ప్రొఫెసర్ సుబ్బారావు గారి వ్యక్తిత్వం వైవిద్యమైనది | నంబూరి శ్రీమన్నారాయణ


సుబ్బారావు గారి మరణ వార్త ఈరోజు ఉదయమే గుంటూరు రాజారావు గారు ఫోన్ చేసి తెలియజేశారు. గత రెండు రోజుల నుంచి జ్వరం జలుబు ఒంటి నొప్పులతో బాధపడుతున్న నాకు ఈ విషాద వార్త తీవ్ర మనస్తాపాన్ని,బాధను కలిగించింది. 

ఒక్క క్షణం లో సుబ్బారావు గారు నా మదిలో మెదిలినారు. కన్నీళ్లు తో నిండిన కనుపాపలో అలా ఆయన నిండు విగ్రహం కనిపించింది.

 ఆయనసౌమ్యుడు.మృదిబాషీ.కళాకారుడు,రచయిత. నిజాయితీపరుడు సమాజం పట్ల,పేద ప్రజల పట్ల వారి సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. ప్రజల హక్కుల కోసం పనిచేసే పౌర హక్కుల సంఘం అభివృద్ధి కావాలని విశాఖపట్నం లో జరిగిన 19వ రాష్ట్ర మహాసభలను తన భుజస్కంధాల పై ఎత్తుకుని జయప్రదం చేశారు.
ఆయన మరణం పౌర హక్కుల సంఘానికి, సమాజానికి తీరని లోటు. 

               ఆయన ఆశయాలు ఉన్నతమైనవి. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత కాలం పని చేసినటువంటి ఉన్నతమైన వ్యక్తి. ప్రజల హక్కుల కోసం నిరంతరం పరితపించిన మేధావి. ప్రొఫెసర్ సుబ్బారావు గారి మరణ వార్త చాలా బాధాకరం. 

         కరోనా సమయములో గుండెనొప్పితో మరణించడం విచారకరం. పౌర హక్కుల సంఘం లో కరోనా తో మరణించిన రెండో వారు సుబ్బారావు గారు. మొదటి వారు శేషయ్య గారు. శేషయ్య గారి మరణ వార్త మరువకుండా నే పౌరహక్కుల సంఘం లో రెండోవ కరోనా మరణవార్త వినవలసి వస్తుందని ఊహించలేదు.

    పౌరహక్కుల సంఘం తీవ్రమైన రాజ్య నిర్బంధం అణచివేత ఉన్న సమయంలో ఇద్దరు మేధావులను కోల్పోవడం మా పౌర హక్కుల సంఘం కి తీరని లోటు. మరణించిన ఇద్దరూ ప్రొఫెసర్ లే కావడం యాదృచ్చికం.

 సుబ్బారావు గారు మరణం పట్ల పౌర హక్కుల సంఘం జోహార్లు తెలియ తెలియజేస్తున్నది. ఆయన మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాడ సానుబూతిని పౌరహక్కుల సంఘం తెలియజేస్తున్నది.

 ఆయన సహచరి లలిత గారు కూడా పాజిటివ్ తో సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది చాలా బాధాకరం. ఆవిడ త్వరగా కోలుకోవాలని పౌరహక్కుల సంఘం ఆకాంక్షిస్తూ ఉన్నది. లలిత గారిని అయినా దక్కించుకునే విధంగా వైద్య ఏర్పాట్లు చే య్యాలని ప్రభుత్వాన్ని పౌరహక్కుల సంఘం కోరుతున్నది.

 సరైన వైద్యం అందక కోవిడ్ బాధితులు చనిపోతున్నా మరణిస్తున్న విషయాలు వే లుగులో కి వస్తున్నాయి. ప్రొఫెసర్ సుబ్బారావు గారి మరణం సందర్భం లో ఆసుపత్రుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నటువంటి రోగుల చనిపోవటం ఏమిటి అనే ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశమైంది. కోవిద్ నెగిటివ్ వచ్చిన తర్వాత గుండెపోటుతో ఆయన మరణించారు.

 ఆయన మరణం పరిశీలిస్తే రోగికి కోవిడ్ వైద్యం మాత్రమే అందించి రోగిలోని మిగతా జబ్బులను పట్టించుకోవడం లేదు. అందు వలన ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అని అర్థమవుతున్నది.డాక్టర్లు ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి పెట్టాలని పౌరహక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది. సరైన సౌకర్యాలు హాస్పిటల్లో లేకపోవటమే కారణమ నే విషయం ప్రజల ముందుకు వచ్చింది ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సౌకర్యాలు మందులు ఆక్సిజన్ సంపూర్ణంగా ఏర్పాటు చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.

 ఆక్సిజన్ మందులు కొరత లేకుండా చూడాలని పౌరహక్కుల సంఘం ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది. కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో రోగులు చనిపోవడం చాలా విషాదకరం. బాధాకరం.

 ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యం గా పౌరహక్కుల సంఘం భావిస్తోంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నటువంటి రోగి చనిపోవడం చూస్తుంటే మన ప్రభుత్వాలు కరోనా పై తగిన విధంగా గా చర్యలు తీసుకోవడం లేదని స్పష్టమవుతున్నది. 

ఇతర దేశాలలో అంతగాలేని మరణాలు భారత్ దేశంలో ఉండటం ఏమిటి అని ప్రశ్నలు ప్రజల నుండి వస్తున్నాయి. అది వేసవి సమయంలో సెకండ్ వేవ్ రావడం మరణాలు అధికంగా ఉండటం పలు సందేహాలు అనుమానాలకు తావిస్తున్నాయి. సరైన పరిశోధనలు ప్రోత్సాహం ప్రభుత్వాలు ఇవ్వకపోవడమే కారణమనేది అర్థమవుతున్నది.

 శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అపారంగా ఉన్న భారత్ లాంటి దేశాలలో కరోనా మరణాలు అత్యధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. తక్షణం ప్రభుత్వాలు కరోనా నిర్మూలన కొరకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.  

ఈ దేశంలో అపారమైన టువంటి మార్కెటింగ్ వ్యవస్థ ఉన్నది. ఈ మార్కెట్ ను కార్పొరేట్ ఫార్మా డ్రగ్ కంపెనీలు సొమ్ము చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి అని ప్రజలు భావిస్తున్నారు. ఆదాని, అంబానీ లాంటి కంపెనీల అభివృద్ధి కోసం కాకుండా ప్రజా సంక్షేమం, ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వాలు దృష్టి పెట్టి పనిచేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. 

భారతదేశంలోనే అత్యధిక మరణాలు జరగడానికి గల కారణం పరిశోధించి తగిన చర్యలు చేపట్టాలని పౌరహక్కుల సంఘం సూచిస్తున్నది.

johar professor subbarao.

-ప్రజలు జీవించే హక్కుల కోసం పోరాటo కొనసాగిద్దాం.

- రిమూవ్ కరోనా సేవ్
 సిటిజన్స్
            .... పౌర హక్కుల సంఘం
                   రాష్ట్ర ఉపాధ్యక్షులు
            నంబూరి శ్రీమన్నారాయణ
                  24.04.2021.
                     9.05am

Comments