తిరుపతిలో దొంగలు పడ్డారు | అమన్

ఎక్కడా ఘర్షణ లేదు. ఎవరూ  కొట్టుకోలేదు.  దౌర్జన్యాలతో అధికార పార్టీ ప్రజలను భయభ్రాంతులను చేయలేదు. డబ్బులు పంచలేదు. పంచుతున్నారని అడ్డుపడలేదు. పోలీసులు లాఠీ చార్జీ జరుపలేదు. అట్లని అంత ప్రశాంతంగా తిరుపతి ఉప ఎన్నిక జరగలేదు. పోలింగ్ రోజు  తిరుపతి నగరాన్ని వందలాది బస్సులు,  కార్లు,  ట్రాక్టర్లు ఆక్రమించాయు. తిరుపతి చుట్టు పక్కల మామిడి తోపులు, కళ్యాణమండపాలు, అతిధి గృహాలు బయట వ్యక్తులతో నిండి పోయాయు. 

దొంగతనంగా సృష్టించిన బోగస్‌ ఓటర్‌ ఐడీ కార్డులు తిరుపతి వీధుల్లో యాదేచ్చగా దొరికాయు. ఓటరు స్లిప్‌లతో బయటి నుండి వచ్చిన వ్యక్తులు తిరుపతి బూత్‌ల్లో బారులు తీరారు.  ప్రశ్నించి నిలేసిన చోట వాళ్ళు పారిపోయారు. పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పలమనేరు నియోజకవర్గాల నుంచి వాళ్ళు వచ్చినట్టు వారి మాట తీరును బట్టి తెలుస్తుంది. కడప జిల్లా రాజంపేట, కోడూరుల నుంచీ కూడా తిరుపతికి వేల మంది తరలించ బడ్డారు. పోలీసులు ఏమి తెలియనట్లే నిమ్మకుండి పోయారు. బూతుల్లో అన్ని పార్టీల ఎజెంట్లు నోరు మెదపలేదు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఎజెంట్లు అధికార పార్టీకి అమ్ముడు పోయారు. మొత్తం 26 మంది అభ్యర్డులు నిలబడ్డారు. ఇందులో ఐదుగురు మినహా పోలింగ్ రోజు ఎవ్వరూ కనపల్లేదు. ఏజెంట్లు మౌనంగా  ఉండటంతో పోలింగ్‌ సిబ్బంది ఏం మాట్లాడలేదు. 

 భారతీయ జనతా పార్టీ (బిజెపి), తెలుగు దేశమ్ పార్టీ (టిడిపి), ఇతర పార్టీలు ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శించాయు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో పోలింగ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో నకిలీ ఓట్లు వేసినట్లు ఆధారాలతో సహా మీడియా ప్రజలకు  చూపించింది.

స్థానిక ఎన్నికలలో ఏకపక్ష విజయం సాధించిన తరువాత మరోసారి తన బలాన్ని నిరూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉప ఎన్నికలో 3 లక్షల మెజారిటీకి పైగా ఓట్లను పొందటానికి ప్రయత్నించింది. వై.వి.సుబ్బా రెడ్డి, పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి తదనుగుణంగా ముందస్తు ప్రణాళికను రచించారు.

పోలింగ్ఉ రోజు ఉదయం నుండి, టిడిపి, బిజెపి,  వారి పోటీదారులతో సహా కాంగ్రెస్ పార్టీల నాయకులు వివిధ పోలింగ్ బూత్‌ల వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన బోగస్ ఓటర్ల విషయాన్ని వీడియో సాక్ష్యాలతో ప్రజలకు, సోషల్ మీడియా నోటీసుకు తీసుకువచ్చారు. ఎన్నికల కోడ్ ను తీవ్రంగా ఉల్లంఘించారు. ఆ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ,  వైయస్ఆర్సిపి నాయకుల దుర్వినియోగం కొనసాగింది.

బూత్లను స్వాధీనం చేసుకోవడం, ఎన్నికలను రిగ్గింగ్ చేయడం,  హింసను కలిగించే ఉద్దేశ్యంతో చాలా మంది నకిలీ ఓటర్లు బయట నుంచి వచ్చారు. బయటి వ్యక్తులు  నకిలీ ఎపిక్ కార్డులతో ఓటు వేశారు.  ఈ నకిలీ ఓటర్లు చాలామంది వారి పేర్లు, వారి తండ్రి, జీవిత భాగస్వామి పేరు, వారి చిరునామాను చెప్పలేకపోయారు. ఇవన్నీ వీడియో క్లిప్‌లలో ప్రజలు చూశారు.

తిరుపతిలో వైఎస్‌ఆర్‌సిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్థానికేతరుడు. ఆయన  తిరుపతిలో ఉండాల్సిన అవసరం లేదు.
 అయినా ఆయన తిరుపతిలో ఉండి అన్నీ తానై నడిపించారు. తమాషా ఏంటంటే ఎన్నికల చట్టాన్ని సరిగా అమలు చేయాలని కోరినందుకు,  నకిలీ ఓటర్లను పట్టుకున్నందుకు  స్థానిక టిడిపి నాయకులను అరెస్టు చేశారు. అందువల్ల దొంగ వోటింగ్ కు పాల్పడింది.

. స్థానిక పిఎల్‌ఆర్‌ కన్వన్షన్‌ హాలు వద్ద నుంచి వందల మంది వైసిపి నాయకులు వివిధ వాహనాల్లో బయలు దేరారు. ఇది అటవీ శాఖ మంత్రికి సంభందించిన కల్యాణ మండపం. బయటి వారు వచ్చి ఓట్లు వేసేస్తున్నారంటూ మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ, టిడిపినాయకులు నరసింహయాదవ్‌లు రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్‌ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. వైసిపి నాయకులు ఇలా దొంగ ఓట్లు వేయడంపై వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. స్థానిక గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే బిజెపి అభ్యర్థి రత్నప్రభ వెస్టు పోలీసు స్టేషన్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 7:30 గంటలకు కోదండరామస్వామి ఆలయం ముందు ధర్నా నిర్వహించారు.

పాపానాయుడు పేటలోనూ, తిరుపతిలో నిర్వహించిన పద్ధతిలోనే రేణిగుంట, పాపానాయుడు పేటలో వైసిపి నాయకులు దొంగ ఓట్లు వేసేందుకు విఫలయత్నం చేశారు. వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను విచ్చలివిడిగా ఈ ఎన్నికల్లో వైసిపి వాడుకుంది.

ఎస్వీయూ క్యాంపస్‌లో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బావమరిది హరీష్‌రెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం రాయలసీమ అధ్యక్షుడు హరిప్రసాద రెడ్డి తదితరులు పెద్దసంఖ్యలో దొంగ ఓటర్లతో మకాం వేశారు. అక్కడి నుంచే నగరంలోకి దొంగ ఓటర్లను పంపించారు. టీడీపీ, బీజేపీ నేతలు అడ్డుకునేందుకు చేసిన యత్నాలు ఏమాత్రం ఫలించలేదు. 


2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్‌ 2.28 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుపతి మినహా మిగిలిన ఆరు చోట్ల వైసీపీకి మెజార్టీ దక్కింది. చిత్తూరు జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తిలో 32,919, సత్యవేడులో 42,196 ఓట్ల ఆధిక్యత వైసీపీకి లభించింది. తిరుపతి సెగ్మెంట్‌లో మాత్రం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,578 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ మెజార్టీ టీడీపీకి పెరుగుతుందని భావించిన వైసీపీ నేతలు దొంగ ఓట్లు పోల్‌ చేసుకోవడానికి తిరుపతిని ఎంచుకున్నారు.

రెండు వారాల ముందు నుంచే ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇక్కడ మకాం వేశారు. ఆయా డివిజన్లలో దొంగ ఓట్లకు ప్రణాళిక రచించారు. దీనికోసం ఉపసర్పంచికి 10, సర్పంచికి 20, వార్డు సభ్యుడికి 50 మందిని పిలుచుకుని రావాలని ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి డ్వాక్రా సంఘం నుంచి కనీసం ఇద్దరికి తగ్గకుండా తీసుకు రావాలని ఆర్‌పీలకు, గ్రూప్‌ లీడర్లను ఆదేశించారు. ఆ విదంగా ప్రత్యేక వాహనాల్లో తిరుపతి వేరే ప్రాంతాల నుండి ప్రజల్ని తిరుపతికి తరలించారు. ఎవరైనా అడిగితే దర్శనాల పేరు చెబుతూ భక్తుల్లా ముందుకు కదిలారు.

 తిరుపతి నగరంలో స్థానికేతరులు ఉండకూడదు. పార్టీలకు, ఇతర ప్రాంతాల వారికి కల్యాణ మండపాలు, గదులు ఇవ్వకూడదు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున గుంపులుగా తిరగకూడదు.  ఇదీ పోలింగ్ ముందర పోలీసువారి హెచ్చరిక. ముందు నుంచీ నిబంధనలు, హెచ్చరికలతో హడావిడి చేసిన పోలీసులు,  చివరకు ప్రేక్షక పాత్ర వహించారు

తిరుపతిలోని పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ వద్ద వున్న వారిని ప్రశ్నించగా పాస్‌పోర్టు కోసమని కొందరు, ఆస్పత్రికి వచ్చామని మరికొందరు, సరదాగా వచ్చామంటూ ఇంకొందరు సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వేలాది మందిని తిరుపతికి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని, సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. .

ఎస్పీ కార్యాలయం ముందే దొంగ ఓటర్లు వస్తున్నారన్న సమాచారంతో ప్రతి పక్ష నాయకులు ఎస్పీ కార్యాలయం ముందు కాపు కాశారు. 40 మందితో అటుగా వచ్చిన ఓ ప్రైవేట్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. డ్రైవర్‌ వద్దనున్న ఓటరు జాబితాను స్వాధీనం చేసుకున్నారు.  సుమారు 25శాతం దొంగ ఓట్లు పోలయ్యాయని  ప్రతి పక్షాల వాదన.

టీడీపీ, బీజేపీ నాయకులు గుర్తించిన దొంగ ఓటర్లు వందల్లో ఉన్నారు. తానే సుమారు 70మంది నకిలీలను గుర్తించి పోలింగ్‌ కేంద్రంలోని పోలీసులకు అప్పగిస్తే ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదని బీజేపీ నేత శాంతారెడ్డి పేర్కొన్నారు. 

ఎస్వీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేయించడానికి పాకాల, చంద్రగిరికి చెందిన కొందరిని వైసీపీ నేతలు తీసుకొచ్చారు. ‘ఒకరి ఓటు ఇంకొకరు వేయడం తప్పు కదా.. పైగా చదువుకున్నావు’ అని ఆంధ్రజ్యోతి విలేకరి ప్రశ్నించారు.  దీంతో ‘మీ తిరుపతి వాళ్లకు కరోనా వస్తుందని భయంతో ఇళ్లలోనే ఉన్నారు. మాకు ఆ భయం లేదు కాబట్టి వాళ్ల బదులు మేము ఓటేస్తున్నాం...తప్పేంటి..’ అంటూ సమాధానమివ్వడం గమనార్హం. 

టీపీపీఎం పాఠశాలలో దొంగ ఓట్లు వేసేందుకు ఉదయం 8.30 గంటలకే పాకాల, చంద్రగిరి, గుర్రంకొండ ప్రాంతాలకు చెందిన వారు క్యూలో చేరారు. 

ఎస్వీ హైస్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన పీలేరు, కలకడ ప్రాంతాలవారికి ఉదయం 9.30 గంటలకు వైసీపీ నేతలు టిఫిన్‌ ప్యాకెట్లను అందించారు. 

మంచినీళ్ల గుంట వద్ద  పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని ఉదయం 9.45 గంటల సమయంలో ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి పలకరించారు. 

 పరసాల వీధి మున్సిపల్‌ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో దొంగ ఓట్లేసేందుకు వచ్చి స్థానికేతర యువకులకు అమ్మవారి ఆలయం ముందు ఉదయం 10 గంటలకు వైసీపీ నేతలు సూచనలిచ్చారు.

 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆర్‌ఎస్‌ మాడవీధిలోని మున్సిపల్‌ స్కూల్లో దొంగ ఓట్లు వేసేందుకు పలమనేరు ప్రాంతంలోని నెల్లిపట్టు నుంచి కర్ణాటక రిజిస్ట్రేషన్‌ వాహనంలో మహిళలు వచ్చారు. 

వైసీపీ నాయకులు దొంగ ఓట్ల తంతుకు ఎస్వీయూ క్యాంపస్‌ ను కూడా అడ్డాగా మార్చు కున్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల బావమరిది హరీష్‌రెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్‌ హరిప్రసాద్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఎస్వీయూ క్యాంపస్‌కు చేరుకున్నారు. 13వ డివిజన్‌ పరిధిలోని ఓటర్ల జాబితాతో దొంగ ఓట్ల తంతు సాగించారు. పీలేరు నుంచి తీసుకొచ్చిన వారికి నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు అందజేసి దొంగ ఓట్లే వేయించారు.

టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అధికార పార్టీని "ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు" అని విరుచుకుపడ్డారు. "మాకు ఇలాంటి ఎన్నికలు ఎందుకు అవసరం? బోగస్ ఓటర్లను తిరుపతి వీధుల్లోకి తీసుకువచ్చారు. పోలీసులు వారిని ఎలా అనుమతించారు?" అని అడిగాడు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ చేసిన స్థూల ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి అసెంబ్లీ విభాగంలో తాజా పోల్ ఆదేశించాలని డిమాండ్ చేస్తూ ఆయన ముఖ్య ఎన్నికల కమిషనర్‌కు మరో లేఖ పంపారు. 

అయితే తిరుపతి లోక్‌సభ సెగ్మెంట్ విస్తరించి ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు బోగస్ ఓటర్లను అణిచివేసేందుకు, న్యాయమైన పోల్‌ను నిర్వహించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్, శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించారని పేర్కొన్నారు. ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి పట్ల ఆయనకున్న విధేయతను ప్రకటించుకున్నారు.

దొంగ ఓట్ల విమర్శలను  రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.  ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వేళ దొంగ ఓట్లను రాద్ధాంతం చేయడం టిడిపికి తగదన్నారు. టిడిపినే దొంగ ఓట్లుకు పురమాయించి అది వైసీపీ చేయిస్తున్నట్టు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు ముందే వేసిన పథకం ప్రకారం అతనికి సంబంధించిన మీడియా వర్గం బస్సులో వెళుతున్న వారి దగ్గరికి వెళ్లి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడకు పోతున్నారని ప్రశ్నలు వేసి వీరంతా దొంగ ఓట్లు అని టీవీలో చూపించడం దారుణమన్నారు . ఊళ్లకు వెళ్లే వాళ్ళు బస్సుల్లో వెళ్లక దేంట్లో వెళతారని ప్రశ్నించారు. పోలింగ్‌ బూత్‌ల్లో సైతం ఏబీఎన్‌, టీవీ ఫైవ్‌ కెమెరాలు వెళ్లి అక్కడ భయభ్రాంతులు సష్టిస్తున్నాయని విమర్శించారు. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

తనను వీరప్పన్‌ తో పోలుస్తూ ఎర్రచందనం స్మగ్లర్‌గా లోకేష్‌ ట్వీట్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు పది మంది దగ్గర తాను స్మగ్లర్‌ అని చెప్పిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. తాను అటవీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 24 గంటలు వన్‌ ప్లస్‌ ఆర్మీ గార్డులా పని చేయించానని గుర్తు చేశారు. . కళ్యాణ మండపంలో వేలాది మంది ఉన్నారంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తుడా చైర్మన్‌ నరసింహ యాదవ్‌ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం సరైంది కాదన్నారు. ఉప ఎన్నికల్లో గెలవలేక టిడిపి తమపై బురద జల్లుతుందని విమర్శించారు. టిడిపి తీరుపై తామే కేంద్ర ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు వేశాయని, ఎన్నికలను రద్దు చేయాలని కోరినప్పటికీ, ఎన్నికల సంఘం పట్టించు కోలేదు. బి జే పి అభ్యర్థి రత్నప్రభ తిరుపతి ఉప ఎన్నిక ను రద్దు చేయాలని హై కోర్టు ను ఆశ్రయుంచింది.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గానికి  జరిగిన ఉప ఎన్నికలో 64.29% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 17,10,699 మంది ఓటర్లలో 10,99,784 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. నియోజకవర్గం 2019 సార్వత్రిక ఎన్నికలలో 78.9% ఓటింగ్ సాధించింది. కోవిడ్ కేసులు పెరిగినప్పటికీ ఏప్రిల్ 17న 64.29% పోలింగ్ జరిగింది.  

సత్యవేడు (ఎస్సీ) అసెంబ్లీలో అత్యధికంగా 72.68% పోలింగ్ నమోదైంది.  తరువాత సూల్లూరుపేట (ఎస్సీ) 70.93%, శ్రీకళహస్తి 67.77%, సర్వే పల్లి 66.19%, గుడూరు (ఎస్సీ) 63.81%, వెంకటగిరి 61.50% లో పోలింగ్ నమోదైంది. తిరుపతిలో అత్యల్పంగా 50.58% పోలింగ్ నమోదైందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) కె విజయానంద్ తెలిపారు. 

నేడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు బూటకపు ప్రజాస్వామ్య నిర్మాణంలోకి వచ్చాయి. యుఎస్ఎ, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్,  కెనడా వంటి దేశాలలో ఉదార ​​ప్రజాస్వామ్యం స్థాపించబడింది.  కమ్యూనిస్ట్ దేశాలలో రాజకీయ, ఆర్థిక వ్యవస్థను సామాజీకరించడం ఆగిపోయుంది.   ఉదార ప్రజాస్వామ్యం  సోషలిస్ట్ ప్రజాస్వామ్యం రెండూ రాజకీయ ప్రజాస్వామ్యపు రూపాలుగా పరిగణించబడతాయి. ఎందుకంటే ఈ వ్యవస్థలు ఆర్థిక, రాజకీయ, సామజిక దోపిడీపై ఆధార పడి ఉంటాయి.

నేడు ప్రజాస్వామ్యం వాడుకలో ఉన్న అన్ని దేశాలలో, రాజకీయ ప్రజాస్వామ్యం కంటే మెరుగైన వ్యవస్థ మరొకటి లేదని ప్రజలు నమ్ముతారు. రాజకీయ ప్రజాస్వామ్యం ఓటింగ్ హక్కులను ఇచ్చిందనడంలో సందేహం లేదు. కానీ అది ఆర్థిక సమానత్వ హక్కును కొల్లగొట్టింది. పర్యవసానంగా, ధనిక -పేదల మధ్య స్థూల ఆర్థిక అసమానత ఉంది.  ప్రజల కొనుగోలు సామర్థ్యంలో అపారమైన అసమానత, నిరుద్యోగం, దీర్ఘకాలిక ఆహార కొరత, పేదరికం, సమాజంలో అభద్రత సర్వ సాధారణమై పోయింది. భారతదేశంలో ప్రబలంగా ఉన్న ప్రజాస్వామ్యం కూడా రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే. అంతే కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన దోపిడీ వ్యవస్థ అని నిరూపించబడింది. భారత రాజ్యాంగాన్ని మూడు రకాల దోపిడీదారులు సృష్టించారు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, భారత సామ్రాజ్యవాదులు, భారత పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలక పార్టీలు. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు ఈ అవకాశవాదుల ప్రయోజనాలను మరింతగా దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. ప్రజలను మోసగించడానికి, ప్రజలకు సార్వత్రిక ఓటుహక్కు  లభించింది. లక్షలాది మంది భారతీయులు పేదలు, నిరక్షరాస్యులు.  అయినప్పటికీ దోపిడీదారులు, తప్పుడు వాగ్దానాలు చేయడం, బెదిరించడం, పరిపాలనా అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఓటు రిగ్గింగ్ వంటి పద్ధతుల ద్వారా ఓటర్లపై పదేపదే విజయం సాధిస్తారు.

ఇది ప్రజాస్వామ్యపు ప్రహసనము. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఐదేళ్లపాటు  అవినీతిని పెంచడానికి, రాజకీయ దౌర్జన్యానికి పాల్పడటానికి వారికి తగినంత అవకాశం లభిస్తుంది. తరువాతి ఎన్నికలలో  అదే అసంబద్ధత పునరావృతమవుతుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో ఈ రకమైన రాజకీయ అవకాశవాదం కొనసాగుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరప్ దేశాలతో ఆర్థిక సమానత్వం పొందాలంటే భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను అనుసరించాలని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వాదనకు మద్దతుగా, వారు అమెరికా,  గ్రేట్ బ్రిటన్,  చైనా,  సోవియట్ యూనియన్  ఉదాహరణలను ఉదహరించారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు.   నేడు లక్షలాది మంది భారతీయ పౌరులు జీవిత కనీస అవసరాలను కోల్పోతున్నారు.  తగినంత ఆహారం, దుస్తులు, గృహనిర్మాణం, విద్య, వైద్య చికిత్సలను పొందటానికి కష్టపడుతున్నారు. కొద్దిమంది మాత్రమే అపారమైన సంపద, విలాసాలను పొందుతున్నారు.

ప్రజాస్వామ్యపు స్పష్టమైన లోపాలలో  ఓటింగ్ ఒకటి. పరిపాలన సార్వత్రిక ఓటు హక్కుపై ఆధారపడి ఉంటుంది. అంటే, ఓటు వేసే హక్కు వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఒక నిర్దిష్ట వయస్సుకి చేరుకున్న తర్వాత,  ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవటానికి వారికి అవసరమైన సామర్థ్యం ఉందని భావించబడుతుంది. చాలా సందర్భాల్లో ఇది సంఘవిద్రోహ పద్ధతులపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రపంచమంతటా, ఎన్నికల ప్రక్రియలో డబ్బు ఆధిపత్య పాత్ర పోషిస్తుంది.  దాదాపు అన్ని సందర్భాల్లో, ధనవంతులు,  శక్తివంతులు మాత్రమే ఎన్నుకోబడతారు. ఓటింగ్ తప్పనిసరి లేని దేశాలలో, తరచుగా జనాభాలో కొద్ది శాతం మాత్రమే ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు.

ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అవసరమైనవి నైతికత, విద్య,  సామాజిక-ఆర్థిక-రాజకీయ చైతన్యం.  దేశంలో సందేహాస్పదమైన వ్యక్తులు, స్వార్థ ప్రయోజనాలు ఉన్నవారు అధికారానికి ఎన్నుకోబడతారు. బందిపోట్లు, హంతకులు కూడా ఎన్నికలలో నిలబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో, ప్రజలకు రాజకీయ స్పృహ లేదు. మోసపూరిత, వివేకవంతులైన రాజకీయ నాయకులు ప్రజలను కలవరపెట్టడానికి, అధికారాన్ని సాధించడానికి ఈ లోపాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వారు లంచం, ఓటు రిగ్గింగ్, బూత్ స్వాధీనం, ఓట్ల కొనుగోలు వంటి అనైతిక పద్ధతులను ఆశ్రయిస్తారు.   ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో, అన్ని రకాల అనైతిక, అవినీతి పద్ధతులకు సమాజాన్ని వక్రీకరించే అవకాశం ఇవ్వబడింది. ప్రస్తుత వ్యవస్థ స్వభావం ఏమిటంటే, ఇది పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది.  పరిపాలనను అనైతిక, అవినీతి శక్తులకు అందిస్తుంది.

ఉదార ప్రజాస్వామ్య దేశాలలో, పెట్టుబడిదారులు రేడియో, టెలివిజన్, వార్తాపత్రికల వంటి మాస్ మీడియాను తారుమారు చేస్తారు.  సోషలిస్ట్ ప్రజాస్వామ్యాలలో అధికారులు దేశాన్ని విధ్వంసం అంచుకు నడిపిస్తారు. ప్రజాస్వామ్యపు రెండు రూపాల్లో, నిజాయితీగల, సమర్థులైన నాయకులు సమాజంలో ఉద్భవించటానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. వాస్తవంగా ప్రజల ఆర్థిక విముక్తికి అవకాశం లేదు.

రాజకీయ ప్రజాస్వామ్యం దేశ ప్రజలకు శాపంగా మారింది. ఆర్థిక శక్తి సామాన్య ప్రజల చేతుల్లో ఉండాలి. జీవిత కనీస అవసరాలు అందరికీ హామీ ఇవ్వాలి. ప్రజల ఆర్థిక విముక్తిని నిర్ధారించడానికి ఇదే మార్గం. అందుకే ప్రజలు ఓటుకు నోటు తీసుకుంటున్నారు. పాలకులు దోపిడీ చేస్తున్నా పెద్దగా ఆశ్చర్య పడటం లేదు. పట్టణాల్లో అయితే ప్రజలు ఓటింగుకు దూరంగా ఉంటున్నారు. తిరుపతి లో జరిగింది అదే. లక్షల మెజారిటీ వస్తుందని ఆశించిన వైఎస్సార్సీపీకి పట్టణ ప్రజల ఓటింగ్ నిరాసక్తత వాళ్లను కుంగదీసింది. అందుకే వారు నకిలీ ఓటర్ ను సృష్టించి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించారు. తిరుపతి ఉప ఎన్నిక ఒక స్పష్టమైన సందేశాన్ని అయితే రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. అది ఎంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఒక తంతు మాత్రమే.  ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు.

ఇలాంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ కఠినమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని తిరుపతి అసెంబ్లీ విభాగంలో ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలి. తిరుపతి లో తిరిగి పోలింగ్ నిర్వహించాలి.






Comments