇ.ఓ. స్థాయి అధికారి మాట్లాడితేగానీ టి.టి.డి ఉద్యోగులకు సరిపడా వాక్సిన్ మంజూరు కాదని ఉద్యోగులు విమర్శించడం జరుగుతోంది. సి.యమ్.ఓ. స్థాయిలో విజ్ఞప్తి చేస్తుంటే జిల్లా అధికారులు స్పందించడం లేదని అందుకే టి.టి.డి.కి అతి తక్కువ మోతాదులో వాక్సిన్ వస్తున్నదని పైగా తిరుపతిలో ఏ అవసరం అన్నా టి.టి.డి. వాహనాలు, రెస్ట్ హౌస్లు ప్రభుత్వం ఉచితంగా వాడుకుంటుంది. కానీ టి.టి.డి.కి ఏమి చెయ్యరు.
వీటిపై టి.టి.డి. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. లేక గాలిలో దీపంపెట్టి దేవుడా నువ్వే దిక్కు అని కూర్చుంటారా......... గోవిందా..... గోవిందా..... గోవింద....
Comments
Post a Comment