పౌర హక్కుల సంఘం తెలంగాణ,తెలంగాణ ప్రజాఫ్రంట్ పెద్దపెల్లి జిల్లా ఆధ్వర్యంలో,11 ఫిబ్రవరి,2021,న పెద్దపెల్లి జిల్లా, గౌరెడ్డిపేట గ్రామ శివారులోని LNC ఇటుకబట్టిలో పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన భార్యాభర్తల యువజంట యజమాని రామిండ్ల భాస్కర్ దౌర్జన్యానికి భయపడి తమ స్వరాష్ట్రానికి 23 జనవరి 2021న పారిపోతున్న సందర్బంగా రామగుండం రైల్వే స్టేషన్లో ఇటుకబట్టి యజమాని వ్యక్తులు ఆ జంట వలస కార్మికులను బాగా కొట్టి తమ నిర్బంధం లోకి తీకుకుని LNC ఇటుకబట్టి యజమాని రామిండ్ల భాస్కర్ మరియు అతని సహచర ఇతర ఇటుకబట్టి యజమానులు ముగ్గురు కలిసి 23 జనవరి,2021న రాత్రి వలస కార్మిక యువతిపై సామూహిక అత్యాచారం చేసినారు. బలంతంగా, దాడులు చేస్తూ, సుమారు 200 మంది ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన, దళిత, ఆదివాసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ఇటుకలు తయారుచేసే వలస కార్మికులను,మూడున్నర నెలలుగా తెలంగాణ రాష్ట్రం,పెద్దపెల్లి జిల్లా, గౌరెడ్డిపేట గ్రామ శివారులోని LNC ఇటుకబట్టిలో, యజమాని రామిండ్ల భాస్కర్ క్రూరంగా హింసిస్తూ,దాడులచేస్తూరోజుకు 16 నుండి 18 గంటలకు వరకు పనిచేయుస్తూ,వారిని స్వస్థలాలకు పోనివ్వకుండా నిర్బంధించి కనీస వేతనాలు ఇవ్వకుండా, గూండాలతో నిత్యం దాడులు అత్యాచారాలు చేస్తున్నారని కార్మికులు విలపిస్తూ పౌర హక్కుల సంఘం నిజానిర్దారణ లో చెప్పినారు.పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం,తెలంగాణ ప్రజాఫ్రంట్ పెద్దపెల్లి జిల్లా ఆధ్వర్యంలో,11 ఫిబ్రవరి,2021,న దాడులకు గురై పెద్దపెల్లి పట్టణం, రంగంపల్లి,సఖి కేంద్రంలో తాత్కాలిక పునరావాసం ఉన్న 9 మంది బాధిత మహిళలను,బాలబాలికలను మరియు పెద్దపెల్లి అమర్ చంద్ ఆడిటోరియంలో ఉన్న 8 మంది ఇటుకబట్టి వలస కార్మికులతో పాటు,గౌరెడ్డిపేట గ్రామ శివారులోని LNC ఇటుకబట్టిలో పనిచేస్తున్న,200 మంది ఇటుకబట్టి వలస కార్మికులను కలిసి సేకరించిన నిజానిర్దారణ వివరాలను తదనంతరం 1:00పీఎం కు పెద్దపెల్లి జిల్లా collector కార్యాలయంలో, DPO కు మెమొరాండం ఇచ్చి.LNC ఇటుకబట్టి యజమాని భాస్కర్ మరియు ముగ్గురు సహా ఇటుకబట్టియజమానులపై,పొక్సో చట్టం నమోదు చేయాలని,200 మంది ఆదివాసీ వలస ఇటుకబట్టి కార్మికులను ఇటుకబట్టిలో నిర్బంధంలో నుంచి విడుదల చేయిన్చాలని, కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డ LNC ఇటుకబట్టి యజమాని భాస్కర్ పై Wages act 1948,Bonded labour act 1976,Inter state migrant worker act 1979 and Child labour act 1986 కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ collector కు వినతి పత్రం సమర్పించాం.
ఇట్లు.......
1.ఎన్. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి పౌరహక్కుల సంఘం,తెలంగాణ
2.మాదన కుమారస్వామి, .రాష్ట్ర సహాయ కార్యదర్శి, తెలంగాణ పౌర హక్కుల సంఘం.
3.GAV ప్రసాద్,అధ్యక్షుడు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
4.ఏనుగు మల్లారెడ్డి,.ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
5.శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
6.నార వినోద్,కోశాధికారి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
7.పోగుల రాజేశం, EC, మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
8.కడ రాజయ్య,EC, మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
9.మోటపలుకుల వెంకట్,EC, మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
10.గుమ్మడి కొమురయ్య, కన్వీనర్, తెలంగాణ ప్రజాఫ్రంట్, పెద్దపెల్లి జిల్లా.
11.గాండ్ల మల్లేశం, జిల్లా కమిటీ మెంబర్,తెలంగాణ ప్రజాఫ్రంట్, పెద్దపెల్లి జిల్లా.
12.బండారి రాజలింగయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి, భారత నాస్తిక సమాజం.
సాయంత్రం,5:00గంటలు,11,ఫిబ్రవరి,2021.
జిల్లా కలెక్టర్ కార్యాలయం, పెద్దపెల్లి జిల్లా.
Comments
Post a Comment