అమెవెళ్లిపోయింది.
...
అవును
నిజంగానే
She is far away.
ప్రేమించే అక్క, అన్నం పెట్టే అక్క
నా ఇష్టాలేమిటో, అయిష్టాలేమిటో తెలిసిన అక్క,
నాకు ఏ ఆధారం లేనప్పుడు నీడనిచ్చిన అక్క,
తోబుట్టువు కన్నా నా గురించి ఎక్కువగా ఆలోచించిన అక్క,
ప్రేమంతా కలిపి ముద్దలు చేసి పెట్టిన అక్క,
బాలగోపాల్ గారితో ప్రేమగా ప్రకాశం మహిళలు, జంటకవులు అని పిలిపించుకున్న అక్క,
ప్రశాంతంగా, దూరంగా వెళ్ళిపోయింది.
కారే కన్నీళ్ళమీదుగా
బరువెక్కిన గుండెల మీదుగా
మసకబారిన మా చూపుల మీదుగా
అలా తరలివెళ్ళిపోయింది.
రెండురోజులుగా నీ జ్ఞాపకాలతోనే మెలితిరిగిపోతున్నాను అక్కా. మనం కలిసి తిరిగిన చోటులు, కలిసి నడిచిన అడుగులు వెంటాడుతున్నాయి అక్కా!
మిస్ యు అక్కా!
(మా అన్నపూర్ణ అక్క వెళ్ళిపోయింది)
Comments
Post a Comment