కృష్ణాజిల్లా మాజీ పౌర హక్కుల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అవనిగడ్డ లో నివాసము ఉంటున్న బసవేశ్వర రావు గారు అకాల మరణం ఈరోజు 11వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు రెండు గంటలకు కోడూరు దగ్గర మరణించారు ఎలవర్తి బసవేశ్వర రావు గారు అంతిమయాత్ర రేపు ఉదయం ఎనిమిది గంటలకు కోడూరు లో జరుగును కృష్ణా జిల్లా శాఖ బసవేశ్వర రావు గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది
జోహార్ కామ్రేడ్ YBR గారు .. ..
********************
రిటైర్డ్ టీచర్ ,APCL C కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షులు కామ్రేడ్ యలవర్తి బసవేశ్వరావు గారు ఆదివారం గుంటూరులో చనిపోయారు. కృష్ణాజిల్లా కోడూరు మండలం వి. కొత్తపాలెం కు చెందిన యలవర్తి బసవేశ్వరావు గారు ఉపాధ్యాయుడిగా పని చేశారు .అభ్యుదయ భావాలు గల యలవర్తి ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC) లో క్రియాశీలకంగా పని చేశారు. కృష్ణా జిల్లా శాఖకు కొంతకాలం పాటు ఆయన అధ్యక్షులుగా కొనసాగారు .ఎందరో ఉద్యమ నాయకులకు పుట్టినిల్లు అయిన దివిసీమ మరో అభ్యుదయ వాదిని కోల్పోయింది. ఆయన మరణం పట్ల కమ్యూనిస్టుల తో పాటు స్నేహితులు ,బంధువులు , వామపక్షవాదులు , రాజకీయ నాయకులు , వివిధ ప్రజా సంఘాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి , సోమవారం వి. కొత్తపాలెంలో బసవేశ్వరావు గారి అంతిమయాత్ర జరగనుంది.
Comments
Post a Comment