ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మెమోరాండం సమర్పణ | పశ్చిమ గోదావరి జిల్లా

ప్రెస్ నోట్. 05.03.2021 కొవ్వూరు.
***********************
విశాఖ ఉక్కు ప్యాక్టరీ  ప్రైవేటీకరణ  అప్రజాస్వామికం.  తెలుగు జాతి ప్రజలను అవమానించటమే. 
   పౌర హక్కుల సంఘం CLC రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి. శ్రీమన్నారాయణ.

విశాఖ ఉక్కు ప్యాక్టరీ 32మంది బలి దానాలు తో ప్రభుత్వ సంస్థ గా ఏర్పాటు ఐతే నేడు కేంద్ర ప్రభుత్వం    ప్రైవేట్ వ్యక్తులకు కటపెట్టాలని చూడటం అత్యంత దుర్మార్గం.ఇది తెలుగు జాతి ప్రజలను అవమానించటం అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి. శ్రీమన్నారాయణ విమర్శించారు. ఈ రోజు జరిగిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక  రాష్ట్ర బంద్ కు మద్దతును, సంఘీభావాన్నీ తెలియ చేశారు. రెవెన్యూ డివిషనల్ కార్యాలయం పరిపాలన అధికారి వారికి విశాఖ ఉక్కు ప్యాక్టరీ ని ప్రైవేటీకరించ రాదని పౌరహక్కుల సంఘం మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా వెంకట రత్నం, కుమార్, తదితరులు పాల్గొన్నారు
                                      ఇట్లు
                  నక్కా. వెంకట రత్నం.
                        జిల్లా అధ్యక్షులు
                పౌర హక్కుల సంఘం.

Comments