విశాఖ ఉక్కు ఏపీ ప్రజలకే దక్కాలి | తూగో జిల్లా

విశాఖ ఉక్కు తెలుగు ప్రజలకే దక్కాలి. ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజోలు నియోజక వర్గ పరిరక్షణ చైతన్య సమితి  డిమాండ్ .

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని  సమర్థవంతంగా తిప్పికొట్టలేని రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మలికిపురం పూలే అంబేద్కర్ భవనం వద్ద రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది.
దీక్షలో సుమారు వంద మందికిపైగా కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న కార్యకర్తలకు పరి రక్షణ సమితి నాయకులు ముత్యాల శ్రీనివాస రావు, లీగల్ సెల్ అడ్వైజర్ దేవ రాజేంద్రప్రసాద్, జాన్ మోషే, సూర్యప్రకాశరావు గార్లు రెడ్ బ్యాండ్ వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సమితి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కొల్లా బత్తుల వీర్రాజు నిర్వహించారు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాజోలు నియోజకవర్గ చైతన్య సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలను ప్రభుత్వాలు గ్రహించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సుమారు రెండు లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అతి చౌకగా 4580 కోట్ల రూపాయలకు ప్రైవేటు వ్యక్తులకు అమ్మకం చేయాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్యగా ప్రకటించారు.  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చైతన్య సమితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ మోసపూరిత చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవాలని చైతన్య సమితి డిమాండ్ చేస్తుంది తెలుగు ప్రజల ఆత్మగౌరవం అభివృద్ధి తో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర అసెంబ్లీ స్పష్టమైన తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వమే నాయకత్వం వహించాలని విజయం సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని రాజోలు నియోజకవర్గం పరిరక్షణ చైతన్య సమితి డిమాండ్ చేసింది.
మార్చి 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న రాష్ట్ర బంద్ కార్యక్రమానికి చైతన్య సమితి వివిధ ప్రజా సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయి బందు విజయవంతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పెదపాటి అమ్మాజీ గారు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఏడిద రాజేష్ ,సిపిఐ నాయకులు రాజేంద్ర ప్రసాద్, సిపిఎం నాయకులు చవ్వాకుల సూర్యప్రకాశరావు, నల్లి మోహన్ రావు, పౌరహక్కుల సంఘం నాయకులు జిల్లెల్ల మనోహరం, రైతు కూలీ సంఘం నాయకులు మచ్చ నాగయ్య, సామాజిక విప్లవ వేదిక నాయకులు శివప్రసాద్, హెచ్ ఆర్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు  దారా నాగేశ్వరరావు, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజర్ తాడి సహదేవ్ , వైసిపి నాయకులు రాపాక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
రాజోలు నియోజకవర్గం చైతన్య సమితి గౌరవ అధ్యక్షులు భూపతి అజయ్ కుమార్,  కార్యదర్శి బూసి జాన్ మోషే ,సహ కార్యదర్శి ముత్యాల శ్రీనివాస రావు,  కోశాధికారి రాపాక కిరణ్, జాయింట్ సెక్రటరీ నల్లి శివకుమార్, నేతల నాని, పోలుకొండ లలిత, నల్లి ప్రసాద్,  గేదెల చిట్టి బాబు కొల్లా బత్తుల నాని, గెడ్డం బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సమితి కార్యదర్శి భూషి జాన్ మోషే  వందన సమర్పణ తో ముగిసింది.

   బూసి జాన్ మోషే 
 పరిరక్షణ సమితి కార్యదర్శి
Cell. 9949525089

Comments