నరెడ్ల శ్రీనివాస్ గారికి
పౌర హక్కుల సంఘం వినమ్రనివాళులు...
ఉద్యమ నేత నరెడ్ల శ్రీనివాస్ గారు ఈ రోజు15 ఫిబ్రవరి,2021 ఉదయం 6 గంటల మనకు భౌతికంగా కరోనా వలన దూరమైండు.వారికి వినమ్రనివాళులు...
అవినీతికి, అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వాస్తవవాది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో,హుజురాబాద్ లో 1974,75 కాలంలో చైతన్యాన్ని ప్రసరింప చేసిన ఉద్యమకారులలో ముఖ్యులు. కాళోజిని 1974లో,1975 లో శ్రీశ్రీ ని హుజురాబాద్ సభ కు జనసాహితి సంస్థ తరపున తీసుకవచ్చిన ప్రధాన ఉద్యమ కారుడు. విద్యార్థి,కవి,రచయిత,జర్నలిస్ట్,ప్రతిభావవంతుడైన వక్త.వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంఘాల రాష్ట్ర నాయకులు,లోక్ సత్తా ఉద్యమ నేత నరెడ్ల శ్రీనివాస్ గారు కరోనా వలన 12 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు15 ఫిబ్రవరి,2021 ఉదయం 6 గంటల మనకు భౌతికంగా దూరమైనాడు .వారికి పౌర హక్కుల సంఘం వినమ్రనివాళులు అర్పిస్తుంది..
ఉదయం 7:30,15,ఫిబ్రవరి,2021.
పౌర హక్కుల సంఘం, తెలంగాణ.
Comments
Post a Comment