"ఉపా" చట్టం రాజ్యాంగ వ్యతిరేకం.
"ఉపా"చట్టాన్ని రద్దు చేయాలని సభ డిమాండ్.
-------------------------------------
రాష్ట్రంలో వివిధ ప్రజాసంఘాలతో ఏర్పడిన "ఉపా రద్దు పోరాట కమిటీ" పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో 28-02-2021 ఆదివారం ఉదయం అనంతపురం ప్రెస్ క్లబ్ నందు ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షతన సభ "చట్టవ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం--UAPA ను రద్దు చేయాలని సభ నిర్వహించారు.
ఈ సభలో వక్తలు మాట్లాడుతూ "ఉపా" చట్టం అంటే అనేది రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తోందని, వెంటనే ఆ అప్రజాస్వామిక చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉపా చట్టం అనేది పౌరులు ప్రాధమిక హక్కులను అణచివేస్తోందని, వ్యక్తులను ఉగ్రవాదుల పేరిట పరిగణిస్తోందన్నారు. 87 సంవత్సరాల క్రిస్టియన్ ఫాదర్ 'స్టాన్ స్వామి' ని ఉపా చట్టం కింద ప్రభుత్వం నిర్బందించిదని, ఆయన కనీసం మంచినీళ్ళ గ్లాసు కూడా పట్టుకోలేడని, అలాంటి ముదుసలి వ్యక్తి రాజ్యంపై యుద్ధం చేశాడు హాస్యాస్పదం అన్నారు. వరవరరావు లాంటి 83 సంవత్సరాల వ్యక్తిని, 90శాతం వికలాంగుడైన ప్రొ. సాయిబాబా ను , దేశంలో అనేక మంది మేధావులను ఉపా లాంటి చట్టాలు కింద నిర్బందించారని అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజా సంఘాల నాయకులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టులు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతాంగం పై కూడా ఖలిస్థాన్ ఉగ్రవాదుల ముద్ర వేశారని, కేవలం ట్విట్టర్ లో ఒక ట్వీట్ ను కొన్ని మార్పులతో రీట్వీట్ చేసిన దానికి 21 సంవత్సరాల అమ్మాయి పై ఉగ్రవాది ముద్ర వేసి "ఉపా" చట్టం కింద అరెస్టు చేయడం ఆ చట్టం యొక్క దుర్వినియోగాన్ని, పాలకుల నిరంకుశత్వాన్ని సూచిస్తోంది వక్తలు మండిపడ్డారు. తక్షణమే ఈ "ఉపా" చట్టాన్ని రద్దు చేయాలని సభ డిమాండ్ చేసింది.
ఈ సభకు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓ.పి.డి.ఆర్) జిల్లా అధ్యక్షుడు యస్. అబ్దుల్ రజాక్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ఓపిడిఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. రామకుమార్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. క్రాంతి చైతన్య, మానవహక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎ.చంద్రశేఖర్, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు నల్లప్ప, అఖిలభారత కిసాన్ మజ్దూర్ సంఘ్ (AIKMS) రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ప్రభాకర రెడ్డి, కులనిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఇ. శ్రీరాములు, ప్రజాకళామండలి జిల్లా అధ్యక్షురాలు జి. రత్నమ్మ ప్రసంగించారు.
ఈ సభలో ఓపిడిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం. రామక్రిష్ణ, పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఆదినారాయణ, మానవహక్కుల వేదిక నాయకులు యస్.యం. బాషా, ప్రముఖ రచయిత డా.కె.నాగేశ్వరాచారి, పట్టణపేదల సంఘం నాయకులు పెద్దన్న, కులనిర్మూలన పోరాట సమితి నాయకులు నల్లప్ప, రాము మరియు ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
"ఉపా చట్టం రద్దు పోరాట కమిటీ " అనంతపురం జిల్లా.
(కమిటీ తరుపున యం.రామక్రిష్ణ, ఓపిడిఆర్, జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Post a Comment