టి వి వి నాయకుడు గురిజాల రవీందర్‌రావును వెంటనే విడుదల చేయాలి | పౌర హక్కుల సంఘం


తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు గురిజాల రవీందర్‌రావును వెంటనే విడుదల చేయాలి.. పౌర హక్కుల సంఘం తెలంగాణ.

తెలంగాణ ఉద్యమంలో,తెలంగాణ విద్యావంతుల వేదిక సంస్థ ద్వారా గ్రామస్థాయి వరకు ప్రచారోద్యమాన్ని నిర్వహించి ప్రజల్లో తెలంగాణ కాంక్షను నిలబెట్టి తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన తెలంగాణ సాధనను క్రియాశీలకంగా వ్యవహరించిన గురిజాల రవీందర్‌రావును ఈరోజు ఆదివారం,21 మార్చ్,2021 న ఉదయం మంచిర్యాల పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్బంధంలో భాగమే ప్రశ్నించే గొంతులపై అమలవుతున్న అణిచివేతలోనే ఈ అక్రమ అరెస్ట్ ను పరిగణించి,ప్రజాస్వామిక వాదులందరు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో గురుతర బాధ్యతను నిర్వర్తించిన గురిజాల రవీందర్‌రావును వెంటనే విడుదల విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తూన్నది.

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణరావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.

పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2:15 PM,ఆదివారం,21-3-2021.
హైదరాబాద్.

Comments