శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు గ్రామం నివాసం పౌర హక్కుల సంఘం సభ్యులు అయినా రాజారావు గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతున్నారు ఆయన ఈ రోజు తెల్లవారి 5 గంటలకు తుది శ్వాస విడిచారు ఆయన నివాసానికి కి పౌరహక్కుల సంఘం దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అమరుల బంధుమిత్రుల సంఘం ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యులు చేరుకొని అంతిమ యాత్ర ప్రారంభించారు తదుపరి సంతాప సభ ఏర్పాటు చేశారు సభలో పౌరహక్కుల నేతలు ఇతర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు 1968 నుండి ఇప్పటివరకు ప్రగతిశీల ఉద్యమాల్లో ఆయన యొక్క పాత్రను కొనియాడారు చివర ఉద్యమ వీడ్కోలు పలుకుతూ ఆయనకు జోహార్లు చెప్పారు
Comments
Post a Comment