ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేయాలి | తెలంగాణ


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రజా, హక్కుల సంఘాలపై విధించిన నిషేధం అప్రజాస్వామ్యం - రాజ్యాంగ విరుద్ధం

మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రజా, హక్కుల సంఘాలపై విధించిన నిషేధం ముమ్మాటికీ అప్రజాస్వామ్యం - రాజ్యాంగ విరుద్ధమని హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి.
శనివారం
పౌర హక్కుల సంఘం తెలంగాణ, TPF , విరసం తదితర ప్రజాసంఘాలు సంయుక్త ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ఖండించాయి.

తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, స్వచ్ఛంద సంఘాలు మన హక్కుల సాధనకై ఈ అక్రమ నిషేధాన్ని ఖండించాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశాయి.

 తెలంగాణా రాష్ట్రంలో 16 ప్రజా సంఘాలను మావోయిస్టు పార్టీ కి అనుబందంగా పనిచేస్తున్నాయని పేర్కొంటూ, వాటిని నిషేధిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం 30-03-2021న ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ సంస్థలు చట్టవిరుద్ధమని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.  23ఏప్రిల్, 2021 న పత్రికలలో ప్రచురణకు ప్రెస్ నోట్ జారీచేసిందన్నారు.

మార్చి 12, 2021న డిజిపి కార్యాలయం నుంచి వచ్చిన లేఖ ఆధారంగా, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మార్చి 31న జివో జారీ చేశారు.  తెలంగాణ ప్రజ ఫ్రంట్ (టిపిఎఫ్), తెలంగాణ అసంగటిత కర్మిక సమాఖ్య (టిఎకెఎస్), తెలంగాణ విద్యార్ధి వేదిక (టివివి) సహా 16 స్వచ్ఛంద సంస్థల పేర్లు పెట్టారని వారు సూచించారు. డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డిఎస్‌యు), తెలంగాణ విద్యార్తి సంఘం (టివిఎస్), ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ (ఎఎస్‌యు), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్‌పిపి), తెలంగాణ రైతాంగ సమితి (టిఆర్‌ఎస్), తుడుమ్ దేబ్బా (టిడి),  ప్రజాకళా మండలి ( పికెఎం), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (టిడిఎఫ్), ఫోరమ్ ఎగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ (ఎఫ్‌హెచ్‌ఎఫ్‌ఓ), సివిల్ లిబర్టీస్ కమిటీ (సిఎల్‌సి), అమరుల బంధు మిత్రుల సంఘం (ఎబిఎంఎస్), చైతన్య మహిలా సంఘం (సిఎంఎస్), రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఎ) మార్చి 30, 2021 నుండి ఒక సంవత్సరం పాటు రాష్ట్రంలో ఈ నిషేధం అమలులో ఉంటాయని తెలిపినారని ఇది మన భారత రాజ్యాంగ విరుద్ధం అన్నారు. 

16 సంస్థలు హింసాయుత చర్యలను  ప్రోత్సహిస్తున్నాయని, నిషేధిత సంస్థలకు సహాయపడుతున్నాయని, సంస్థల కార్యకర్తలు పట్టణ గెరిల్లా వ్యూహాలను అవలంబించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో కదులుతున్నారని GO లో పేర్కొనడం ఏమాత్రం వాస్తవం కాదన్నారు. ఛత్తీస్‌గడ్ లో 16 సంస్థల కార్యకర్తలు మావోయిస్టు నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసిన విరసం వ్యవస్థాపకుడు పి.వరవర రావు, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, రోనా విల్సన్,  ఇతరులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొందన్నారు. అది ప్రజా సంఘాల, హక్కుల సంఘాల బాధ్యత అని వారు ప్రకటనలో పేర్కొన్నారు.

 తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 16 సంస్థలను ఒక సంవత్సరం పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామ్యం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్ధమని,  ప్రకటించే ముందు అనుసరించాల్సిన విధానం ప్రకారం ప్రభుత్వం నుండి పౌర హక్కుల సంఘానికి గాని, ఇతర ప్రజా సంఘాలకు గాని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న ప్రజాసంఘాలు, మేధావులను మాట్లాడకుండా చేయడం భావ వ్యక్తీకరణను అడ్డుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవరిస్తున్నాయని ఆరోపించారు. మోడీ కేంద్ర ప్రభుత్వం, కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకుంటున్న విధానాలను ప్రజల పక్షాన మాట్లాడడం భరించలేకనే తెలంగాణ ప్రభుత్వం ఈ అక్రమ నిషేధం విధించిందన్నారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వామపక్షాలు, స్వచ్ఛంద సంఘాలు ఈ అప్రజాస్వామిక నిషేధాన్ని వ్యరేకించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, విరసం, ఇతర ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయన్నారు.

 తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నిషేధిత ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ రద్దు చేయాలని, పౌర హక్కుల, ప్రజా సంఘాలు  డిమాండ్ చేస్తున్నాయని వారు తెలిపారు.

1)మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌరహక్కుల సంఘంతెలంగాణ

2) కోట శ్రీనివాస్, తెలంగాణ విద్యార్థి సంఘం (TVS) రాష్ట్ర అధ్యక్షులు

3) GAV ప్రసాద్,  అధ్యక్షులు ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

4) ఏనుగు మల్లారెడ్డి,  ప్రధాన కార్యదర్శి,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

5).మహ్మద్ అక్బర్,
ఉపాధ్యక్షులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

6) శ్రీపతి రాజగోపాల్,
జిల్లా ఉపాధ్యక్షులు,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

7) బాలసాని రాజయ్య, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా

8) గుమ్మడి కొమురయ్య, కన్వీనర్, 
తెలంగాణ ప్రజా ఫ్రంట్, పెద్దపెల్లి జిల్లా

9). గాండ్ల మల్లేశం, జిల్లా కమిటీ మెంబర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, పెద్దపెల్లి జిల్లా

10).పుల్ల సుచరిత, సహాయ కార్యదర్శి, 
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

11).వేల్పుల బాలయ్య, సహాయ కార్యదర్శి,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం


12) నారా వినోద్, కోశాధికారి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

13) B. లక్ష్మణ్, E C మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.

14).పోగుల రాజేశం, E C మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

15) కడ రాజయ్య, E C మెంబర్,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
16) యాదవనేని పర్వతాలు, E C మెంబర్,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
17) బొడ్డుపెల్లి రవి, E C మెంబర్,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

18) మోటపలుకుల వెంకట్, E C మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

సాయంత్రం 4:45గంటలు,24 ఏప్రిల్,2021.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.

Comments