హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్యలను ఖండిస్తున్నాం,హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ మరియు CBIతో విచారణ జరిపించాలి.
పౌరహక్కుల సంఘం - తెలంగాణ.
గత సంవత్సరo 2020 మే లో వణ్యప్రానులను వేటాడిండనే నెపంతో మంథని పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ అయినా శీలం రంగయ్య కేసును హైకోర్టు లో వేసినారు. అప్పుడు ఆ కేసును వాపస్ తీసుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. మరియు చాలా కేసుల్లో తమకు వ్యతిరేకంగా వాదిస్తున్నాడనే కక్షతో వామన రావు దంపతులపై స్థానిక TRS నాయకులు ఎలాంటి చట్టబద్ద పాలన లేకుండా, కక్షతోనే ఈ హత్యలు చేశారని పౌరహక్కుల సంఘం - తెలంగాణ భావిస్తుంది.గట్టు వామన్ రావు, నాగమణిల హత్యలను పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది.
చనిపోయే ముందు మృతుని వాంగ్మూలంతో పాటు చాలా సందర్భాల్లో గట్టు వామన్ రావు దంపతులు తమకు ప్రాణహాని ఉన్నదని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసినారు అయినా కూడా పోలీస్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ దాడుల పరంపరలో భాగంగానే ఈ హత్య జరిగింది..పెద్దపెల్లి జిల్లాలో రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్న టిఆర్ఎస్ నాయకుల భూమాఫియాను, అవినీతిని వెలికి తీస్తూన్నందుకు అలాగే మంథని మధుకర్ ఘటన మొదలు శీలం రంగయ్య లాకప్ డెత్ కేసు వరకు ప్రజల పక్షాన నిలిచినందుకు ఈ హత్యలకు పాల్పడ్డారని పౌర హక్కుల సంఘం- తెలంగాణ భావిస్తుంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పుట్టినరోజు నాడు ఇద్దరు న్యాయవాదులను దాడి చేసి చంపి రాజ్యాంగంపై వారి పార్టీకి ఉన్న గౌరవం ఏ పాటిదో తెలియజేస్తుంది. కాబట్టి ఈ హత్యకు స్థానిక జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ముఖ్యమంత్రే నైతిక బాధ్యత వహించాలని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఈ హత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ మరియు CBI విచారణతో జరిపించాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.
1)మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌరహక్కుల సంఘంతెలంగాణ.
2)GAV ప్రసాద్, అధ్యక్షులు ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం
3) ఏనుగు మాల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
4.మహ్మద్ అక్బర్,ఉపాధ్యక్షులు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
5)శ్రీపతి రాజగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
5.పుల్ల సుచరిత, సహాయ కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం
6. నారా వినోద్, కోశాధికారి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
8:00 సాయంత్రం,17,ఫిబ్రవరి,2021.
పెద్దపెల్లి.
Comments
Post a Comment