ఉపా చట్టాన్ని రద్దు చేయాలని సభ | కడప జిల్లా

ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ఊ పా చట్టాన్నిరద్దు చేయాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నాయకులు
____________________________
  కడప పట్టణంలోని హోచ్ మెన్ భవన్ లో ఆదివారం ఉదయం 11 గంటల నుండి ఊ పా చట్టం రద్దు కు,అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల బాధ్యుల విడుదల కొరకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిరసన సభ జరిగింది. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలహక్కుల కోసం మాట్లాడుతున్న మేధావులను, రచయితలను, సామాజిక కార్య కర్తలను,పౌర హక్కుల నాయకులను దేశ ద్రోహం కేసులు పెట్టి  నిర్బందిస్తున్నరని ,ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 40 మంది దాకా సామాజిక కార్య కర్తల పై చట్ట వ్యతిరేక కార్య కలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి ఇప్పటికీ 10 మందిని అరెస్ట్ చేసిన తీరు పై  ఊ పా చట్టం ఎట్లా అప్రకటిత ఎమర్జెన్సీ ని తీసుక వచ్చిందో వివరించారు.
   . సీపీ ఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని వ్యతిరేకంగా అన్ని వామ పక్షాలు,ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని,సీపీఐ అటువంటి ఉద్యమాల్లో ఉంటుందని అన్నారు.బి.సి సంఘం నాయకులు అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న వాళ్లంతా ఈరోజు ప్రభుత్వానికి శత్రువు లై నారని, ఊ పా గురించి,ప్రభుత్వ నిరంకుశ విధానాల గురించి ప్రజలు తెలుసుకొని మనకోసం ఉద్యమిస్తున్న వారికి మద్దతు ఇవ్వాలని చెప్పారు.రాయల సీమ దళిత హక్కుల సంఘం నాయకులు జె.వి.రమణ ప్రసంగిస్తూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను,అరెస్ట్ లను ఖండిస్తూ ఎంత నిర్భందం ప్రయోగించినా ప్రజలకోసం మాట్లాడే గొంతులు మూగబోవని అన్నారు.
  చైతన్య మహిళా సంఘం నాయకురాలు పద్మ మాట్లాడుతూ 80 ఏళ్ల కవి,మేధావి వర వర రావు,90 శాతం వికలాంగుడు ప్రో!! సాయి బాబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశాడని ఆరోపించడం,బెయిల్ రాకుండా చేస్తూ ఏళ్ల తరబడి జైల్లో పెట్టడం సిగ్గు చేటని అన్నారు.
    విరసం రాష్ట్ర కార్య వర్గ సభ్యు రాలు వరలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ  నవంబర్ నుండి డిల్లీ శివారులో ఆందోళన చేస్తున్న రెండు వందల మంది రైతులు చనిపోతే స్పందించని ప్రభుత్వం, రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపిన వారిని వెంటాడి కేసులు పెట్టి అరెస్టులు చేస్తోందని,కార్పొరేట్ కంపెనీలకు దోసి పెట్టడానికి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాల ద్వారా ఎవర్నీ మాట్లాడ నివ్వని  నియంతృత్వం అమలు చేస్తోందని అన్నారు...
   ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు మనోహర్,ఉపాధ్యక్షులు పి.రెడ్డెయ్య,జిల్లా కార్యదర్శి ఆర్.రవిశంకర్,AISF నాయకులు గంగా సురేష్,RSYF నాయకులు సుబ్బారాయుడు,AITUC రాష్ట్ర నాయకులు నాగసుబ్బారెడ్డి,ప్రగతి శీల కార్మిక సమాఖ్య నుండి శ్రీనివాసుల రెడ్డి,బంజారా సంఘం నాయకులు శంకర్ నాయక్,దళిత సమాఖ్య నాయకులు ఎల్లయ్య,ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుభాషిణి,రాయలసీమ మహిళా సంఘం నాయకురాలు తస్లీమా, రాయల సీమ మహిళా శక్తి నుండి లక్ష్మి దేవి,DYFI జిల్లా అధ్యక్షులు జి.జగదీష్,జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు....
     __ ఊ పా రద్దు పోరాట కమిటీ,
             కడప జిల్లా.
              28/02/2021.

Comments