ఈ రోజు 6/3/2021న ఉదయ o 11గం"లకు రాజమండ్రీ అంబేడ్కర్ భవన్ లో ఉ పా రద్దు పోరాట కమిటీ ఆధ్యర్యంలో బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలు అంటే ఏమిటి? ఉ పా చట్టం కింద నేరాలు,కేసు విచారణ పద్దతులు, సాక్షు లకు సంబంధించి అసాధారణ అంశాలు,సహజ న్యాయసూత్ర లకు విరుద్ధమైన అంశాలు పై మాట్లాడారు,అప్రజాస్వామిక ఉ పా చట్టం రద్దు చేయాలని ,అక్రమంగా అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.knps రాష్ట్ర కార్యదర్శి కృష్ణ సంఘాల పై నిషేదం ఎత్తి వేయాలని,రాజ్యాంగ హక్కులను అమలు చేయాలని కోరారు. ఉ పా చట్టం రద్దు పోరాట కమిటీ కో కన్వీనర్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వున్న చట్టాన్ని రద్దుచేయాలని,సహజ న్యాయసుత్రాలను ప్రజలు అందరికీ అందించాలని,అప్రజాస్వామిక చట్టం రద్దు అయ్యే వరకు పోరాడతామని తెలిపారు,చైతన్య మహిళా సంఘం రమా ,pks మస్తాన్,pdm గంగరాజు,అరుణోదయ భీమశంకర్, న్యాయ వాది రాంబాబు, జార్జ్ అంతోని,బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై నారిటి సంఘం సాధనల రామారావు,వివిధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.
పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరావు సభకు అధ్యక్షత వహించారు,CLC జిల్లా ప్రధాన కర్యదర్శి,త్రిమూర్తులు,సామాజిక వేదిక నాయకుడు శివప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Post a Comment