BBI ఇటుక బట్టి యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి | పౌర హక్కుల సంఘం

*BBI ఇటుక బట్టి యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి*
 *మృతుల కుటుంబాలకు ఒక్కక్కరికి 50లక్షలు, క్షతగాత్రులకు 5లక్షలు ఎక్షిగ్రెషియా చెల్లించాలి*.

 *పౌరహక్కుల సంఘం* (CLC),
 *తెలంగాణ ప్రజా ఫ్రంట్* , *జాతీయ వినియోగధారుల ఫోరమ్ మరియు మానవ హక్కుల వేదిక* డిమాండ్.

పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ BBI ఇటుక బట్టి లోని సుమారు 25-30మంది కార్మికులు నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి పెద్దపల్లి కి ట్రాక్టర్ లో వస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి అజాగ్రత్త ట్రాక్టర్ నడిపి సడెన్ బ్రేక్ వేయడంతో పెద్దపల్లి - మంథని ఫ్లైఓవర్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో పరశురామ్ అనే కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు. అలాగే తీవ్ర గాయాలు ఐన పింకీ అనే కార్మికురాలు అపస్మారక స్థితులో ఉండటంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన ఇతర కార్మికులను  నిన్న రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స కోసం ఉంచడం జరిగింది.
ఈరోజు పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, hrf ఆధ్వర్యంలో క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్లేసరికి రాత్రికిరాత్రే ఓనర్ పూచికత్తుపై అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించారు. కరీంనగర్ లో చికిత్స పొందుతున్న పింకీ అనే కార్మికురాలు ఈ రోజు చనిపోయింది అని తెలిసింది.

    ఈ ఘటనపై కార్మికులను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన BBI ఇటుక బట్టి యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ, అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని,మిగితా క్షతగాత్రులకు 5లక్షలు నష్ట పరిహారం ఇస్తూ మెరుగైన వైద్య సదుపాయలు కలిపించాలని డిమాండ్ చేస్తున్నాం.
మామూళ్ళ మత్తులో జోగుతూ 
జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీలల్లో వరుసగా  హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్న రెవిన్యూ శాఖ గాని కార్మిక శాఖ గాని స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీలల్లో జరుగుతున్న ఆకృత్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

1)GAV ప్రసాద్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, పౌర హక్కుల సంఘం
2)నారా వినోద్, జిల్లా కోశాధికారి, పౌర హక్కుల సంఘం 
3) గుమ్మడి కొమురయ్య, జిల్లా కన్వీనర్,తెలంగాణ ప్రజా ఫ్రంట్
4)పులిపాక రవీందర్, ప్రజా సంఘాల నాయకులు
5)md.మాజీద్,జిల్లా అధ్యక్షులు, జాతీయ వినియోగధారుల ఫోరమ్, మానవ హక్కుల ఫోరం
6)చాంద్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్, వినియోగధారుల ఫోరమ్

తేదీ: 30-03-2021
పెద్దపల్లి

Comments