ఆయాను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి | నెల్లూరు జిల్లా


*పౌర హక్కుల సంఘం*
         
అంగన్ వాడి ఆయాను నెల్లూరులో జాయింట్ కలెక్టర్ భార్య ఎంత దారుణంగా వేదిస్తుందో చూడండి. 

నెల్లూరు నగరంలోనీ వైఎస్సార్ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళా అంగన్ వాడి ఆయాగా ఉద్యొగం పొందింది. అయితే ఆ మహిళను నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంట్లో పనిమనిషిగా పెట్టుకోని జాయింట్ కలెక్టర్ భార్య ఆమెను నిత్యం చిత్ర హింసలు పెడుతుంది అని తనపై జరుగుతున్న వేధింపులను తట్టుకోలేక.. ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చి తన ఆవేదనను తనకు జరిగిన అన్యాయాన్ని కన్నీటి పర్యంతం అవుతూ మీడియాకు వెల్లడించింది. తనను జేసీ భార్య రోజు తన జేసీ స్టాప్ అయిన సీసీ శ్రీకాంత్, డ్రైవర్ వికాస్, దయాకర్ ల చేత చిత్రహింసలు పెట్టీ వారి చేత కొట్టించేదని, ఆరోగ్యం బాగలేక పనికి రాలేకపోతే, తన ఇంట్లో లక్షా యాభై వేలు డబ్బులు దొంగలించానని,తప్పుడు కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. అంగన్వాడి ఆయా ఉద్యోగానికి డబ్బులు ఇవ్వలేదని రెండు లక్షలు ఇస్తేనే నువ్వు ఉద్యోగంలో ఉంటావని లేకుంటే నువ్వు నీ పి.డి అందరికి ఉద్యోగాలు పోతాయని బెదిరించి మరీ అప్పులు చేసి కట్టుకున్న ఇల్లు ఆమ్మి రెండు లక్షల రూపాయలు సిసి శ్రీకాంత్ ద్వారా జెసి భార్యకి ఇచ్చానని, సాటి మహిళ అని దయ లేకుండా వేధింపులకు గురిచేసిందని. తనపై *జేసీ భార్య* *నిత్యం కాళ్ళు పట్టించుకుంటూ చిత్రహింసలు పెట్టేదని*,అలాగే చేయని తప్పులు ఆమె పై వేసి,డబ్బులు వసూల్ చేయడానికి ఆమెను 5 రోజులు నుండీ పోలీసు స్టేషన్ చుట్టూ టిప్పుతున్నారని అవేదన వ్యక్తం చేసింది. పనిమనిషి స్థానిక పోలీస్ స్టేషన్ లో జెసి సిబ్బంది మీద పిర్యాదు కూడా చెసింది. తనకు తగిన న్యాయం చేయాలని వేడుకుంది.

ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారు విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితామహిళకు న్యాయం చెయ్యాలని *పౌర హక్కుల సంఘం* డిమాండ్ చేస్తున్నది. లేదంటే ప్రజా సంఘాలతో కలసి జిల్లావ్యాపితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుక పోతామని హెచ్చరిస్తున్నాం.
*పోరాహక్కుల సంఘం*
నెల్లూరు జిల్లా కమిటి 

Comments