ప్రోఫసర్ సుబ్బారావు, పౌరహక్కూల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు 24.4.21వ తేదీ రాత్రి 12-45 ని. విశాఖపట్నం లో చనిపోయారు.ఆయన అకాల మరణం హక్కుల ఉద్యమానికి తీరని లోటు.
కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.ఆయన మృతి పౌర హక్కుల సంఘానికి,పీడిత ప్రజల కు తీరని లోటు. హక్కుల యోధుడికి కన్నీటి నివాళులు.
జోహార్ జోహార్ ప్రో "సుబ్బారావు మాస్టర్. ప్రో "సుబ్బారావు గారు ఆంధ్రా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గ పనిచేశారు,చాలా కాలంగా పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తూ clc 19వ రాష్ట్ర మహాసభలు విశాఖపట్టణం లో నిర్వహించడానికి, విజయవంతం కావడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఈ సభలోనే రాష్ట్ర ఉపాధ్యక్షులు గా బాధ్యత లు తీసుకున్నారు. అనారోగ్యతో రాత్రి హాస్పిటల్లో మరణించారు, వారిమరణం పౌరహక్కుల ఉద్యమానికి, ప్రజావుద్యమాలకి, దళితవుద్యమాలకి మేధావిగా తీరని లోటు, వారి కుటుంబానికి సంస్థ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాము.అమరుల ఆశయాలను కొనసాగిస్తాము.
పౌరహక్కులసంఘం ఆంధ్రప్రదేశ్. వి. చిట్టిబాబు, ch. చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి లు.
జోహార్ సుబ్బారావు గారు.
Comments
Post a Comment