ఇటుక బట్టి యజమానిపై చర్యలు తీసుకోవాలి | కరీంనగర్ జిల్లా


పెద్దపెల్లి జిల్లా గౌరెడ్డిపేట LNC ఇటుక బట్టి
యాజమాని భాస్కర్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని
ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ కు  
 మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి  పౌరహక్కుల సంఘం,తెలంగాణ పిర్యాదు..

  పెద్దపెల్లి జిల్లా గౌరెడ్డి పేట LNC ఇటుక బట్టి లో ఒరిస్సా వలస కార్మిక యువతిపై ఇటుకబట్టి యజమానులు చేసిన అత్యాచారం గురించి, మిగితా 200 మంది వలస కార్మికులు అమర్ చంద్ కళ్యాణ మండపం నుంచి నిన్న ఉదయం బలవంతంగా LNC ఇటుక బట్టి లోకి యజమానులు తరలించాడాన్ని మరియు  ఒరిస్సా రాష్ట్రం బలంఘీర్ జిల్లా  జిల్లా నుండి కార్మిక శాఖ అధికారులు, పోలీసులు పెద్దపెల్లికి వస్తున్న  సమాచారాన్ని అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC )కు ఈ సంఘటనపై ఫిర్యాదు చేసిన విషయాన్ని మరియు స్వస్తలాలకు వెళ్లుదాం అనుకున్న 200మంది కార్మికులను బలవంతంగా మల్లి ఇటుక బట్టిలకు తరలించిన విషయాన్ని ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారికి ఫోన్ ద్వారామాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి  పౌరహక్కుల సంఘం,తెలంగాణ పిర్యాదు.. తెలియజేయడం జరిగింది. ఆమె జిల్లా కలెక్టర్ గారి తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పినారు.
కార్మిక చట్టాలను ఉల్లంఘించి గత కొద్ది సంవత్సరాలుగా పెద్దపెళ్లి ప్రాంతంలోని ఇటుక బట్టి యాజమానులు యదేచ్ఛగా దాడులతో అత్యాచారాలతో, నిర్భంధాలతో శ్రమదోపిడి చేస్తూ  వలస కార్మికులతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. గతంలో2015 డిసెంబర్ 3న SVK ఇటుక బట్టి లో సూర్జా బాగ్ అనే ఓడిశా వలస  గర్భిణీ మహిళలను అతి దారుణంగా యజమానులు కొట్టి చంపడం జరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఒరిస్సా,  తెలంగాణ రాష్ట్రాలకు,హై కోర్ట్ హైదరాబాద్ మరియు ఒడిషా హై కోర్ట్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇటుకబట్టి యజమానుల వైఖరిలో వారిలో మార్పు రాలేదు 
చట్ట ప్రకారం ఇటుక బట్టీల ను నడుపు పోవాలి కానీ మాఫియా మాదిరిగా వ్యవహరించడం సరికాదు.   యాజమాన్యం వేదింపులు భరించలేక  24 జనవరి,21పారిపోయిన వారిని, తీసుకువచ్చి ఇటుకబట్టి యజమాని మిగతా ముగ్గురు సహాబట్టి యజమానులతో ఆమెపై అత్యాచారం చేసి ఇటుకబట్టి కి తీసుకువచ్చి, ఆరోగ్యం బాగాలేకున్న పనులు చేయించారు. మరొక్కమారు 8 ఫిబ్రవరి నాడు బట్టి యజమానులు మళ్ళీ బెదిరిస్తే పారిపోయిన ఘటనను నీరుగార్చి, కార్మిక శాఖ,రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు.
కావున LNC ఇటుక బట్టి యజమాని భాస్కర్ మరియు సహ యజమానులపై అత్యాచారo, ఫోక్సో చట్టం, మరియు కార్మిక చట్టాల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.

1)మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌరహక్కుల సంఘంతెలంగాణ.
2)GAV ప్రసాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం
3) ఏనుగు మాల్లారెడ్డి,  ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం
4)శ్రీపతి రాజగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు, పౌరహక్కుల సంఘం
5) నారా వినోద్, కోశాధికారి, పౌరహక్కుల సంఘం
6) గుమ్మడి కొమురయ్య, జిల్లా కన్వీనర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్
7)గాండ్ల మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు, తెలంగాణ ప్రజా ఫ్రంట్.

5:30PM,13 ఫిబ్రవరి,2021.
పెద్దపెల్లి..

Comments