ఉపా చట్టాన్ని రద్దు చేయాలని సభ | శ్రీకాకుళం జిల్లా

ఈ వేళ 28ఫిబ్రవరి ఆదివారం ఉదయం11గంటలకు పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద    ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో  "ఉపా" చట్టం రద్దుకై పోరాడుదాం నిర్బంధపై నిరసన సభ జరిగింది. ఈ సమావేశం కి అధ్యక్షత పత్రి.దానేసు వహించారు. ఈ సమావేశంలో  ఆంద్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేలంగి.చిట్టిబాబు మాట్లాడుతూ  దేశంలో ,రాష్ట్రంలోపాలిస్తున్న  వారు ప్రజా వ్యతిరేక పాలనను మేధావులు, కవులు  రచయితలు, కళాకారులు ప్రశ్నిన వారిని  UAPA చట్టం కింద అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతులను మూస్తున్నారని అన్నారు.భారత రాజ్యాంగం వ్యతిరేక పాలన కొనసాగుతున్నది, వరవరరావు, సాయిబాబా లాంటి ప్రజా మేధావులు సంవత్సరాలు తరబడి జైలులో నిర్బంధించి హక్కులు కాలరాస్తున్నారని, ప్రజావ్యతిరేక UAPA ని తక్షణమే రద్దు చేయాలని డిమెండ్ చేశారు. కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి         K. కృష్ణ మాట్లాడుతూ దేశంలో దళితులు,పిడిత,ఆదివాసీ, మత మైనార్టీల వ్యతిరేక పాలనను ప్రశ్నించే వారిపై ఉపా కేసులు పెట్టి మాట్లాడే నాయకులను జైల్లో అక్రమంగా పెట్టడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా, దేశ సంపదను కార్పొరేట్ శక్తులను కట్టబెట్టి  చర్యలను నీరసించి వారిని ,దేశరాజధాని లో రైతులు హక్కులను కలరాసే చర్యలను నీరసించి వారిని ఉగ్రవాదులు గా ముద్రవేసి అరెస్టులు చేస్తున్నారు,  విశాఖ ఉక్కు,ఆంధ్రుల హక్కు ని నినదించేవారికూడా బావిసత్లో ఉగ్రవాదులుగా ముద్రవేసి  ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే పరిస్థితి వస్తుంది, అందుకు ప్రజావ్యతిరేకత ఫసిస్టు కాషాయ పాలన కు వ్యతిరేకంగా ఉద్యమించడమే మన ముందున్న తక్షణమే కర్తవ్యంగా భావించి లని అన్నారు.                              ఈ సమావేశంలో అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షుడు జోగి.కోదండ, చైతన్య మహిళ సంఘం నాయకులు పోతానపల్లి అరుణ,ప్రజా కళా మండలి నాయకులు కొర్రయి.నీలకాంతం, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు వీరస్వామి, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకులు పుచ్చా.దుర్యోధన, రైతు సంఘం నాయకులు దాసరి.శ్రీరాములు, PDSU నాయకులు మద్దిల.వినోదకుమార్,KNPS జిల్లా అధ్యక్షుడు బేలమరప్రభాఖర్,తదితరులు పాల్గొన్నారు.

Comments